ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) - Nehru Outer Ring Road(NORR) Hyderabad | Vinays Info
- ఇది హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉంది. ఈ రింగ్ రోడ్డు పొడవు 158 కి.మీ. దీన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది. ఈ రింగ్ రోడ్డుకు మరో పేరు ‘నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు’.
- పంచాయతీ రాజ్ రోడ్లు అధికంగా ఉన్న జిల్లా - మహబూబ్ నగర్
- పంచాయతీ రాజ్ రోడ్లు అత్యల్పంగా ఉన్న జిల్లా రంగారెడ్డి (హైదరాబాద్ కాకుండా).
- అన్ని రకాల రోడ్లను కలిపి చూసినప్పుడు.. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్ల విస్తీర్ణం అధికంగా, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి.
- హైదరాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - మచిలీపట్నం రహదారులను నిజాం కాలంలోనే నిర్మించారు.
- 1936 నాటికే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు బస్సులు నడిపారు.
- తెలంగాణ రాష్ట్రం మీదుగా 14 జాతీయ రహదార్లు వెళుతున్నాయి.
- రాష్ట్రంలోని అన్ని రకాల రోడ్ల మొత్తం పొడవు 26,837 కి.మీ.
- తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-44.