పోషణ
శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు, లేదా పోషకాలు (Nutrients) అంటారు. వీటిని సేకరించడం లేదా తీసుకోవడాన్ని పోషణ (Nutrition) అంటారు.
జంతు శాస్త్రం ప్రకారం పోషణలో ఆహార స్వీకరణ (ఆహారాన్ని తీసుకోవడం), జీర్ణక్రియ (స్థూల అణువులను సూక్ష్మ అణువులుగా మార్చడం), శోషణం (ఆంత్ర కుడ్యము పీల్చుకోవడం), స్వాంగీకరణం (రక్త ప్రసరణలోనికి చేరటం) మరియు విసర్జన (జీర్ణము కాని మరియు అనవసరమైన పదార్ధాలను బయటకు పంపించడం) అను విధానాలు ఉంటాయి.
పోషకాలు రెండు రకాలు అవి
స్థూల పోషకాలు (Macro Nutrients)
సూక్ష్మ పోషకాలు (Micro Nutrients)
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు లాంటివి మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.
కార్బో హైడ్రేట్లు
ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమవుతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలక్టోజ్, రైబోజ్, లాంటి వాటిలో ఒకే చక్కెర పరమాణువు ఉంటుంది. కాబట్టి వీటిని సరళ చక్కెరలు అంటారు. చెరకులోని చక్కెర అయిన గ్లూకోజ్, పాలలోని చక్కెరయైన లాక్టోజ్, జంతువులలోని పిండి పదార్థమైన గ్లైకోజెన్, మొక్కల్లోని పిండిపదార్థం, వృక్షకణాల్లోని సెల్యులోజ్ లాంటివి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. వీటిలో రెండు నుంచి అనేక వందల చక్కెర అణువులు ఉంటాయి. ఆహారం ద్వారా మనం తీసుకున్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆహారనాళంలోని ఎంజైమ్ లతో జలవిశ్లేషణం చెంది సరళ చక్కెరలుగా విడిపోతాయి. ఈ సరళ చక్కెరలను మన శరీరం శోషించుకుంటుంది
-వినయ్ కుమార్