Type Here to Get Search Results !

Vinays Info

చరిత్ర పూర్వ యుగం - చారిత్రక యుగం(Prehistoric Era - Historical Era)

 చరిత్ర పూర్వ యుగం - చారిత్రక యుగం(Prehistoric Era - Historical Era)

తెలంగాణ చరిత్ర పూర్వయుగం 

  • చరిత్ర పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం 
  • లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరముల కాలాన్ని చారిత్రక యుగం అంటారు. 
  • తెలంగాణాలో మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ జిల్లా లోని వలిగొండ, దీనిని పరిశోధన చేసినవారు - రాబర్ట్ బ్రూస్ పూట్. 
  •  హైదరాబాద్ పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు చేయబడింది. 
  •  కొత్త రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు - రాగి 
  •  రాక్షసగూళ్ళ యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు - ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు.  ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని "చరిత్ర పూర్వ యుగం" , "చారిత్రక యుగం", "మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) లేదా "పురా చారిత్రక యుగం" అని అంటారు. 
  •  చరిత్ర పూర్వ యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు. 
ఉదాహరణ:

  • దిగువపాత రాతియుగం - గులక రాయి పనిముట్లు
  • మధ్య పాత రాతియుగం - రాతి పెచ్ఛుల పనిముట్లు
  • ఎగువ పాత రాతియుగం - కొచ్చెటి పనిముట్లు
  • మధ్య రాతియుగం - చిన్న చిన్న రాతి పనిముట్లు
  • కొత్త రాతి యుగం - నున్నటి పనిముట్లు
  • రాక్షసగుళ్ల యుగం - ఇనుప లోహ పనిముట్లు
  • దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):
  • ఈ యుగానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు
  • ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర జలపాతం
  • కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం
  • ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ
  • నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
  • మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం, ఈర్ల దిన్నె
  • పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి .
  • ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా లోని "అష్యులియన్" ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి .
  • మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):
  • మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర జరిపిన త్రవ్వకాల్లో. దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది అని అర్ధం అవుతుంది.
  • ఈ యుగపు మానవులు వదిన పనిముట్లు - చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు
  • ఎగువ పాత రాతి యుగం(క్రీ. పూ. 20000 - 10000 సంవత్సరాల క్రితం) :
  • ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు. 
  • రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం నేర్చుకున్నారు 
  • ఇది "హాలోసీన్" ఆరంభ దశను చుసిస్తుంది.  

మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 - 3000 సంవత్సరాల క్రితం):

  • భౌగోళిక వాతావరణ పరంగా "తోలి హాలోసీన్" యుగానికి చెందినది.
  • ఈ యుగంలో అతి చిన్న (సూక్ష్మ) రాతి  ఆయుధాలను వాడారు. 
  • ఈ యుగాన్ని 'సూక్ష్మ రాతి యుగం" అని కూడా అంటారు. 
  • ఈ యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి. 
  • వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో కనిపిస్తాయి. 
  • వీటిలో ముఖ్యమైనది జింక చిత్రం. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section