ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గాన్ని స్విట్జర్లాండ్‌లోని ఎర్ట్స్‌ఫెల్డ్‌లో జూన్ 1 లాంఛనంగా ప్రారంభించారు.ఈ మార్గాన్ని ఆల్ప్స్ పర్వాతాల కింద నిర్మించారు. యూరప్ దేశాల మధ్య రవాణాను ఇది మరింత సులభతరం చే స్తుంది. ‘గొత్థార్డ్ బేస్ టన్నెల్’గా పిలిచే దీని పొడవు 57 కి.మీ. కాగా, కొన్నిచోట్ల ఉపరితలానికి 2.3 కి.మీ దిగువన ఉంటుంది. ఈ మార్గంలో నడిచిన తొలి రైలులో ప్రయాణించిన వారిలో స్విస్ అధ్యక్షుడు స్నీడర్-అమ్మన్‌తోపాటు జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్, ఇటలీ ప్రధాని రెంజి కూడా ఉన్నారు. దీన్ని నిర్మించడానికి 17 ఏళ్లు పట్టింది. రూ.8,100 కోట్లు ఖర్చు చేశారు. దీని వల్ల స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్, ఇటలీలోని మిలాన్ మధ్య ప్రయాణ కాలం గంట తగ్గుతుంది. రైలు ఇందులో ప్రయాణించడానికి 20 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం జపాన్‌లోని సీకన్ సొరంగమార్గం (53.9 కి.మీ) పేరు మీదున్న రికార్డును గొత్థార్డ్ బేస్ టన్నెల్ బద్దలుకొట్టింది.
Follow us on
www.vinaysinfo.blogspot.com