ఛార్లెస్ బబాజ్ 💻
వర్ధంతి సందర్బంగా...
ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.ఈయనను కంప్యూటర్ పిత అంటారు.
వ్యక్తిగత జీవితము:
〰〰〰〰〰〰〰
తన పై చదువులకు 1810 లోట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జికి వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్లను చదివిన బబాజ్, అక్కడి గణిత శాస్త్ర బోధనతో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిసి 1812లోవిశ్లేషక సమాజమునుస్థాపించాడు.కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు .
కంప్యూటర్ డిజైన్:
〰〰〰〰〰〰〰
గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నంచాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ ను నిర్మిస్తే అది చక్కగా పనిచేసింది.
🔻సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు.
🔻రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు.
🔻గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు.
🔻బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు.
🔻1871లో 79వ ఏట మరణించారు.