Type Here to Get Search Results !

Vinays Info

Gk


-భారత్ 2016 జూన్, 2న గ్లోబల్ బాలిస్టిక్ ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో చేరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఖండాంతర క్షిపణుల వ్యాప్తిని నిరోధించే వ్యవస్థ.

ఐదు దేశాల్లో పర్యటించనున్న మోదీ

-భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు విదేశీ పర్యటనలకు బయలుదేరారు. జూన్ 4 నుంచి ఆఫ్ఘనిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అణుసరఫరా దేశాల కూటమిలో భారత్ సభ్యత్వం గురించి చర్చించనున్నారు. అణుసరఫరా కూటమిలో ప్రస్తుతం 48 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 

11న రాజ్యసభ ఎన్నికలు

-జూన్ 11న 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకుగాను తెలంగాణ నుంచి డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు (టీఆర్‌ఎస్).. ఏపీ నుంచి విజయసాయిడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), సుజనాచౌదరి, టీజీ వెంక (టీడీపీ), సురేష్ ప్రభు (బీజేపీ) ఏకక్షిగీవంగా ఎన్నికయ్యారు. 

బుండెస్టాగ్‌ను సందర్శించిన వెంకయ్యనాయుడు 

-కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జూన్ 2న బెర్లిన్‌లోని బుండెస్టాగ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బుండెస్టాగ్ వైస్ ప్రెసిడెంట్ ఉల్లా స్మిద్, జర్మనీలో భారత రాయబారి గుర్మీత్ సింగ్‌తో భేటీ అయ్యారు.

పుల్గావ్ ఆయుధాగారంలో అగ్నివూపమాదం

-ఆసియాలోనే రెండో అతిపెద్దదైన పుల్గావ్ ఆయుధాగారంలో మే 31న భారీ అగ్నివూపమాదం జరిగింది. ప్రమాదంలో 16 మంది మరణించారు. పుల్గావ్ ఆయుధాగారం 7 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 100 రైల్వే లైన్లు ఉన్నాయి. 

భారత్-అమెరికాల మధ్య ఉగ్రవాద సమాచార మార్పిడి ఒప్పందం

-భారత్-అమెరికా దేశాల మధ్య జూన్ 2న ఉగ్రవాద సమాచార మార్పిడి ఒప్పందం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section