Type Here to Get Search Results !

Vinays Info

సత్యేంద్రనాథ్ బోస్(భౌతిక శాస్త్రవేత్త)

Top Post Ad

సత్యేంద్రనాథ్ బోస్(భౌతిక శాస్త్రవేత్త)
🔸భారత దేశభౌతికశాస్త్ర వేత్త.ఈయన గణిత,భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు.*

*🔸బోస్ కలకత్తాలో జన్మించా డు. ఆయన 1920లలో క్వాంటం మెకానిక్స్ లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ మరియు బోస్-ఐన్‌ స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు. ఆయన  భారతదేశంలో రెండవఅత్యున్న త అవార్డు అయిన పద్మవిభూషణ్ ను 1954 లో పొందాడు.*

*🔸ప్రస్తుతం విశ్వంలోవ్యాపించి ఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు ఆయన పేరును అనగా  హిగ్స్ బోసన్  కణాలని  'పాల్ డిరాక్'నామకరణం చేశాడు.*

*🔸ఆయన స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. ఆయన అనేక రంగాలలో అనగా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము,  గణిత శాస్త్రము,జీవశాస్త్రము, లోహసంగ్ర హణశాస్త్రము, తత్వ శాస్త్రము, కళలు,  సాహిత్యం మరియు సంగీతం కృషిచేశారు. ఆయన స్వతంత్ర భారత దేశం లో అనేక పరిశోధనాకమిటీలలో  పనిచేసి విశేష సేవ చేశారు.*

🔸ఆయన బహుభాషా కోవిదుడు. ఆయన బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృతం భాషలందు మరియు టెన్నిసన్, రవీంద్రనాధ టాగూరు మరియు కాళిదాసు కవిత్వాల యందునిష్ణాతుడు.ఆయన  వయొలిన్ వంటి వాద్య పరికరం అయిన ఎస్రాజ్ కూడా వాయించే వాడు.

🔸బాల్య జీవితం బోస్ భారతదేశం లోని  పశ్చిమ బెంగాల్  రాష్ట్ర ముఖ్య పట్టణమైన  కలకత్తాలో  జన్మించారు. ఈయన తండ్రి సురేంధ్రనాథ్ బోస్ ఒక రైల్వే ఉద్యోగి. సురేంద్రనాథ్ బోస్ కు మొదటి సంతానంగా సతేంద్రనాథ్ బోస్ జన్మించారు. ఈయన పూర్వీకులు కలకత్తాకు  48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియా జిల్లాలోని బారా జగులియాలో ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. ఆయన చదివే పాఠశాల తన యింటికి దగ్గరలో ఉండేది. తర్వాత ఆయన కుటుంబం గోవాబహన్ కు మారినది. అచ్చట గల 'న్యూ ఇండియన్ పాఠశాల'లో చేరాడు. తన పాఠశాల చివరి సంవత్సరంలో ఆయన "హిందూ పాఠశాల"కు మారాడు. 1909 లో జరిగిన మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్షలో అత్యధికమార్కులు పొంది ఉత్తీర్ణుడయ్యాడు.   ఆయన తర్వాత విజ్ఞాన శాస్త్రంలో ఇంటర్ మీడియట్ లో కలకత్తాలో గల ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. అచట కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఉపాధ్యాయులైన జగదీశ్ చంద్రబోస్  మరియు ప్రఫుల్ల చంద్రరాయ్ చే బోధింప బడ్డాడు. రెండు సంవత్సరాల తర్వాత  ఢాకా  నుండి మేఘనాథ్ సాహ ఇదే కళాశాలలో చేరాడు. పి.సి.మహలానోబిస్ మరియు సిసిర్ కుమార్ మిత్రాలు ఈయన కంటే కొన్ని సంవత్సరములు సీనియర్లు. సత్యేంద్రనాథ్ బోస్ బి.యస్సీలో "అనువర్తిత గణిత శాస్త్రం "ను ప్రధాన విషయంగా తీసుకొని 1913 లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1915 లో అనువర్తిత గణిత శాస్త్రంలో ఎం.యస్సీ కూడా పూర్తిచేశాడు. ఎం.యస్సీలో కలకత్తా  విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డును స్వంతం చేసుకున్నాడు.అది ఇంతవరకు ఎవరూ అధికమించకపోవడం విశేషం.

*🔸ఎం.యస్సీ పూర్తి చేసిన తర్వాత 1916లో కలకత్తా  విశ్వవిద్యాలయంలో  పరిశోధకుడుగా చేరాడు. అచట ఆయన  సాపేక్ష సిద్ధాంతంపై తన పరిశోధనలు ప్రారంభించారు. ఇది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చరిత్రలో ఒక విశేషమైన యుగంగా చెప్పుకోవచ్చు.ఆదే సమయంలో ఐన్‌స్టీన్  ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వెలువడింది. దాని ముఖ్య ఫలితాల వెలువడినవి.*

*🔸సత్యేంద్రనాథ్ బోస్ తన 20 వ సంవత్సరంలో "ఉషావతి"ని వివాహం చేసుకున్నారు.వారికి తొమ్మిది మంది పిల్లలు జన్మించారు.  బోస్ ఫిబ్రవరి 4,1974లో  మరణించారు.*

(జనవరి 1, 1894 - ఫిబ్రవరి 4,1974)
🍒🕊సే:సురేష్ కట్టా🌸🙏🌸

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.