Type Here to Get Search Results !

Vinays Info

Indian History - Sindu Culture

Top Post Ad

- ఇండియన్‌ హిస్టరీ - ఆర్‌ఆర్‌బీ, డీఎస్సీ పోటీ పరీక్షల పత్యేకం
- సింధు నాగరికత

- భారతదేశంలో లోహయుగాన్ని ప్రారంభించినవారు - ద్రావిడులు

- సింధు నాగరికత రేవు పట్టణం - లోథాల్‌

- సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి (చిత్ర లిపి)

- సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం (తెలియని లోహం - ఇనుము)

- సింధు లోయ నాగరికత నిర్మాతలు - ద్రావిడులు


- సింధునాగరికతా కాలం క్రీ.పూ- 2500-1750
సింధు నాగరికత బయటపడిన నగరాలు
- పంజాబ్‌ - రోపర్‌

- రాజస్థాన్‌ - కాలీభంగన్‌
- హర్యానా - బన్వాలీ

- ఉత్తర ప్రదేశ్‌ - ఆలంగీర్‌ పూర్‌

- గుజరాత్‌ - లోథాల్‌, రంగపూర్‌, దోలోవీరా

- హరప్పా నాగరికత ప్రధాన లక్షణం - పట్టణ నాగరికత

- సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి - సర్‌ జాన్‌ మార్షల్‌

- సింధు ప్రజల ఆరాద్య దైవం - అమ్మతల్లి

- క్రీ.శ 1922లో సింధు మైదానంలో సర్‌ జాన్‌మార్షల్‌ నాయకత్వంలో మొహంజోదారో, హరప్పా మొదలైన చోట్ల జరిగిన తవ్వకాలలో బయటపడింది.

- సింధు ప్రజల లిపి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి పాముచుట్టవలె రాసివుండటం వల్ల దీనిని సర్పలేఖనం అని పిలిచేవారు.
ఆర్య నాగరికత

- వేద కాలం నాటి నాగరికతను ఆర్యనాగరికత అంటారు.

- ఆర్య అనగా పూజ్యులు లేదా పెద్దలు అని అర్థం.

- ఆర్యులు సేవించిన మత్తు పానీయాలు సోమ, సుర

- ఆర్యుల ముఖ్యవృత్తి పశుపోషణ, వ్యవసాయం

- ఆర్యుల నాగరికతకు గ్రామీణనాగరికత అని పేరు

- ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబం (కుటుంబానికి తండ్రి పెద్ద)

- పరిపాలనలో రాజుకు సహాయపడటానికి మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజుతో కూడిన మంత్రిమండలి ఉండేది.

- ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేవి.

- ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు - ఇంద్రుడు, వరుణుడు, అగ్ని

- ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత - ఇంద్రుడు

- వర్ణ వ్యవస్థ గురించి మొదటిగా రుగ్వేదంలోని పురుష సూక్తంలో కనబడింది.
గ్రీకులు - అలెగ్జాండర్‌

- గ్రీకులు డెమిట్రయస్‌ నాయకత్వంలో భారతదేశంపై దండయాత్ర చేశారు.

- అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానం పంపిన రాజు - తక్షశిల రాజైన అంబి

- అలెగ్జాండర్‌ను ఎదిరించి పోరాడి ఓడిపోయిన రాజు - పురుషోత్తముడు (పోరస్‌)

- అలెగ్జాండర్‌ గ్రీసులోని మాసిడోనియా రాజ్యానికి చెందినవాడు

- క్రీ.పూ 327లో భారత్‌పై దండెత్తాడు

- క్రీ.పూ 324లో మరణించాడు. (బాబిలోనియాలో)

- విశ్వ విజేతగా పేరు పొండాడు.
- ఇతని తండ్రి పేరు ఫిలిప్‌

- అలెగ్జాండర్‌ సేనాని, సిరియారాజు సెల్యూకస్‌ నికేటర్‌

మౌర్యులు
- మౌర్య సామ్రాజ్య స్థాపకుడుమౌర్యచంద్రగుప్తుడు.

- చాణుక్యుని సహాయంతో నందులని ఓడించాడు.

- ఈయన కాలంలో అలెగ్జాండర్‌ సేనాని సెల్యూకస్‌ నికేటర్‌ భారత్‌పై దండెత్తి ఈయన చేతిలో ఓడిపోయాడు. సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి మెగస్తనీస్‌ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు.

- చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి శ్రామణ బెల్గొళా అనే జైన క్షేత్రంలో మరణించాడు.

- మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బిందు సారుడు. అజీవకశాఖ అనే మతాన్ని అవలంభించాడు.

- రాజధాని రాజ గృహం నుంచి పాటలీ పుత్రానికి మార్చిన రాజు

- చంద్రగుప్తుని ప్రధాని కౌటిల్యుడు (చాణుక్యుడు) అర్థశాస్త్రం రచించాడు.

- చంద్రగుప్తుడు సెల్యూకస్‌ నికేటర్‌ కుమార్తె అయిన హెలీనాను వివాహమాడాడు.

- మౌర్యుల కాలంలో భూమి శిస్తు వసూలు
చేసే అధికారి - రజక్‌

- మౌర్యుల యుగంలో చలామణిలో ఉన్న నాణెం - పణ

- మౌర్యు చంద్రగుప్తుడు గుజరాత్‌లో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు.
అశోకుడు

- అశోకుని 13వ శిలాశాసనం అశోకుడి కళింగ జైత్ర యాత్రను తెల్పుతుంది.

- అశోకుని ధర్మ సూత్రాలు 14వ శిలాశాసనంలో ప్రస్థావించారు.

- అశోకుడు యువరాజుగా ఉన్నప్పుడు తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అణచివేశాడు.

- అశోకుని శాసనంలో ఉపయోగించిన భాషలు - ప్రాకృతం, గ్రీకు

- అశోకుని శాసనంలో ఉపయోగించిన లిపులు - బ్రాహ్మీ, ఖరోషి

- అశోకుడు సాంచిలోని మొదటి బౌద్ధస్థూపం ినిర్మించాడు.

- అశోకుడు కళింగయుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు.

- ప్రప్రథమంగా అశోకుని శాసనాలకు 1837లో అర్థం చెప్పిన వ్యక్తి జేమ్స్‌ ప్రిన్సెస్‌.

- ప్రభుత్వ చిహ్నం అయిన అశోకుని సారనాథ్‌ స్తంభం శిరోభాగంలో ధర్మ చక్రంలో 24 ఆకులు ఉంటాయి.

- అశోకుడు కాశ్మీర్‌లో శ్రీ నగరాన్ని నిర్మించాడు.

- ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో అమరావతి స్థూపం నిర్మించాడు.
కుషానులు

- కుషాను వంశపు రాజుల్లో గొప్పవాడు కనిష్కుడు. ఇతనిని రెండో అశోకుడిగా పిలుస్తారు.

- కనిష్కుని కాలంలో 4వ బౌద్ధసంగీతి కాశ్మీర్‌లోని కుందన వనంలో జరిగింది.

- మధ్య ఆసియాలో సిల్క్‌ రూట్‌ని ఆక్రమించిన వాడు కనిష్కుడు.

- కనిష్కుని ఆస్థాన వైద్యుడైన చరకుడు 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.

- కనిష్కుని ఆస్థానంలో బౌద్ధమత పండితుడైన అశ్వఘోషుడు 'బుద్ధ చరితం'ను రచించాడు.

- కుషానులు యూచీ జాతికి చెందినవాడు.

- కనిష్కుని పురుషపురంలో ఒక పెద్ద స్థూపాన్ని నిర్మించాడు.

- కనిష్కుని బిరుదు దేవపుత్రుడు

- కుషానుల కాలంలో అభివృద్ధి చెందిన కళ గాంధర శిల్పకళ

- కనిష్కుని ఆస్థానంలో బౌద్ధవేదాంతి నాగార్జునాచార్యుడు సంస్కృతంలో బౌద్ధమతం మీద అనేక గ్రంథాలు రచించాడు.

- ఇతడు గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ వద్ద ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
హర్షుడు

- హర్షుడు రచించిన గ్రంథాలు - రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక

- హర్షుడి రాజధాని - థానేశ్వర్‌ (రెండో రాజధాని కనౌజ్‌)

- హర్షుడు ఆస్థాన కవి అయిన భాణుడు హర్షచరితం, కాదంబరి, పార్వతీ పరిణయం అనే గ్రంథాలు రచించాడు.

- హర్షుని కాలంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌. ఇతను రెండో పులకేశి ఆస్థానాన్ని మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని కూడా సందర్శించాడు.
చోళులు

- చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన వ్యవస్థను తెలియజేసే శాసనం ఉత్తర మేరూర్‌ శాసనం ఈ శాసనం వేయించిన చోళరాజు మొదటి పరాంతకుడు.

- చోళుల రాజ లాంచనం - పులి

- చోళుల పరిపాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి

- చోళ సామ్రాజ్య స్థాపకుడు- విజయాలయుడు

- రాజరాజు తంజావూరులో ''బృహదీశ్వరాయలం' నిర్మించాడు.

- రాజేంద్రచోళుడు గంగానది వరకూ యుద్ధ విజయాలను సాధించి 'గంగైకొండ' అనే బిరుదు పొందాడు. గంగైకొండ చోళపురం అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు.

- చోళ వంశంలో చివరివాడు - మూడో రాజేంద్రడు

- యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం చేసుకున్న చోళ చక్రవర్తి - రెండో రాజేంద్ర చోళుడు

- విశాఖపట్నం ఓడరేవును నిర్మించినది - కులోత్తుంగ చోళుడు

- చోళుల ఆస్థానంలో కంబన్‌ అనే కవి తమిళ రామాయణం అనే గ్రంథం రచించాడు.
రాజపుత్రులు

- చంద్‌బర్‌ దారు అనే కవి 'పృథ్వీరాజ్‌ రాసో' అనే గ్రంథంలో రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాడు.
- రాజపుత్రుల కాలంలో

కల్హణుడు 'రాజ తరంగిణి' అనే గ్రంథాన్ని రచించాడు.

- రాజపుత్ర వాస్తు శైలి - నాగర
రాష్ట్ర కూటులు

- మూలపురుషుడు - దంతి దుర్గుడు

- రాష్ట్ర కూటులు ఎల్లోరాలో దశావతార శిల్పాలను చెక్కించారు

- ఎల్లోరాలో కైలాస గుహాలయాలను కట్టించినవాడు - మొదటి కృష్ణుడు

- అమోఘవర్షుడు 'మాన్యఖేటము' అనే కొత్త రాజధాని కట్టించి రాజధానిని ఎల్లోరా నుంచి మాన్యఖేటానికి మార్చాడు.

- అరబ్బు యాత్రికుడైన సులేమాన్‌ 'అమోఘవర్షుని' ఆస్థానాన్ని సందర్శించాడు.

- అల్‌ మసూది అనే అరబ్‌ యాత్రికుడు మూడో ఇంద్రుడు కాలంలో రాష్ట్ర కూట రాజ్యాన్ని సందర్శించాడు.

- రాష్ట్ర కూటులలో ఆఖరి రాజు - రెండో కర్కుడు

- అమోఘవర్షుడు రచించిన గ్రంథం - కవి రాజ మార్గం

- రాష్ట్ర కూటుల సామంత రాజ్యానికి చెందిన కన్నడ ఆదికవి - పంప

- ప్రతీహార రాజ్యాన్ని దెబ్బతీసిన రాష్ట్ర కూటరాజు- మూడో కృష్ణుడు

గుప్తులు

- భారతదేశ చరిత్రలో గుప్త యుగాన్ని కావ్య యుగం, స్వర్ణ యుగం అని పిలుస్తారు.

- గుప్త వంశ మూలపురుషుడు - శ్రీ గుప్తుడు

- హుణులు స్కంద గుప్తుడు కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశాడు.

- గుప్తుల రాజలాంచనం - గరుడ

- గుప్తుల అధికార భాష - సంస్కృతం

- ప్రస్తుతం లభ్యమవుతున్న రూపంలోని మహాభారతం, రామాయణం గుప్తుల కాలంలో సంపుటీకరించారు.

- శూన్యాంక పద్ధతి (0) ఆధారంగా దశాంశ పద్ధతిని వీరు కనుగొన్నారు.

- గుప్తుల కాలం నాటి  నవనీతకం అనే గ్రంథం వైద్యం గురించి తెలుపుతుంది.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.