Type Here to Get Search Results !

Vinays Info

జాతీయం

Top Post Ad

జాతీయం
ఆర్‌ఎల్వీటీడీ పరీక్ష విజయవంతం
-స్వదేశీ పరిజ్ఞానంతో తొలి మానవ రహిత పునర్వినియోగ అంతరిక్ష వాహన నౌకను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 23న విజయవంతంగా ప్రయోగించింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) మాదిరిగా కనిపించే రీ యూజనబుల్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ (ఆర్‌ఎల్వీటీడీ) ను ప్రత్యేకమైన రాకెట్ బూస్టర్ ద్వారా 65 కి.మీ. ఎత్తులోని అంతరిక్ష వాతావరణంలోకి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి తిరిగి బంగాళాఖాతంలోని పర్చువల్ రన్‌వేపైకి చేరుకొనేలా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ప్రక్రియ 13 నిమిషాల్లో (770 సెకన్లు) పూర్తయింది. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువున్న దీన్ని నీటిలో తేలేవిధంగా డిజైన్ చేయకపోవడంతో తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలు కాలేదు. ఈ కీలక పరీక్ష విజయవంతం కావడంతో భవిష్యత్‌లో తక్కువ ఖర్చుతోపాటు సులభంగా అంతరిక్ష ప్రయోగాలు జరపాలన్న ఇస్రో లక్ష్యానికి ముందడుగు పడింది.
పృథ్వి-2 క్షిపణి పరీక్ష
-పృథ్వి-2 క్షిపణిని మే 18న పరీక్షించారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. చాందీపూర్‌లోని బాలాసోర్ ప్రాంతంలో పరీక్షించారు. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. దీని పరిధి 350 కి.మీ. ఇది 500 నుంచి 1000 కేజీల బరువు గల వార్‌హెడ్స్‌ను మోసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంది.
మానవ రహిత నిర్వహణావ్యవస్థ గల మెట్రో రైలు
-దేశంలో తొలిసారిగా మానవ రహిత నిర్వహణావ్యవస్థ కలిగిన మెట్రో రైలును వెంకయ్యనాయుడు మే 17న ఢిల్లీలో ప్రారంభించారు.
తేజస్ యుద్ధ విమానం
-పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం గల యుద్ధ విమానం తేజస్‌ను మే 17న రూపొందించారు. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారుచేయారు. ఈ విమానంలో తొలిసారిగా వైమానిక దళం ప్రధానాధికారి అరూప్ రాహా ప్రయాణించారు. ఇది గంటకు 1235 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానానికి సహాయంగా హంస/ధృవ హెలికాప్టర్లను రూపొందించారు. మొత్తం 120 యుద్ధ విమానాలున్నాయి.
మమత, జయలలితల విజయం
- మే 19న 5 రాష్ర్టాల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. వరుసగా రెండోసారి పశ్చిమబంగలో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలితలకు ప్రజలు పట్టం కట్టారు. పశ్చిమబంగలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగాను టీఎంసీ-211, కాంగ్రెస్ 44, సీపీఎం 32, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. 1 స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. అసోంలో మొత్తం 126 స్థానాలకుగాను బీజేపీ 86, కాంగ్రెస్ 26, యూఐఏడీ 13 స్థానాలు గెలుచుకున్నాయి. తమిళనాడులో 234కుగాను 232 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఏఐడీఎంకే 134, డీఎంకే 98 స్థానాలు గెలుచుకున్నాయి. కేరళలో 140 స్థానాలకుగాను ఎల్డీఎఫ్ 91, కాంగ్రెస్ 46, బీజేపీ 1 స్థానాలు గెలుచుకున్నాయి. పాండిచ్చేరిలో మొత్తం 30 స్థానాలకుగాను కాంగ్రెస్ కూటమి 17, ఎన్‌ఆర్‌ఎస్ కూటమి 8, అన్నా డీఎంకే 4, ఇతరులు 1 గెలుచుకున్నాయి.
అంతర్జాతీయం
అతి పెద్ద కార్గో విమానం
-ప్రపంచంలోనే అతిపెద్ద సరుకుల రవాణా విమానం ఆంటోనవ్ ఏఎన్-225 మ్రియా మే 13న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆరు టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉన్న దీని బరువు 640 టన్నులు. దీని గరిష్ట వేగం గంటకు 850 కి.మీ.. బోయింగ్ సి-17, ఎయిర్ బస్ 0-380ల కంటే ఎన్నో రెట్లు పెద్దది.
అతిపెద్ద నౌక ప్రారంభం
-ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల రవాణా నౌక హార్మోని ఆఫ్ ది సీస్ మే 22న తొలి ప్రయాణాన్ని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి ప్రారంభించింది.
5వ స్థానంలో తాజ్‌మహల్
-ట్వెన్ స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో అత్యధిక పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. ఇందులో పెరూ దేశంలోని మచు పిచ్చు మొదటి స్థానంలో ఉండగా ఇండియాలోని తాజ్‌మహల్ 5వ స్థానంలో ఉంది.
సముద్రంలో కూలిన విమానం
-ఈజిప్టు ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ 320 మే 19న మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది మరణించారు.
ఐరాస ప్రత్యేక రాయబారులు
-ఎల్‌నినో, పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారులుగా మేరీ రాబిన్సన్, మచారియా కమావులను ఐరాస ప్రధానకార్యదర్శి బాన్‌కీమూన్ నియమించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు తాండవిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఈ రాయబారులు ఎల్‌నినో ప్రభావాన్ని, వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో ప్రపంచదేశాలకు సహకారం అందిస్తారు.
క్రీడలు
బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్
-భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ మే 22న నియమితులయ్యారు.
రియో ఒలింపిక్స్ అర్హతలో మేరీకోమ్ విఫలం

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.