Type Here to Get Search Results !

Vinays Info

Full Information about Jharkhand | జార్ఖండ్ సమాచారం

జార్ఖండ్ సమాచారం
-తూర్పు భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రం 2000, నవంబర్ 15న ఆవిర్భవించింది.
-బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు సరిహద్దులుగా ఉన్న జార్ఖండ్ 79,714 కి.మీ. విస్తరించింది.
రాష్ట్ర రాజధాని: రాంచీ
అతిపెద్ద పారిశ్రామిక నగరం: జంషెడ్‌పూర్
మొత్తం జిల్లాలు: 24
ముఖ్యమంత్రి: రఘువర్ దాస్
గవర్నర్: ద్రౌపదీ ముర్ము
హైకోర్టు: రాంచీ హైకోర్టు
మొత్తం జనాభా: 3,29,88,134 (2011 జనాభా లెక్కల ప్రకారం)
అక్షరాస్యత: 67.6 శాతం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 81
పార్లమెంటు నియోజకర్గాలు: 14
రాష్ట్ర జంతువు: ఏనుగు
రాష్ట్ర పక్షి: కోయిల
రాష్ట్ర పుష్పం: పలాష్ (BUTEA MONOSPERMA)
పరిశ్రమలు ఎక్కువగా విస్తరించిన ఉన్న నగరాలు: బొకారో, ధన్‌బాద్, జంషెడ్‌పూర్
గిరిజన తెగలు: ముండా, అసుర్, సంతాల్, ఖరియా, గోండ్, కన్వార్, కోల్, ఒరౌన్, బైగా, బంజారా, బతుడీ, బెడియా.
ప్రాంతీయ పండుగలు: కర్మా, సొహ్రాయ్, సర్హుల్
[02/02, 10:59 p.m.] VINAY KUMAR: జానపద నృత్యాలు
పైకా: ఇది ముండా కమ్యూనిటీకి చెందిన జానపద నృత్యం. యుద్ధానికి వెళ్లే ముందు ఈ నృత్యం చేస్తారు.
హంటా డ్యాన్స్: ఇది వేటకు సంబంధించిన నృత్యం. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఉండే సంతాల్ తెగకు చెందినవారు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
ముండారి డ్యాన్స్: ముండారి తెగలో ఈ నృత్యం ప్రసిద్ధి చెందింది. ఇందులో ఈ తెగకు చెందినవారంతా పాల్గొంటారు.
బారౌ డ్యాన్స్: ఇది ఒరౌన్ తెగకు సంబంధించిన నృత్యం. దీన్ని హజారీబాగ్ గూమ్లా ప్రాంతంలో నివసించేవారు మాత్రమే దీన్ని ప్రదర్శిస్తారు.
గిరిజన నృత్యాలు: ఆదిమ తెగలైన ముండా, సంతాల్, ఒరౌన్‌లకు పాటలు పాడటం, నృత్యాలు చేయడం వంటివి జన్మతః సిద్ధిస్తాయి. ఇది వారి సంఘ జీవనానికి నిదర్శనంగా నిలుస్తాయి.
జెననా ఝుమర్ (JENANA JHUMUR): ఈ జానపద నృత్యం సంతాల్, నాగపురి తెగలకు మాత్రమే సంబంధించింది. వానాకాలంలో పంటలు సాగు చేయడంలో భాగంగా ఈ తెగలకు సంబంధించిన మహిళలకు ఈ కళను ప్రదర్శిస్తారు.

జాతీయ పార్కులు
దల్మా వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ: ఇది జంషెడ్‌పూర్ నగరానికి 10 కి.మీ. దూరంలో దల్మా కొండల్లో ఉంది. దీన్ని 1975లో సంజయ్‌గాంధీ ప్రారంభించారు.
హజారీబాగ్ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ: రాంచీకి 89 కి.మీ. దూరంలో విస్తరించి ఉంది. దీన్ని 1955లో ఏర్పాటు చేశారు.
బెట్లా నేషనల్ పార్క్: ఇది పలాము జిల్లాలోని ఛోటా నాగపూర్ పీఠభూమిలో విస్తరించి ఉంది. ఇది దేశంలో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించి మొదటి జాతీయ పార్కు.
పలాము టైగర్ రిజర్వ్: దేశంలో ఏర్పాటు చేసిన తొమ్మిది టైగర్ రిజర్వ్‌లలో ఇది ఒకటి. పలాము జిల్లాలోని బెట్లా నేషనల్ పార్కులో ఉంది.

బరాజ్‌లు
చిందా డ్యామ్: చిందా నదిపై సిమ్డెగా నగరానికి సమీపంలో ఉంది.
అన్రాజ్ డ్యామ్: అర్రాజ్ నదిపై ఉంది.
గెటల్సుడ్ డ్యామ్: సువర్ణరేఖ నదిపై ఉంది.
పంచత్‌హిల్ డ్యామ్: దామోదర్ నదిపై ఉంది.
విమానాశ్రయాలు: బిస్రాముండా ఎయిర్‌పోర్ట్ (రాంచీ), సొనారి ఎయిర్‌పోర్ట్ (జంషెడ్‌పూర్)

విద్యుదుత్పత్తి కేంద్రాలు
తెనూఘాట్ థర్మల్ పవర్ స్టేషన్
పట్రటు థర్మల్ పవర్ స్టేషన్
సికిదిరి హైడల్ పవర్ ప్లాంట్

ముఖ్యమైన నదులు
దామోదర్, సంఖ్, నార్త్ కోయెల్, బరాకర్, సువర్ణరేఖ, గంగ

సరస్సులు
-రాంచీ సరస్సు (రాంచీ)
-టోప్‌చంచీ సరస్సు (ధన్‌బాద్)
-హుంద్రు జలపాతం (రాంచీ)
-పంచ్‌గాఘ్ జలపాతం
-కనారీ హిల్ (హజారీబాగ్)
-హిర్నీ జలపాతం (రాంచీ)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section