గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన వేద గణితముద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు ప్రాచీన ఈజిప్టు,మెసపుటేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకునాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయినసున్నా భారతీయుల ఆవిష్కరణే.
కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలు:
పంచ సిద్దాంతిక - క్రీ.శ.5వ శతాబ్దము
ఆర్య భట్టీయం - క్రీ.శ.5వ శతాబ్దము
సిద్దాంత శిరోమణి - క్రీ.శ.12వ శతాబ్దము
లీలావతి - భాస్కరాచార్య II - క్రీ.శ.12వ శతాబ్దము
శుల్బ సూత్రాలు - రేఖా గణిత సూత్రాలు ఉన్నాయి.- దేవాలయ నిర్మాణానికి ఉపయోగించేవారు.
సాంఖ్యక శాస్త్రము
సహజ సంఖ్యా సమితి Natural numbers అనగా {1, 2, 3, .....} దీనిని 'N' తో సూచిస్తారు.
పూర్ణాంకాళ సమితి whole numbers అనగా {0, 1, 2, 3, .....} దీనిని 'W' తో సూచిస్తారు.
పూర్ణ సంఖ్యల సమితి integers అనగా {...-3, -2, -1, 0, 1, 2, 3, .....} దీనిని 'z' తో సూచిస్తారు.
ధన పూర్ణ సంఖ్యల సమితి positive integersఅనగా {+1, +2, +3, .....} దీనిని '+Z' తో సూచిస్తారు.
ఋణ పూర్ణ సంఖ్యల సమితి Nagative integersఅనగా {-1, -2, -3, .....} దీనిని '-Z' తో సూచిస్తారు.
అకరణీయ సంఖ్యల సమితి Rational Numbers
కరణీయ సంఖ్యల సమితి Irrational Numbers