Event-Date: 15-Oct-2016
Level: international Topic: Conferences and meetings
ఎనిమిదో బ్రిక్స్ సదస్సు గోవా రాజధాని పణజీలో శనివారం ప్రారంభంకానుంది. రెండ్రోజుల పాటు (oct 15, 16)తేదీల్లో జరగానున్న ఈ సదస్సులో ఈసారి ఉగ్రవాదం పాకిస్థాన్‍పై అంక్షలు విధించడం వంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. బ్రిక్స్‌కు ముందే శనివారం చైనా అధ్యక్షుడు జీ. జిన్‍పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్స్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. ఉడీఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే జరుగుతున్న ఈ సదస్సులో ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించే విషయంలో తన డిమాండ్‍ను భారత్ బలంగా వినిపించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.