విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి. అవి.. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. వీరి పరిపాలనా కాలంలో సాహిత్యం, వాస్తు శాస్త్రం, శిల్పం మొదలైన కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. దీంతో విజయనగర రాజులకు చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది.విజయనగర చరిత్రను తెలియజేస్తున్న ముఖ్య గ్రంథం.. రాబర్ట్ సీవెల్ రచించిన The Forgotten Empire of Vizianagaram. దీంతో పాటు విజయనగర పాలనా కాలంలో అనేక మంది విదేశీ యాత్రికులు ఆ సామ్రాజ్యాన్ని సందర్శించి అందించిన వివరాలు, ఆ కాలంలో రచించిన గ్రంథాలు, రాజులు వేయించిన శాసనాలు విజయనగర చరిత్రను తెలుపుతున్నాయి.
వంశాలు | పాలనా కాలం |
సంగమ | క్రీ.శ.1336 - 1485 |
సాళువ | క్రీ.శ. 1486 - 1505 |
తుళువ | క్రీ.శ. 1505 - 1570 |
అరవీటి | క్రీ.శ. 1570 - 1646 |
రాజకీయ చరిత్ర
సంగమ వంశం: సంగమ వంశంలో హరిహరరాయలు, బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రెండో దేవరాయలు, విరూపాక్షరాయలు మొదలైన పాలకులున్నారు.
రెండో దేవరాయలు క్రీ.శ. 1424-1446
- సంగమ వంశ పాలకుల్లో అగ్రగణ్యుడు రెండో దేవరాయలు. ఇతనికి ప్రౌఢ దేవరాయలు అనే పేరు కూడా ఉంది.
- ఇతని పాలనా కాలంలో పారశీక రాయబారి అబ్దుల్ రజాక్, ఇటలీ యాత్రికుడు నికొలా డి కాంటిలు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు.
- రెండో దేవరాయలు ముస్లింలను ఉన్నతోద్యోగాల్లో చేర్చుకోవడంతోపాటు మసీదులను నిర్మించాడు.
- ప్రముఖ కవి శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థాన కవి ‘డిండిమభట్టు’ను ఓడించి అతనితో కనకాభిషేకాన్ని పొందాడు.
- రెండో దేవరాయలు మహానాటక సుధానిధి, వృత్తి అనే గ్రంథాలను రచించాడు.
- హంపిలోని ప్రముఖ విఠలస్వామి ఆలయం ఇతని పాలనా కాలంలోనే నిర్మితమైంది. దీన్ని ‘పొలగంటి తిమ్మన’ అనే రాజ ఉద్యోగి నిర్మించాడు.
- రెండో దేవరాయల మరణంతో సంగమ వంశ పాలన పతనం ప్రారంభమైంది.
తుళువ వంశం: తుళువ నరసనాయకులు స్థాపించిన ఈ వంశంలో వీర నరసనాయకులు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, సదాశివరాయలు మొదలైనవారు ప్రముఖులు.
శ్రీకృష్ణ దేవరాయలు: క్రీ.శ. 1509-1529
- విజయనగర పాలకుల్లోనే కాకుండా భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజుల్లో శ్రీ కృష్ణ దేవరాయలు ఒకరు.
- కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో సంధి చేసుకుని అశ్విక దళాన్ని పటిష్టం చేశాడు.
- అనేక ప్రాంతాలను జయించి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
- విజయాలకు గుర్తుగా సింహాచలం, పొట్నూరుల్లో విజయస్తంభాలు వేయించాడు.
- కృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయం), సంస్కృతంలో ‘మదాలస చరిత్ర, జాంబవతీ పరిణయం, సత్యవధూ ప్రణయం’ వంటి గ్రంథాలను రచించాడు.
- కృష్ణదేవరాయలు అనేక మంది కవులను పోషించి ఆంధ్ర భోజ, ఆంధ్ర పితామహ, ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ వంటి బిరుదులు పొందాడు.
- ఈయన సాహితీ గోష్టి జరిపే ప్రదేశాన్ని భువన విజయం అని, అతని ఆస్థానంలోని 8 మంది ప్రముఖ కవులను అష్టదిగ్గజాలని అంటారు.
కవి | రచనలు |
అల్లసాని పెద్దన | 1. స్వారోచిష మనుసంభవం |
నంది తిమ్మన | 1. పారిజాతాపహరణం |
మాదయగారి మల్లన | 1. రాజశేఖర చరిత్రం |
పింగళి సూరన | 1. కళాపూర్ణోదయం |
రామరాజ భూషణుడు (భట్టుమూర్తి) | 1.హరిశ్చంద్రోపాఖ్యానం |
అయ్యలరాజు | 1. రామాభ్యుదయం |
రామభద్రుడు ధూర్జటి | 1. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం |
తెనాలి రామకృష్ణుడు | 1.పాండురంగ మహాత్మ్యం |
- విజయనగరంలో ప్రముఖ హజారామాలయ దేవాలయాన్ని నిర్మించడంతోపాటు తిరుపతి, కంచి, సింహాచలం, శ్రీకాళహస్తి, అహోబిలం వంటి ఆలయాలకు గోపురాలు నిర్మించాడు.
- తల్లి నాగులాంబ జ్ఞాపకార్థం ‘నాగులాపురం’ అనే పట్టణాన్ని కట్టించాడు.
- కృష్ణదేవరాయలకు గురువు వ్యాసరాయలు కాగా ప్రధాని ‘సాళువ తిమ్మరుసు’
- ఇతని పాలనా కాలంలో డోమింగో పేజ్, బార్బోసా అనే పోర్చుగీసు యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు.
తుళువ వంశం: రామరాయల మరణంతో అతని సోదరుడు తిరుమలరాయలు పెనుగొండకు పారిపోయి స్వతంత్ర అరవీటి వంశ పాలన ప్రారంభించాడు. ఈ వంశంలో మొదటి, రెండో, మూడో శ్రీరంగరాయలు, మొదటి, రెండో వేంకటపతిరాయలు తదితరులు పాలించారు.
రెండో వేంకటపతిరాయలు: క్రీ.శ 1585-1614
- అరవీటి పాలకుల్లో అగ్రగణ్యుడు.
- రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చాడు.
- మొఘల్ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందిగా అక్బర్ పంపిన వర్తమానాన్ని తిరస్కరించాడు.
- క్రైస్తవుల కోసం వెల్లూరులో చర్చి నిర్మించాడు.
విజయనగర కాలంలో సాహిత్యం | |||
కవి | రచనలు | భాష | రాజు/కాలం |
విద్యారణ్య | 1. అనుభూతి ప్రకాశిక 2. అపరక్షానుభూతి 3. జైమినీ న్యాయం 4. పరాశర మాధవీయం 5. సంగీత సారం | సంస్కృతం సంస్కృతం సంస్కృతం సంస్కృతం సంస్కృతం | హరిహర, బుక్కరాయలు |
మాధవదేశికుడు | మాధవాభ్యుదయం | సంస్కృతం | బుక్కరాయలు |
నాచన సోముడు | ఉత్తర హరివంశం | సంస్కృతం | బుక్కరాయలు |
చౌంఢ మాధవ | 1. తాత్పర్య దీపిక 2. శైవామ్నాయ సారం | సంస్కృతం | రెండో హరిహర రాయలు |
వేదాంతదేశిక | 1. సంకల్ప సూర్యోదయం 2. హంస సందేశం | సంస్కృతం సంస్కృతం | |
గంగాదేవి | మధురా విజయం | సంస్కృతం | బుక్కరాయలు |
అన్నపూర్ణాదేవి | తుక్కా పంచశతి | సంస్కృతం | శ్రీకృష్ణదేవరాయలు |
తిరుమలాంబ | వరదాంబికా పరిణయం | సంస్కృతం | అచ్యుత రాయలు |
రామభద్రాంబ | రఘునాథాభ్యుదయం | సంస్కృతం | |
మొల్ల | రామాయణం | తెలుగు | |
సాయణాచార్య | వేద భాష్యం | సంస్కృతం | రెండో హరిహర రాయలు |
శ్రీకృష్ణదేవరాయ | 1. జాంబవతీ పరిణయం 2. సత్యవధూ ప్రణయం 3. మదాలస చరిత్ర 4. ఆముక్తమాల్యద | సంస్కృతం సంస్కృతం సంస్కృతం తెలుగు | 1509-29 |
రామయమంత్రి | స్వరమేళానిధి | సంస్కృతం | |
రెండో దేవరాయలు | 1. వృత్తి 2. మహానాటక సుధానిధి 3. రామాయణ చంపూ కావ్యం | సంస్కృతం సంస్కృతం సంస్కృతం | 1423-46 |
1వ రాజనాథ | సాళువాభ్యుదయం | సంస్కృతం | సాళువ నరసింహ |
రెండో రాజనాథ | అచ్యుత రామాభ్యుదయం | సంస్కృతం | అచ్యుతరాయలు |
శ్రీనాథుడు | 1. శృంగార నైషధం 2. పల్నాటి వీరచరిత్ర 3. కాశీఖండం 4. భీమ ఖండం 5. హరవిలాసం 6. మరుత్తరాట్ చరిత్ర | తెలుగు తెలుగు తెలుగు తెలుగు తెలుగు తెలుగు | రెండో దేవరాయలు |
తాళ్ళపాక తిమ్మక్క | సుభద్రా కళ్యాణం | తెలుగు | సాళువ నరసింహ |
వినుకొండ వల్లభరాయ | క్రీడాభిరామం | తెలుగు | |
జక్కన | విక్రమార్క చరిత్ర | తెలుగు | మొదటి దేవరాయలు |
పిల్లలమర్రి పినవీరభద్రుడు | 1. జైమినీ భారతం 2.శృంగార శాకుంతలం | తెలుగు | సాళువ నరసింహ |
మధుర | ధర్మనాథ పురాణం | కన్నడ | |
కుమారవ్యాస | కన్నడ భారతం | కన్నడ | |
చామరసు | ప్రభు లింగ లీల | కన్నడ | రెండో దేవరాయలు |
చేమకూర వెంకటకవి | విజయవిలాసం | తెలుగు | |
అన్నమాచార్య | సంకీర్తనలు /పద కవితలు | తెలుగు | సాళువ నరసింహ |
క్షేత్రయ్య | మువ్వ గోపాల పదాలు | తెలుగు | |
పురందరదాసు | సంకీర్తనలు | కన్నడ | అచ్యుతరాయలు |
అయతమ్మ | రత్నకరందక | కన్నడ | |
శ్రీధర దేవుడు | వైద్యామృతం | కన్నడ | |
విరూపాక్ష పండిట్ | చెన్నబసవ పురాణం | కన్నడ | |
రత్నాకర పర్ణి | పదివేల నీతి పద్యాలు | కన్నడ | |
మగ్గియమగ్గదేవ | శతక త్రియ | కన్నడ | |
జక్కనాచార్య | నూరొండు స్థల | కన్నడ | రెండో దేవరాయలు |
నంది ఎల్లయ్య, గంట సింఘన | 1.వరాహ పురాణం 2. ప్రబోధ చంద్రోదయం | తెలుగు | నరసనాయక |
విజయనగర కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు | |||
పేరు | దేశం | ఆస్థానం/కాలం | తెలియజేసిన అంశాలు |
ఇబన్ బటూటా | మొరాకో | మొదటి హరిహరరాయలు | పాలనా విశేషాలు |
నికోలొ డి కాంటి | ఇటలీ | మొదటి దేవరాయలు రెండో దేవరాయలు | 1. విజయనగర వైభవం 2. సతీసహగమనం అమల్లో ఉంది 3. భారత రాజులందరిలో విజయనగర పాలకులు గొప్పవారు, శక్తిమంతులు 4. భారతీయ ఓడలు పెద్దవి. |
అబ్దుల్ రజాక్ | ఖోరసాన్ (పారశీక) | రెండో దేవరాయలు | 1. విజయనగరానికి 300 రేవులున్నాయి 2. రెవెన్యూ పరిపాలనా విధానం 3. ప్రపంచంలో ఏ నగరం విజయనగరానికి సాటిరాదు. కాలికట్ ముఖ్య ఓడరేవు. 4. వేశ్యల నుంచి వసూలు చేసిన పన్ను రక్షక భటుల జీతానికి సరిపోతుంది. |
నికిటిన్ | రష్యా | మొదటి దేవరాయలు | వోయాజ్ టు ఇండియా గ్రంథం. విజయ నగర- బహ్మనీ చరిత్ర |
డోమింగో పేస్ | పోర్చుగల్ | శ్రీకృష్ణదేవరాయలు | 1. శ్రీకృష్ణదేవరాయల రూపాన్ని వర్ణించాడు 2. విజయనగరం అద్భుత పట్టణమని, వజ్రాలకు ప్రసిద్ధి అని పేర్కొన్నాడు. 3. విజయనగరాన్ని రోమ్‌తో పోల్చాడు. 4. దేవదాసీ వ్యవస్థ గురించి తెలిపాడు. |
బార్బోసా | పోర్చుగల్ | శ్రీకృష్ణదేవరాయలు | శ్రీకృష్ణదేవరాయల చరిత్ర |
లూయిస్ ఫ్రేజర్ | పోర్చుగల్ | శ్రీకృష్ణదేవరాయలు | శ్రీకృష్ణదేవరాయల చరిత్ర |
న్యూనిజ్ | పోర్చుగల్ | అచ్యుతరాయలు | 1. విజయనగర స్థాపకులు కాకతీయుల ఉద్యోగులు అని చెప్పాడు. 2. ఆహారపు అలవాట్లు |
హఫీప్ | అరేబియా | విజయనగర, బహ్మనీ రాజ్యాల చరిత్ర |
అయ్యా
ReplyDeleteమీరు చెప్పినది Vizianagaram కాదు Vijayanagar(am) గురించి. Vizianagaram అంటే ఆంధ్రాలో ఉన్న విజయనగరం (గజపతిరాజులు పాలించినది) - అనగా ఇజీనారం అన్నమాట.