పృథ్వి-2 క్షిపణి పరీక్ష
-పృథ్వి-2 క్షిపణిని మే 18న పరీక్షించారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. చాందీపూర్‌లోని బాలాసోర్ ప్రాంతంలో పరీక్షించారు. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. దీని పరిధి 350 కి.మీ. ఇది 500 నుంచి 1000 కేజీల బరువు గల వార్‌హెడ్స్‌ను మోసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంది.
మానవ రహిత నిర్వహణావ్యవస్థ గల మెట్రో రైలు
-దేశంలో తొలిసారిగా మానవ రహిత నిర్వహణావ్యవస్థ కలిగిన మెట్రో రైలును వెంకయ్యనాయుడు మే 17న ఢిల్లీలో ప్రారంభించారు.
తేజస్ యుద్ధ విమానం
-పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం గల యుద్ధ విమానం తేజస్‌ను మే 17న రూపొందించారు. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారుచేయారు. ఈ విమానంలో తొలిసారిగా వైమానిక దళం ప్రధానాధికారి అరూప్ రాహా ప్రయాణించారు. ఇది గంటకు 1235 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానానికి సహాయంగా హంస/ధృవ హెలికాప్టర్లను రూపొందించారు. మొత్తం 120 యుద్ధ విమానాలున్నాయి.
మమత, జయలలితల విజయం
- మే 19న 5 రాష్ర్టాల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. వరుసగా రెండోసారి పశ్చిమబంగలో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలితలకు ప్రజలు పట్టం కట్టారు. పశ్చిమబంగలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగాను టీఎంసీ-211, కాంగ్రెస్ 44, సీపీఎం 32, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. 1 స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. అసోంలో మొత్తం 126 స్థానాలకుగాను బీజేపీ 86, కాంగ్రెస్ 26, యూఐఏడీ 13 స్థానాలు గెలుచుకున్నాయి. తమిళనాడులో 234కుగాను 232 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఏఐడీఎంకే 134, డీఎంకే 98 స్థానాలు గెలుచుకున్నాయి. కేరళలో 140 స్థానాలకుగాను ఎల్డీఎఫ్ 91, కాంగ్రెస్ 46, బీజేపీ 1 స్థానాలు గెలుచుకున్నాయి. పాండిచ్చేరిలో మొత్తం 30 స్థానాలకుగాను కాంగ్రెస్ కూటమి 17, ఎన్‌ఆర్‌ఎస్ కూటమి 8, అన్నా డీఎంకే 4, ఇతరులు 1 గెలుచుకున్నాయి.