Type Here to Get Search Results !

Vinays Info

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ | Ernest Rutherford - VINAYS INFO

Top Post Ad

🔹ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (ఆంగ్లం : Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson), ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఆగస్టు 30 1871 – అక్టోబరు 19 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిజ్ఞుడు, ఇతనికి అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు.

🔹అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు, మరియు అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత బోర్ నమూనా లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు.

🔹ఇతడు రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగంచేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

🔹బాల్యం

🔹న్యూజిలాండ్ లోని నెల్సన్లో 1871 ఆగస్టు 30న ఓ వ్యవసాయదారుడి 12 మంది సంతానంలో నాలుగో వాడిగా పుట్టిన రూథర్‌ఫర్డ్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది.

🔹పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్‌ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్‌ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్‌ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు.

👉పరిశోధనలు

🔹ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే విద్యుదయస్కాంత తరంగాలను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.

🔹ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడాలోని మెగిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు.

🔹అక్కడే యురేనియం,థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు.

🔹రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు.

🔹ఈ సూత్రం ప్రకారం రేడియో డేటింగ్ పద్ధతి ద్వారక్వ భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్‌ అందుకున్నాడు.

👉కేంద్రక ఆవిష్కరణ

👉కెనడా నుంచి ఇంగ్లండ్‌ తిరిగి వచ్చిన తర్వాత పలుచటి బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫాకిరణాలను ప్రసరింపజేసినప్పుడు 20000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు.

🔹అందుకు కారణం పరమాణువులో ధనావెశమున్న కేంద్రకం ఉండుటవలన.ఈ కారణంగా కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు వాటిని వికర్షించడమేనని కనుగొన్నాడు.

🔹సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనాగా పేరొందింది. దీనినె గ్రహమండల నమూనా అందురు.

🔹ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్‌ బహుమతులు సాధించడం విశేషం.

🔹అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్‌ఫోర్డియం అని పేరు పెట్టారు.

👉ప్రచురణలు

🔹Radio-activity (రేడియో ధార్మికత) (1904), 2nd ed. (1905),

🔹Radioactive Transformations (రేడియోధార్మిక పరివర్తన) (1906),

🔹Radiations from Radioactive Substances (రేడియోధార్మిక పదార్థాల నుండి వెలుపడు వికిరణాలు) (1919)

🔹The Electrical Structure of Matter (పదార్థం యొక్క విద్యుత్ వ్యవస్థ) (1926)

🔹The Artificial Transmutation of the Elements (మూలకాల కృత్రిమ పరివర్తనం) (1933)

🔹The Newer Alchemy (1937)

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.