కేశవచంద్రసేన్ (1838-84)
-ఇతడు బ్రహ్మసమాజ్‌లో ప్రముఖ నాయకుడు. 1875లో బ్రహ్మసమాజ్‌లో చేరాడు.-బ్రహ్మసమాజ్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దేశంలోని చాలా ప్రాంతాలను సందర్శించాడు.
-ఇతని కృషివల్ల బ్రహ్మసమాజ్ దక్షిణ భారతదేశానికి పరిచయం అయ్యింది.
-అయితే సిద్ధాంతపరంగా వచ్చిన విభేదాలవల్ల బ్రహ్మసమాజ్ నుంచి విడిపోయి భారతీయ బ్రహ్మసమాజ్‌ను 1866లో నెలకొల్పారు.
-తన భావాలను ప్రచారం చేయడానికి ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించారు.
-1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ స్థాపించి, 1872లో ప్రభుత్వం నేటివ్ మ్యారేజ్ యాక్ట్‌ను తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషించారు.
-దీని ప్రకారం మగ పిల్లాడి పెండ్లి వయస్సు 18, ఆడపిల్లకు 14 ఏండ్లు.
-అయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించి తన మైనర్ కుమార్తెను కుచ్‌బీహార్ సంస్థాన రాజుకిచ్చి పెండ్లి చేయడంతో అతని శిష్యులు ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రిలు దీనిని వ్యతిరేకించి సాధారణ బ్రహ్మసమాజ్‌ను నెలకొల్పారు.
ప్రార్థనా సమాజ్
-ప్రార్థనా సమాజ్ బ్రహ్మసమాజ్‌వల్ల ఉత్తేజితమైంది. దీన్ని ఆత్మారామ్ పాండురంగ 1867లో బొంబాయిలో స్థాపించారు.-ఈ సంస్థ సభ్యులు ఆస్తికవాదులు. వారు సోమదేవ్, తుకారాం, రామదాస్ మొదలైన మతాచార్యులు అనుసరించిన గొప్ప మత సంప్రదాయాలకు వారసులు.
ఆశయాలు
-హేతుబద్ధమైన ఆరాధనను ప్రోత్సహించడం, వర్ణాధిక్యతను నిరసించడం, వితంతు పునర్వివాహాలను ప్రవేశపెట్టుట, స్త్రీ విద్యను ప్రోత్సహించి, బాల్యవివాహాలను రద్దుచేయడం వంటివి దీని కార్యక్రమాలు.-ఇవేగాక అనాథశరణాలయాలు, వితంతువులకు గృహాలు, శరణాలయాలను, రాత్రిబడుల నిర్వహణ వంటి కొన్ని సాంఘిక సేవలను కూడా చేపట్టింది.
-ప్రార్థనా సమాజ్ తన భావాలను ప్రచారం చేయడానికి సుబోధ పత్రికను ప్రారంభించింది.
-దేశ పశ్చిమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలకు కేంద్రం ప్రార్థనా సమాజ్. ఇది బొంబాయి, మద్రాస్ రాష్ర్టాల్లో తన శాఖలను తెరిచింది.
-ఆచార్య ఆర్జీ భండార్కర్, నారాయణ గణేశ్ చద్రవార్కర్, ఎంజీ రనడే, పండిత రమాబాయి సరస్వతి ప్రార్థనా సమాజ్‌లో ప్రముఖ సభ్యులు.
మహదేవ్ గోవింద రనడే
-ఈయన గొప్ప విద్యావంతుడు. సాంఘిక సంస్కరణవాది.-సార్వజనిక సభ పత్రికలో సామాజిక, ఆర్థిక సమస్యలను గురించి వ్యాసాలు రాసేవాడు. వితంతు పునర్వివాహాన్ని సమర్థించాడు. వారి అభ్యుదయాన్ని ఆకాంక్షించాడు.
-బాలికల వివాహ వయస్సు పెంచడాన్ని సమర్థించాడు. బహుభార్యత్వాన్ని, వరకట్నాలను ఖండించాడు. స్త్రీ విద్యను సమర్థించాడు.
-1887లో సాంఘిక సంస్కరణలు చేపట్టడానికి ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌ను నెలకొల్పాడు.
-అగార్కర్‌తో కలిసి 1884లో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు.
-గోపాకృష్ణ గోఖలే రనడేని తన గురువుగా చెప్పుకున్నాడు.
పండిత రమాబాయి సరస్వతి
-రమాబాయి సరస్వతి వైదుష్యానికి మెచ్చి పండిత బిరుదుతో ఆమెను సన్మానించారు.-సాంఘిక అసమానతల నుంచి, క్రౌర్యం నుంచి మహిళలకు విముక్తి కలిగించడమే ఆమె ముఖ్య ధ్యేయం.
-హిందూ సమాజంలో, మత వ్యవస్థలో ఉండే లోపాలను ఆమె వ్యతిరేకించింది.
-ఆమె శూద్రున్ని వివాహం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు పెండ్లి అయిన రెండేండ్లకే భర్తను కోల్పోయింది.
-ఈమె పూనేలో మహిళా ఆర్య సమాజ్‌ను స్థాపించింది. 1883లో ఇంగ్లండ్, అమెరికాల్లో పర్యటించి భారతీయ మహిళల దయనీయ స్థితి గురించి ఉపన్యసించింది.
-ఈమె ప్రసంగాల వల్ల భారత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
-విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత, బొంబాయిలో శారదా సదన్ అనే వితంతు వసతిగృహాన్ని, పాఠశాలను ప్రారంభించింది.
-కరువు బాధితులను ఆదుకోవడానికి ముక్తిసదన్‌ను ప్రారంభించింది. ఈ విధంగా పండిత రమాబాయి భారత మహిళల విమోచనకు విశేషమైన కృషిచేసింది.
ఆర్యసమాజ్
-1875లో ఈ సంస్థను స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించారు.-ఇతని అసలు పేరు మూల శంకర్. 1824లో గుజరాత్‌లోని టంకారాలో జన్మించారు.
-1876లో లాహోర్‌లో ఈ సమాజం తన కార్యక్రమాలను ప్రారంభించింది.
-దయానంద సరస్వతి సంస్కృతంలో గొప్ప పండితుడు. హిందూ సమాజంలోని వర్ణవ్యవస్థను, అస్పృశ్యతను ఖండించాడు.
సూత్రాలు
-వేదాలు అత్యున్నతమైనవని, వేదాలు అన్నింటికి మూలం అని, వేదాలకు మరలండి (గో బ్యాక్ టు వేదాస్) అని పిలుపునిచ్చాడు.-విగ్రహారాధనను, మత కర్మకాండలను, పూజారుల ఆధిక్యతను, పురాణాలను నిరసించాడు.
-బాల్య వివాహాలు, పుట్టుక ఆధారంగా కులం అనే వాటిని నిరసించి కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను బలపర్చాడు.
-పాశ్చాత్య సైన్సులను బోధించడాన్ని బలపర్చాడు. ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఆర్యసమాజాలు సేవలను అందించాయి.
-ఈయన హిందీలో సత్యార్థ ప్రకాశిక, సంస్కృతంలో వేదభాష భూమిక అనే గ్రంథాలను రచించాడు.
-హిందూమతంలో నుంచి ముస్లిం, క్రైస్తవ మతంలోకి వెళ్లిన హిందువులను తిరిగి హిందూమతంలోకి తీసుకురావడానికి శుద్ధి అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు.
-అయితే ఆర్యసమాజాన్ని బొంబాయిలో స్థాపించినా పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో బలంగా ఉండేది.
-స్వామి దయానంద సరస్వతి మరణానంతరం ఆర్యసమాజ్ కార్యకలాపాలను లాలా హన్స్‌రాజ్, లాలాలజపతి రాయ్, స్వామి శ్రద్ధానంద, పండిత్ గురుదత్ మొదలైన అతని అనుచరులు కొనసాగించారు.
-అయితే విద్యావిధానాన్ని బోధించే అంశంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి.
-స్వామి శ్రద్ధానంద నాయకత్వంలోని వారు గురుకుల పాఠశాలను నెలకొల్పి హిందూ విద్యావిధానాన్ని అందించాలని తెలిపారు. వీరి ముఖ్య కేంద్రం హరిద్వార్‌లో ఉంది.
-మరో వర్గానికి చెందిన లాలాలజపతిరాయ్, లాలా హన్స్‌రాజ్ బ్రిటిష్ విద్యావిధానాన్ని బలపర్చారు. వీరి ప్రముఖ విద్యాకేంద్రం లాహోర్‌లో ఉంది. వీరు స్థాపించిన కళాశాలను దయానంద ఆంగ్లో వేదిక స్కూల్స్ అని అంటారు.
రామకృష్ణ పరమహంస
-రామకృష్ణ పరమహంస మహా విజ్ఞాని ఉదారభావాలు కలవాడు. గొప్ప కాళీ భక్తుడు. ఈయన అసలు పేరు గదాధర ఛటోపాధ్యాయ.-ఈయన బెంగాల్‌లోని కామ్రాకపూర్ గ్రామంలో జన్మించాడు. శారదామణిని వివాహం చేసుకున్నాడు.
-దక్షిణేశ్వర కాళి దేవాలయంలో అర్చకుడిగా పనిచేశాడు. ధ్యానంతో జ్ఞానాన్ని పొందాడు.
-దేవున్ని చేరడానికి ఏకైక మార్గం మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే అని తెలిపాడు.
-మహ్మదీయ, క్రైస్తవ మతాచార్యులతో స్వేచ్ఛగా కలిసి చర్చలు జరిపాడు. అన్ని మతాలు ఒకే దేవున్ని చేరడానికి భిన్న మార్గాలని నమ్మాడు.
-విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడమే రామకృష్ణుని దృష్టిలో మతం అని చెప్పవచ్చు.
-రామకృష్ణ పరమహంస ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, స్వశక్తి పట్ల విశ్వాసాన్ని పెంపొందించాడు. కర్మకాండపై ఆధారపడకుండా ప్రార్థన ప్రాముఖ్యాన్ని స్పష్టీకరించాడు.
-రామకృష్ణ పరమహంస విశ్వవ్యాప్త ఆధ్యాత్మికతత్వం, భారతీయుల్లో విశాల భావాల్ని పెంపొందించాడు.

స్వామి వివేకానంద
-ఈయన రామకృష్ణ పరమహంస మేటి శిష్యుడు. సాంఘిక, మత రంగాల్లో గొప్ప సంస్కర్త.-స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. జనవరి 12న కలకత్తాలో జన్మించాడు.
-రామకృష్ణ పరమహంస గురూపదేశాన్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రచారం చేశాడు.
-వేదాంతం గురించి ఆయన చేసిన గంభీరోపాన్యాసాలు పాశ్చాత్యులను ప్రభావితం చేశాయి.
-1893, సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మత మహాసభలో హిందూమతం గురించి ఆయన చేసిన ఉపన్యాసం పాశ్చాత్య విజ్ఞానుల్లో సంచలనాలను రేకెత్తించింది.
-అనంతరం యూరప్‌లోని పలు దేశాల్లో పర్యటించి భారతదేశ గొప్పతనాన్ని, హిందూమత ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు.
-నిస్వార్థంగా దేశసేవకు అంకితులైన యువకులకు శిక్షణ ఇవ్వడానికి బేలూరు వద్ద 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు.
-1900లో పారిస్‌లో జరిగిన మతాల సమ్మేళన సభల్లో పాల్గొన్నాడు.
-అనంతరం భారతదేశం వచ్చి 1902, జూలై 4న మరణించాడు.
రామకృష్ణ మఠం
-మానవ బాధ నివారణకు సహాయం చేయడం కోసం సమాజ సేవ కోసం దీన్ని స్థాపించారు.-పాశ్చాత్య నాగరికత, నాస్తిక భావాల ప్రభావం నుంచి భారతదేశాన్ని కాపాడటమే ఈ సంస్థ ముఖ్య ఆశయం.
-ఈ సంస్థ హిందూమతంలోని విగ్రహారాధనను, బహుదేవతారాధనను ఆదర్శంగా స్వీకరించింది. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ సంస్థ విస్తరించింది.
-ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, అనాథ శరణాలయాలను తెరచి సమాజ సంక్షేమం, సేవలను చేపట్టింది.
-ముక్తిని సాధించడానికి సాధన చేసుకోవడం కంటే సమాజంలో మంచిని పెంచడానికి ఈ సంస్థ ప్రాధాన్యమిచ్చింది.
-వేదాంతతత్వాన్ని ప్రజలకు విశదీకరించాలనే ఉద్దేశంతో భారత్‌లోనే కాకుండా అమెరికా, యూరప్‌లోని చాలా నగరాల్లో రామకృష్ణ మఠం శాఖలను స్థాపించారు.
-స్వామి వివేకానంద తన భావాలను ప్రచారం చేయడానికి ప్రబోధ భారత్ అనే ఇంగ్లిష్ పత్రికను, ఉద్బోధన అనే బెగాలీ పత్రికను స్థాపించారు.