ఆవిర్భావం : 2014 జూన్ 2రాజధాని : హైదరాబాద్
జిల్లాలు : 33
శాసన నిర్మాణం : ద్విసభా విధానం
విస్తీర్ణం : 1,12,077 చ.కి.మీ
విస్తీర్ణంలో స్థానం : 11
అధికార భాషలు : తెలుగు, ఉర్దూ
- తెలంగాణ రాష్ట్రం సుదీర్ఘమైన చరిత్ర సంస్కృతిని కలిగి ఉంది.
- ప్రాచీన శిలాయుగానికి చెందిన అవాసాలు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి (కరీంనగర్), నాగార్జున కొండ, వేములపల్లి, ఏటూరునాగారం, క్యాతూర్, బాసర మొదలైన ప్రాంతాలలో బయల్పడ్డాయి.
- క్రీ.పూ 6వ శతాబ్దంలో ఏర్పడిన షోడశ మహాజనపదాలలో ఏకైక దక్షిణాది రాజ్యమైన ఆస్మక రాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడినదే. ఆస్మక రాజధాని 'పోదన'ను నేటి బోధన్ గుర్తించారు.
- బుద్దుని సమకాలీకుడు 'బావరి' అనే బ్రహ్మణుడు ఆదిలాబాద్ లో బావకుర్తిలో స్థిరపడి బుద్దుని బోధనలు గురించి తెలుసుకొనుటకు మగధకు శిష్యులను పంపినట్లు తెలుస్తుంది.
- వాయు పురాణం తెలింగు జనపదం గురించి మొదటిగా పేర్కొంది. తెలింగులు నివశించే ప్రాంతమే తెలంగాణ.
- ప్రాచీన పురాణాలలో ఒకటైన మత్స్య పురాణంలో మంజీరక దేశ ప్రస్తావన గలదు. అనగా మంజీర నది చుట్టుప్రక్కల ప్రాంతం. మౌర్యుల సామ్రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. అశోకుని శాసనాలు మెగస్తనీసు 'ఇండికా' గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన గలదు.
- తెలంగాణలో మొదటి రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. వీరి తొలుత కోటిలింగాల (కరీంనగర్) కేంద్రంగా పరిపాలన చేశారు.
- వీరి తర్వాత ఇక్ష్వాకులు తెలంగాణ తూర్పు ప్రాంతాలు పాలించగా వాకాటకులు పశ్చిమ ప్రాంతాలను పాలించారు. తర్వాత బాదామి చాళుక్యులు తెలంగాణను జయించి తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. మొదటి పులికేశి శాసనం నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో లభించింది. వీరి తర్వాత రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
- కాకతీయులు మొదట ఉత్తర తెలంగాణాలో ప్రారంభించి క్రమంగా తెలంగాణా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- తర్వాత తెలంగాణ కుతుబ్షాహిలు (1514. 1687), ఆసఫ్ జాహిలు (1724 - 1948) ఆధీనంలోకి వెళ్ళింది.
- 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో విజయవంతంగా ముగించబడింది. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనమైనది.
- 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ ఆంధ్ర నాయకుల మధ్య "పెద్ద మనుషుల ఒప్పందం” ఢిల్లీలో కుదర్చబడింది.
- ఈ ఒప్పందం మేరకు హైదరాబాద్ లోని తెలుగు ప్రాంతాలు (తెలంగాణ)ను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసారు.
- 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యంకు గురవుతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రియల్ 27న కె. చంద్రశేఖరరావుగారు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ని ఏర్పాటు చేశారు.
- 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ సాధనకు కె. చంద్రశేఖరరావుగారు నిరాహారదీక్ష ప్రారంభించారు.
- తెలంగాణ రాష్ట్రంను ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం 2009 డిసెంబర్ 9న ప్రకటించింది.
- కానీ సీమాంధ్ర నాయకులు చేసిన కృత్రిమ ఉద్యమం, లాబీయింగ్కు లొంగిపోయిన కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి వెనక్కి తగ్గి 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించింది.
- ప్రకటించిన తెలంగాణను సాధించుటకు కె.సి.ఆర్, జాయింట్ యాక్షన్ కమిటీలు 2010-2014 మధ్య మలిదశ ఉద్యమం నిర్వహించారు.
- చివరికి కేంద్రం 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వవస్థీకరణ బిల్లును కేంద్ర క్యాబినెట్ 2014 జనవరి 7న ఆమోదించింది.
- పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్ట్రపతి 2014 మార్చి 1న బిల్లుకు ఆమోదం తెలిపారు.
- 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది (ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి).
- భారత యూనియన్లో 29వ రాష్ట్రం 'తెలంగాణ'.