అంకం: రంగస్థలంపై ప్రదర్శించుటకు వీలుగా ఉండే భాగానికి ‘అంకం’ అని పేరు. నాటకంలోని ఇతివృత్తాన్ని రచయిత కొన్ని అంకాలుగా విభజిస్తాడు.
-అర్థోపక్షేపకాలు: రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలుకాని వాటికి ‘అర్థోపక్షేపకాలు’ అని పేరు. ఇవి 5 విధాలు...
1. విష్కంభం: ఇది రెండు విధాలు. శుద్ధ విష్కంభం, మిశ్ర విష్కంభం
అ) శుద్ధ విష్కంభం: రెండు మధ్యమ పాత్రల ద్వారా విషయాన్ని ప్రేక్షకులకు లేదా పాఠకులకు చెప్పించడాన్ని శుద్ధ విష్కంభం అని అంటారు.
ఆ) మిశ్ర విష్కంభం: ఒక మధ్యమ పాత్ర, ఒక అథమ పాత్ర చేత విషయాన్ని చెప్పించడాన్ని మిశ్ర విష్కంభం అని అంటారు.
2. ప్రవేశకం: రెండు అథమ పాత్రల చేత విషయాన్ని చెప్పించడాన్ని ప్రవేశకం అని అంటారు.
3. చూళిక: ఆకాశ భాషణాన్ని (ఆకాశవాణి మాటలు) చూళిక అని అంటారు.
4. అంకాస్యం: అంకం చివరలో ఉన్న పాత్రలచే రాబోయే అంకంలోని కథాంశాన్ని సూచించడం లేదా చెప్పడాన్ని అంకాస్యం అని అంటారు.
5. అంకావతారం: పూర్వాంకంలో జరుగబోయే కథను సూచించించిన పాత్రలే తర్వాత అంకంలో ప్రవేశించి ఆ కథాభాగాన్ని నిర్వహించుటను అంకావతారం అని అంటారు.
6. అర్థ ప్రకృతులు: నాటక రచనకు తీసుకున్న వస్తువు క్రమ వికాస పరిణామం పొందడానికి రచయిత వేసుకున్న ప్రణాళికాంశాలకే అర్థ ప్రకృతులు అని పేరు. ఇవి.. బీజం, బిందువు, పతాక, ప్రకరి, కార్యం అని ఐదు విధాలు.
7. కార్యావస్థలు: కథా వస్తువు ప్రయాణించే వివిధ దశలను కార్యావస్థలు అని అంటారు. ఇవి.. ఆరంభం, ప్రయత్నం, ప్రాప్తాశ, నియతాప్తి, ఫలాగమం అని ఐదు విధాలు.
8. పంచసంధులు: అర్థ ప్రకృతులు, కార్యావస్థలతో కూడిన వాటికి పంచసంధులు అని పేరు. ఇవి.. ముఖసంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, అవిమర్శ సంధి, నిర్వహణ సంధి.
-అర్థ ప్రకృతులు + కార్యావస్థలు = సంధులు
-బీజం + ఆరంభం = ముఖసంధి
-బిందువు + ప్రయత్నం = ప్రతిముఖ సంధి
-పతాక + ప్రాప్తాశ = గర్భసంధి
-ప్రకరి + నియతాప్తి = అవిమర్శ సంధి
-కార్యం + ఫలాగమం = నిర్వహణ సంధి
9. పతాక స్థానకాలు: నాటకంలో పతాకస్థాయిలో చెప్పే అంశాలకు పతాకస్థానకాలు అనిపేరు. ఇవి నాటకాన్ని మలుపు తిప్పేవిగా ఉంటాయి.
10. భరతవాక్యం : నాటకం చివర కథానాయకుడిచే గానీ, దివ్యమైన, మహిమాన్వితమైన పాత్రచే గానీ ఆశీర్వాదపూర్వక వాక్యాలను పలికించుటను భరతవాక్యం అని అంటారు.
-చతుర్విధ అభినయాలు గల దృశ్య కావ్యం నాటకం. అవి..
1) ఆహార్యం: ఆయాపావూతలకు అనుగుణమైన వేషధారణకు ఆహార్యం అని పేరు.
2) సాత్వికం: సుఖదు:ఖాదుల వలన నటుల ముఖ కవళికల్లో కలిగే మార్పులకు సాత్వికం అని పేరు.
3) వాచికం: భావానుగుణంగా మాట్లాడే విధానానికి వాచికం అని పేరు.
4) ఆంగికం: భావానుగుణంగా మాట్లాడటమే కాకుండా అవయవాలను కదిలించుటను ఆంగికం అని అంటారు.
చాక్షుషమైన క్రతువు నాటకం అన్న కవి - కాళిదాసు
-తెలుగులో రాసిన తొలి నాటకం ‘మంజరీ మధుకరీయం’. దీన్ని కోరాడ రామచంవూదశాస్త్రి 1860లో రాశారు.
-1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించిన నాటకం ‘నరకాసుర విజయం’. ఇది సంస్కక్షుతం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం.
-కాళిదాసు సంస్కక్షుతంలో రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ను పరవస్తు వెంకటరంగాచార్యులు తెలుగులోకి అనువదించారు.
-వావిలాల వాసుదేవ శాస్త్రి రచించిన నాటకాలు- నందక రాజ్యం, సీజరు చరిత్ర
-తెలుగులో తొలి సాంఘిక పద్యనాటకం - నందకరాజ్యం
-ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం - సీజరు చరిత్ర
-ఆంగ్లనాటక అనువాదంలో, సాంఘిక పద్యనాటక రచనలో ప్రథముడు - వావిలాల వాసుదేవ శాస్త్రి
-రాజమహేంవూదవరంలో విద్యార్థి నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి స్వీయ నాటకాలను ప్రదర్శింపజేసినవాడు - కందుకూరి వీరేశలింగం పంతులు. ఈయన రచించిన వ్యవహారధర్మబోధిని మొదటగా ప్రదర్శించిన నాటకం.
-శ్రీహర్షుడు రచించిన రత్నావళిని, షేక్‌స్పిపియర్ రచించిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌ను ‘చమత్కార రత్నావళి’ పేరుతో తెలుగులోకి అనువదించినవాడు - కందుకూరి వీరేశలింగం పంతులు
-సంస్కక్షుతంలో భట్టబాణుడు రచించిన వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువదించిన రచయిత - వడ్డాది సుబ్బరాయ కవి
-బళ్లారిలో సరసవినోదిని సభను 1886లో స్థాపించి, దానికి అధ్యక్షులుగా ఉండి పలు నాటకాలను రచించి ప్రదర్శించిన మేటి నటుడు, రచయిత - ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఈయనకు గల బిరుదు ఆంధ్రనాటక పితామహుడు. ఈయన రచించిన నాటకాలు - విషాద సారంగధర, చిత్రనళీయం, పాదుకా పట్టాభిషేకం, చంద్రహాస, మోహినీ రుక్మాంగద, సావిత్రి చిత్రశ్వం, ప్రమీలార్జునీయం, వరూధిని, చిరకారి, పాంచాలీ పరిణయం, ప్రహ్లాద, ఉషా పరిణయం మొదలైనవి.
-తెలుగు నాటకాల్లో గద్య పద్యాలతో పాటు పాటలను కూడా రాసిన తొలి రచయిత - ధర్మవరం కృష్ణమాచార్యులు. ఈయన రచించిన విషాద సారంగధర తెలుగులో తొలి విషాదాంత నాటకం.
-బళ్లారిలో ‘సుమనోరమ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి పలు నాటకాలను రచించి ప్రదర్శించిన నాటక రచయిత- కోలాచలం శ్రీనివాసరావు. ఈయనకు గల బిరుదు ఆంధ్ర చారివూతక నాటక పితామహుడు. ఈయన వాణీ విలాసం అనే నాటక ప్రదర్శనశాలను నిర్మించాడు.
-కోలాచలం శ్రీనివాసరావు రచనలు - సునందినీ పరిణయం, విజయనగర రాజ్యపతనం, సుల్తానా చాంద్‌బీబీ, చంద్రగిరి అభ్యుదయం, మైసూరు రాజ్యం, మదాలస, సత్యహరిశ్చంవూదీయం, పాదుకాపట్టాభిషేకం, శ్రీరామ జననం, ద్రౌపదీ మాన సంరక్షణ, రుక్మాంగద చరిత్ర మొదలైనవి.
-కోలాచలం శ్రీనివాసరావు రాసిన నాటకాల్లో నాయకపావూతలను పోషించిన మహానటుడు- బళ్లారి రాఘవ
-‘డ్రమటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్’ అనే పేరుతో ప్రపంచ నాటకరంగ చరివూతను ఆంగ్లంలో రచించిన రచయిత- కోలాచలం శ్రీనివాసరావు.
తెలుగులో తొలి చారివూతక నాటకం కోలాచలం శ్రీనివాసరావు రచించిన విజయనగర రాజ్యపతనం. దీనికి రామరాజుచరిత్ర, కర్ణాటక రాజ్య నాశనం అనే పేర్లు ఉన్నాయి.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రచించిన నాటకాలు- గయోపాఖ్యానం, ప్రసన్నయాదవం, పారిజాతాపహరణం, ప్రహ్లాద చరిత్ర, కీచకవధ, స్వప్నవాసవదత్త, ప్రతిమ మొదలైనవి. ఈయన రచించిన నాటకాల్లో సుప్రసిద్ధమైనది గయోపాఖ్యానం. దీనికి మూలం నాదెండ్ల గోపన రాసిన కృష్ణార్జున సంవాదం. గయోపాఖ్యానానికి గల మరోపేరు ప్రచండయాదవం.
-వేదం వెంకటరాయశాస్త్రి రచించిన నాటకాలు- ప్రతాపరువూదీయం, నాగానందం, శాకుంతలం, ఉషానాటకం, బొబ్బిలి యుద్ధం, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, రత్నావళి మొదలైనవి.
-నాటక రచనలో తొలిసారిగా పాత్రోచిత భాషను ప్రయోగించిన రచయిత- వేదం వెంకటరాయశాస్త్రి
-తొలి తెలుగు సాంఘిక నాటకం కన్యాశుల్కం రచయిత- గురజాడ వెంకట అప్పారావు. 1892లో రాయగా 1897లో మొదటిసారిగా ప్రచురితమైంది. 1909లో మార్పులు చేర్పులతో మలి ప్రచురణ జరిగింది. తొలి ప్రచురణలో 5 అంకాలు, 27 రంగాలు ఉండగా, మలి ప్రచురణలో 7 అంకాలు, 35 రంగాలు ఉన్నాయి. ఈ నాటకంలోని పాత్రల సంఖ్య 30. ఈ నాటకాన్ని 350 సార్లుపైగా ప్రదర్శించిన నాటక సమాజం- నటరాజ కళాసమితి. 1992లో ఈ నాటకానికి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి.
-సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ, ఉత్తమ రూపక నిర్మాణం ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాసిన నాటకం- కన్యాశుల్కం. గిరీశం పాత్ర ప్రవేశంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది.
-కన్యాశుల్కం నాటకంలో ప్రధాన పాత్రలు- గిరీశం, మధురవాణి, సౌజన్యరావు, కరటకశాస్త్రి, అగ్నిహోవూతావధాన్లు, లుబ్ధావధాన్లు, రామప్పంతులు, బుచ్చమ్మ, అసిరిగాడు.
-ఆంగ్ల, కన్నడ, తమిళ భాషల్లోకి అనువదించిన తొలినాటకం- కన్యాశుల్కం. దీన్ని ఆనందగజపతికి అంకితమిచ్చారు.
-ఆంధ్ర షేక్‌స్పియర్‌గా ప్రసిద్ధి చెందిన నాటక రచయిత - పానుగంటి లక్ష్మీనరసింహారావు. ఈయన రచించిన నాటకాలు- సారంగధర, రాధాకృష్ణ, విప్రనారాయణ, కంఠాభరణం, సరస్వతి, వృద్ధ వివాహం మొదలైనవి.
బొబ్బిలి యుద్ధం నాటక రచయిత- శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి
-సురభి కంపెనీ వారి ప్రదర్శన కోసం తూము రామదాసు రచించిన ‘కాళిదాస’నాటకం తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నాటకంగా ప్రసిద్ధిగాంచింది. ఇది 1899లో ప్రచురితమయ్యింది.
-1911లో చందాల కేశవదాసు రచించిన నాటకం- కనకతార
-తెలంగాణ ప్రాంతంలో ఆధునిక నాటక రచనకు పునాది వేసిన రచయిత- చందాల కేశవదాసు
-సులభమైన శైలిలో నాటకాలను రచించి ప్రజలమధ్యకు తీసుకెళ్లిన కవులు- తిరుపతి వేంకటకవులు.వీరు రచించిన నాటకాలు పాండవోద్యోగ విజయాలు పేరుతో ప్రసిద్ధిగాంచాయి.
-బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించిన సుప్రసిద్ధ నాటకం - సత్యహరిశ్చంద్ర
-కాళ్లకూరి నారాయణరావు రచించిన నాటకాలు- చింతామణి, వరవిక్షికయం, మధుసేవ
-వేశ్యావృత్తి నిర్మూలన కోసం రాసిన నాటకం- చింతామణి. ఈ నాటకంలోని ప్రధాన పాత్రలు- చింతామణి, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, సుబ్బిశెట్టి
-వరకట్న దురాచారానికి నిరసనగా రాయబడిన నాటకం -వరవిక్షికయం
-మద్యపానం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రాయబడిన నాటకం - మధుసేవ
-దామరాజు పుండరీకాక్షుడు రచించిన నాటకాలు- గాంధీమహోదయం, గాంధీవిజయం, పాంచాల పరాభావం
-స్వరాజ్య ఉద్యమ ప్రభావంతో రాసిన తొలినాటకం- రసపుత్ర విజయం. దీని రచయిత ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణ