బద్దెన :
సుమతీ శతకం గురించి వినని తెలుగువాదు ఉండడు. ఇది ఒక నీతి శతకం. ఈ శతక రచయిత బద్దెన. ఈయన ఓ చిన్న సామంత రాజు. 13వ శతాబ్దికి చెందినవాడని భావిస్తున్నారు. కడప జిల్లాలోని ఇప్పటి బద్వేలును ఒకప్పుడు బద్దెప్రోలు అని పిలిచేవారు. బద్దెన పేరు మీద వచ్చిందే బద్దెప్రోలు.
"శ్రీరాముని దయ చేతను
నారూఢిగ సకల జనులు ఔరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ"...
ఇది సుమతీ శతకములోని మొదటి పద్యము. "సుమతి" అంటే మంచి మతి కలిగిన స్త్రీ, మరియు మంచి మతి కలిగిన పురుషుడు అని అర్ధం. ఈ సంబోధన స్త్రీ పురుషులిరువురికీ వర్తిస్తుంది. బద్దెన సుమతీ నీతి శతకం మాత్రమే కా, నీతి శాస్త్ర ముక్తావళి కూడా రచించాడు. ఆంధ్ర సాహిత్యంలో బద్దెనది ఓ ప్రత్యేక స్థానం.