-ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఉమ్మడిగా నిర్మించిన ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌ను జూన్ 4న ప్రధాని నరేంవూదమోదీ ప్రారంభించారు. 75 వేల హెక్టార్ల భూమికి నీరందించనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరుదేశాలకు చెందిన 1500 మంది ఇంజినీర్లు పాల్గొన్నారు. తొలుత ఈ డ్యామ్‌ను 1976లో నిర్మించారు. అయితే ప్రచ్ఛన్న యుద్ధంలో ఇది ధ్వంసమయ్యింది.
మానవజాతి ప్రయోజనాల జాబితాలో భారత్
-మానవజాతి ప్రయోజనాల జాబితాలో భారత్ 70వ స్థానంలో నిలిచింది. గుడ్ కంట్రీ ఇండెక్స్ ప్రకటించిన ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో మొత్తం 163 దేశాలకు స్థానం లభించింది. భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 62, సంస్కక్షుతిలో 119, వాతావరణంలో 106, శక్తివంతమైన దేశాల జాబితాలో 100వ స్థానంలో ఉంది.
ఇంట్నట్ వాడకంలో రెండో స్థానంలో భారత్
-ఇంట్నట్ వాడకంలో అమెరికాను వెనక్కు నెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో 27.7 కోట్ల మంది ఇంట్నట్ యూజర్లు ఉన్నారు. ఇంట్నట్ వాడకంలో భారత్ 40 శాతం వృద్ధి నమోదుచేసింది.
క్రీడలు
టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కోహ్లీ
-సియట్-2016 అవార్డుల్లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. దిలీప్ వెంగ్‌సర్కార్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఇంటర్నేషనల్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఇంగ్లండ్ ప్లేయర్ జోయ్ రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంవూదన్ అశ్విన్ ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత మరో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు రిషబ్ పంత్, స్పెషల్ అవార్డుకు అజింక్యా రహానే ఎంపికయ్యారు.
ఫుట్‌బాల్‌లో లావోస్‌పై భారత్ గెలుపు
-2019 ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించే దిశగా భారత జట్టు ముందడుగేసింది. లావోస్ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించింది. ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 163వ స్థానంలో ఉండగా, లావోస్ 174వ స్థానంలో ఉంది.
కోపా ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం
-అమెరికాలో జూన్ 3న కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సాకర్ ట్రోఫీ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది శతాబ్ది టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా, కొలంబియా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో.. కొలంబియా జట్టు 2-0 తేడాతో అమెరికా జట్టును ఓడించింది.