పేస్-మార్టినా
-ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడీ చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం (జూన్ 3న) జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ పేస్-హింగిస్ జోడీ 4-6, 6-4, 10-8తో సూపర్ ట్రైబ్రేక్‌లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ నకొయేషియా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో పేస్, హింగిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జతగా, వేర్వేరుగా కెరీర్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) సాధించారు. లియాండర్ పేస్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కాగా, హింగిస్‌కు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
వార్తల్లో వ్యక్తులు
బాక్సింగ్ దిగ్గజం అలీ మృతి
-హెవీ వెయిట్ బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ జూన్ 4న మరణించారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతుండేవారు. అతని కెరీర్‌లో 61 బౌట్లు, 548 రౌండ్లు, 56 విజయాలు (37 నాకౌట్‌లు), 5 పరాజయాలు (ఒక నాకౌట్) ఉన్నాయి. 1960లో ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించారు. అతడు పుట్టినప్పటి పేరు కాసియస్ బార్సెలస్ క్లే. తరువాత ఇస్లాంలోకి మారి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు.
యాపిల్‌కు భారత రాయబారిగా షారూఖ్
-బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ జూన్ 3న యాపిల్ సంస్థకు భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం బ్రెజిలియన్ సాకర్ క్రీడాకారుడు నేమార్, అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు స్టీఫ్ కర్రీ యాపిల్ కంప్యూటర్స్‌కు రాయబారులుగా వ్యవహరిస్తున్నారు.
హ్మాన్‌కు జపాన్ పురస్కారం
-ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు మే 30న జపాన్ విశిష్ట పురస్కారం ‘గ్రాండ్ ఫుక్ వోకా’ లభించింది. ఆసియా సంస్కక్షుతికి ఎనలేని సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.