1. ఇటీవల వివాదాస్పదమైన వ్యక్తుల ఎత్తు పెంపు శస్త్రచికిత్స పేరేమిటి?
1) ఇలిజరోవ్
2) లింబ్ లెంగ్తెనింగ్
3) నీ లెంగ్తెనింగ్
4) నీజరోవ్
View Answer
సమాధానం: 1
వివరణ: ఇలిజరోవ్ అనేది రష్యన్ సాంకేతిక విధానం. ఈ ప్రక్రియ ద్వారా కాళ్లకు శస్త్రచికిత్స చేసి ఎత్తు పెంచుతారు.
2. మహారాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయ గర్భగుడిలో మహిళల ప్రవేశానికి అనుమతించిన ఆలయం ఏది?
1) త్రయంబకేశ్వర్
2) శని సింగనాపూర్
3) నాసిక్
4) మహాలక్మీ దేవాలయం
View Answer
సమాధానం: 2
వివరణ: మహిళలకు అనుమతిలేని శని సింగనాపూర్ ఆలయ గర్భగుడిలో ప్రవేశానికి తృప్తిదేశాయ్ ఆధ్వర్యంలో ‘భూ మాత బ్రిగేడ్’ సంఘం గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తుంది.
3. పట్టణ ఆరోగ్యంపై ‘సుస్థిరాభివృద్ధికి దోహదపడే ఆరోగ్యకర, నిష్పక్షపాత పట్టణాలు’ పేరిట అంతర్జాతీయ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
1) అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO)
2) ఐక్యరాజ్యసమితి
3) డబ్ల్యూహెచ్ఓ, యూఎన్-హెబిటాట్
4) యునెస్కో
View Answer
సమాధానం: 3
4. ‘నైపుణ్య భారత్’ ప్రచార బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు?
1) రాహుల్ ద్రవిడ్
2) సానియా మీర్జా
3) సైనా నెహ్వాన్
4) సచిన్ టెండూల్కర్
View Answer
సమాధానం: 4
వివరణ: ‘స్కిల్ ఇండియా (నైపుణ్య భారత్)’ ప్రచార బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం సచిన్కు అప్పగించింది.
5. రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్
2) విజయవాడ
3) బెంగళూరు
4) చెన్నై
View Answer
సమాధానం: 1
వివరణ: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల 14వ జాతీయ సదస్సు హైదరాబాద్లో ఏప్రిల్ 9, 10వ తేదీల్లో జరిగింది.
6. బ్రిటన్కు చెందిన ‘ఫౌండర్స్ అవార్డు’ ఎవరికి లభించింది?
1) మహాత్మా గాంధీ
2) మదర్ థెరిసా
3) నరేంద్ర మోదీ
4) మన్మోహన్ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: ఫౌండర్స్ అవార్డులను 2010 నుంచి అందజేస్తున్నారు. 2011 నుంచి ఆసియా విభాగానికి సంస్కృతి, క్రీడలు, సమాజ సేవ, వ్యాపారం, వినోదం వంటి విభాగాల్లో ఈ అవార్డును బహూకరిస్తున్నారు. మదర్ థెరిసాకు మరణానంత రం ఈ అవార్డును ప్రకటించారు.
7. పుట్టింగల్ దేవీ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు
2) కేరళ
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
View Answer
సమాధానం: 2
వివరణ: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్ గ్రామంలో పుట్టింగల్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బాణాసంచా వేడుకలో ప్రమాదం జరిగి దాదాపు 105 మంది భక్తులు మృతి చెందారు.
8. ‘నార్త్ ఈస్ట్ - ఏసియాన్ బిజినెస్ సమ్మిట్’ను ఎక్కడ నిర్వహించారు?
1) గౌహతి
2) ఇటానగర్
3) ఇంపాల్
4) ఐజ్వాల్
View Answer
సమాధానం: 3
వివరణ: మణిపూర్ రాజధాని ఇంపాల్లో ‘నార్త్ ఈస్ట్ - ఏసియాన్ బిజినెస్ సమ్మిట్’ను నిర్వహించారు.
9. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదం ఏమిటి?
1) ఎయిడ్స్ను ఎదుర్కోవడం
2) ఎబోలాను ఎదుర్కోవడం
3) కేన్సర్ను ఎదుర్కోవడం
4) డయాబెటిస్ను ఎదుర్కోవడం
View Answer
సమాధానం: 4
వివరణ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ సారి ‘Beat Diabetes’ అనేది నినాదం.
10. ‘ఏ స్టేట్ ఇన్ డెనియల్’ పుస్తక రచయిత ఎవరు?
1) విక్రమ్ సేర్
2) కుష్వంత్ సింగ్
3) బి.జి. వర్గీస్
4) కులదీప్ నయ్యర్
View Answer
సమాధానం: 3
వివరణ: ‘ఏ స్టేట్ ఇన్ డెనియల్ - పాకిస్థాన్స్ మిస్గెడైడ్ అండ్ డేంజరస్ క్రూసేడ్’ అనే పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టు బి.జి. వర్గీస్ రచించారు.
11. స్వచ్ఛ భారత్లో భాగంగా ‘నమ్మ టాయిలెట్’ పథకాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ
2) విజయవాడ
3) హైదరాబాద్
4) జైపూర్
View Answer
సమాధానం: 1
వివరణ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ‘నమ్మ టాయిలెట్’ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఇవి పర్యావరణ రహిత టాయిలెట్లు.
12. అంతర్జాతీయంగా వాతావరణ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిన సంస్థ ఏది?
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ
2) ప్రపంచ బ్యాంకు
3) ఐక్యరాజ్య సమితి
4) ప్రపంచ వాతావరణ సంస్థ
View Answer
సమాధానం: 2
వివరణ: ఈ ప్రణాళిక ద్వారా ప్రపంచ దేశాలు 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. 40 ప్రపంచ దేశాల్లో వ్యవసాయ పెట్టుబడి ప్రణాళికలను కూడా విడుదల చేసింది.
13. ప్రపంచంలో అతి సన్నని లాప్టాప్, నోట్బుక్లను విడుదల చేసిన సంస్థ ఏది?
1) హెచ్పీ
2) డెల్
3) ఏసర్
4) అసుస్
View Answer
సమాధానం: 1
14. దేశంలోనే మొదటి ‘మెట్రినో పాడ్’ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది?
1) హైదరాబాద్
2) గుర్గావ్
3) పుణె
4) అమరావతి
View Answer
సమాధానం: 2
వివరణ: ‘మెట్రినో పాడ్’ అనేది వేగవంతమైనవ్యక్తిగత రవాణా వ్యవస్థ. దీన్ని దేశంలోనే తొలిసారిగా గుర్గావ్లో నిర్మించనున్నారు.
15. ఎర్ర సముద్రంపై వంతెన నిర్మాణం కోసం ఈజిప్టు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
1) టర్కీ
2) ఇజ్రాయిల్
3) సౌదీ అరేబియా
4) లెబనాన్
View Answer
సమాధానం: 3
వివరణ: ఈజిప్టు, సౌదీ అరేబియా దేశాలను కలుపుతూ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నారు.
16. ప్రభుత్వ ప్రకటనల విధి విధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షులు ఎవరు?
1) రజత్ శర్మ
2) పీయూష్ పాండే
3) కృనాల్ మిశ్రా
4) బి.బి. టాండన్
View Answer
సమాధానం: 4
వివరణ: ప్రభుత్వ ప్రకటనల విధి విధానాలను రూపొందించే త్రిసభ్య కమీటికి బి.బి. టాండన్ అధ్యక్షుడు. రజత్ శర్మ, పీయుష్ పాండే సభ్యులుగా ఉన్నారు.
17. సాజిబు చేరోబా (Sajibu Cheiraoba) పండుగను ఎక్కడ జరుపుకుంటారు?
1) మణిపూర్
2) మేఘాలయ
3) అరుణాచల ప్రదేశ్
4) నాగాలాండ్
View Answer
సమాధానం: 1
వివరణ: సాజిబు నెల (ఏప్రిల్) మొదటి రోజున మణిపూర్లో ఈ పండుగను జరుపుకుంటారు.
18. మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ఏ దేశంలో ప్రతిష్టించనున్నారు?
1) ఇంగ్లండ్
2) రష్యా
3) ఫ్రాన్స్
4) స్పెయిన్
View Answer
సమాధానం: 3
వివరణ: ఫ్రాన్స్లోని సెయింట్ ట్రోపెజ్ పట్టణంలో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
19. ‘సన్షైన్’ పథకాన్ని ప్రారంభించిన ఈ - కామర్స్ దిగ్గజం -
1) అమెజాన్
2) ప్లిప్కార్ట్
3) పేటీఎం
4) స్నాప్డీల్
View Answer
సమాధానం: 4
వివరణ: స్నాప్డీల్ సన్షైన్ కార్యక్రమం ద్వారా పాత వస్తువులను స్వచ్ఛంద సంస్థలకు అందించొచ్చు.
20. ‘ది హాక్స్ బే కప్’ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) న్యూజీలాండ్
2) ఇండియా
3) ఆస్ట్రేలియా
4) పాకిస్థాన్
View Answer
సమాధానం: 2
వివరణ: కెనడాను 1 - 0 తేడాతో ఓడించి ఇండియా ది హాక్స్ బే కప్ టైటిల్ను గెల్చుకుంది. ఇది న్యూజిలాండ్లో జరిగింది.
21. జేఈఈ ర్యాంకుల జారీలో + 2 మార్కుల వెయిటేజీని పరిగిణించవద్దని ఏ కమిటీ సిపార్సు చేసింది?
1) మృనాల్సింగ్
2) మనీష్ అయ్యర్
3) అశోక్ మిశ్రా
4) శక్తి గోఖలే
View Answer
సమాధానం: 3
22. ఏకీకృత విద్యుత్ అభివృద్ధి పథకం (IPDS)లో భాగంగా భూగర్భ కేబుల్ వ్యవస్థను మంత్రి పీయూష్ గోయల్ ఏ నగరంలో ప్రారంభించారు?
1) పుణె
2) విజయవాడ
3) కటక్
4) వారణాసి
View Answer
సమాధానం: 4
వివరణ: IPDS - Integrated Power Development Scheme
23. జాట్ రిజర్వేషన్ అందోళనల్లో జరిగిన హింసపై వేసిన విచారణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు?
1) ఎస్.ఎన్. ఝా
2) జీవన్ రెడ్డి
3) అనిల్ వర్మ
4) నూపూర్ కుమార్
View Answer
సమాధానం: 1
వివరణ: జాట్ల ఆందోళనల్లో జరిగిన హింస, ఇతర అసాంఘిక చర్యలపై విచారణ నిమిత్తం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నియమించారు. ఈ కమిటీకి జస్టిస్ ఎస్.ఎన్. ఝా అధ్యక్షత వహించారు.
24. ‘ది ఇంటర్నేషనల్ మైన్ కౌంటర్మెజర్ ఎక్సర్సైజ్ (IMCMEX)’ పేరిట సముద్ర విన్యాసాలు ఎక్కడ జరిగాయి?
1) ఈజిప్టు
2) ఇరాన్
3) బహ్రెయిన్
4) శ్రీలంక
View Answer
సమాధానం: 3
వివరణ: అమెరికన్ నేవీ ఆధ్వర్యంలో బహ్రెయిన్లోని మధ్యప్రాచ్య జలాల్లో నౌకా విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి.
25. మిస్ ఇండియా వరల్డ్ - 2016 టైటిల్ విజేత ఎవరు?
1) నవనీత్ సింగ్
2) ప్రియదర్శిని ఛటర్జీ
3) పింకూ పాండే
4) విజయ అప్టే
View Answer
సమాధానం: 2
26. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
1) ఏప్రిల్ 8
2) ఏప్రిల్ 9
3) ఏప్రిల్ 11
4) ఏప్రిల్ 10
View Answer
సమాధానం: 4
వివరణ: హోమియోపతి వైద్య విధానం పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానేమన్ జయంతి రోజున ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
27. లక్ష గ్రామ పంచాయతీలను వైఫై ఆధారిత సెట్వర్క్ ద్వారా అనుసంధానించనున్న టెలికాం సంస్థ ఏది?
1) బీఎస్ఎన్ఎల్
2) ఎయిర్టెల్
3) రిలయన్స్ జియో
4) ఐడియా
View Answer
సమాధానం: 1
వివరణ: భారత ప్రభుత్వ గ్రామీణ బ్రాడ్బాండ్ పథకంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఈ కార్యాక్రమాన్ని నిర్వర్తిస్తోంది.
28. ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ను అందుకున్నది ఎవరు?
1) జయలలిత
2) నవనీతమ్ పిళ్లై
3) మన్మోహన్ సింగ్
4) సల్మాన్ ఖాన్
View Answer
సమాధానం: 2
వివరణ: దక్షిణాఫ్రికాలో మొట్ట మొదటి నల్ల జాతీయ మహిళా న్యాయమూర్తి, భారత సంతతి వ్యక్తి అయిన నవనీతమ్ పిళ్లైకి ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం లభించింది,
29. అన్ని కాలాల్లో పనిచేసే సౌర విద్యుత్తు పలకను తయారు చేసిన దేశం ఏది?
1) భారతదేశం
2) అమెరికా
3) చైనా
4) జపాన్
View Answer
సమాధానం: 3
వివరణ: చైనా శాస్త్రవేత్తలు అత్యంత అధునాతనమైన సౌరవిద్యుత్తు పలకను గ్రాఫీను ఆధారంగా తయారు చేశారు.
30. మాల్దీవులు అధ్యక్షుడు ఎవరు?
1) అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్
2) నవీన్ గులామ్ చంద్
3) జగదీష్ గజ్జల్
4) మహ్మద్ గనీ
View Answer
సమాధానం: 1
వివరణ: మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఇటీవల భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్తో ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నార
ు.
31. ఉత్తమ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్లు ప్రకటించిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) పంజాబ్
3) మణిపూర్
4) జార్ఖండ్
View Answer
సమాధానం: 4
32. ‘యునెస్కో/గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్’ ఈ ఏడాది ఎవరికి లభించింది?
1) ఖాదిజా ఇస్మాయిలోవా
2) ప్రవీణ్ ధప్సే
3) మహ్మద్ అబ్దుల్
4) జాఫర్ సక్సేనా
View Answer
సమాధానం: 1
వివరణ: అజర్బైజాన్ జర్నలిస్ట్ ఖాదిజాకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ను యునెస్కో ప్రకటించింది. ప్రముఖ కొలంబియా జర్నలిస్ట్ గిలెర్మో కానో ఇసాజా పేరిట ఈ బహుమతిని అందిస్తున్నారు.
33. అత్యధిక సమయం నిర్విరామంగా నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు?
1) యామినీ కృష్ణమూర్తి
2) సోనీ చౌరాసియా
3) బిర్జూ మహారాజ్
4) చింకూ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: సోనీ చౌరాసియా వారణాసికి చెందిన కథక్ నృత్యకారిణి. ఈమె నిర్విరామంగా 123 గంటల 30 నిమిషాలు నృత్యం చేసి రికార్డు సృష్టించారు.
34. విద్యా సంస్థల విభాగంలో జాతీయ మేథో సంపత్తి హక్కుల అవార్డు గెల్చుకున్న సంస్థ ఏది?
1) ఐఐటీ, మద్రాస్
2) ఐఐటీ, గౌహతి
3)ఐఐటీ, ఖరగ్పూర్
4) ఐఐటీ, కాన్పూర్
View Answer
సమాధానం: 3
35. భారత్లో నిర్వహించనున్న ప్రపంచంలోనే తొలి మల్టీనేషనల్ ‘ఫుట్సల్ లీగ్’కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.ఎస్.ధోని
2) సచిన్ టెండూల్కర్
3) బైచింగ్ భుటియా
4) విరాట్ కోహ్లి
View Answer
సమాధానం: 4
వివరణ: ఫుట్సల్ ఆట సాకర్ను పోలి ఉంటుంది. కాకపోతే దీన్ని ఇండోర్లో చిన్న పిచ్పై ఆడతారు. దీనిలో జట్టుకు ఐదుగురు చొప్పున క్రీడాకారులు ఉంటారు. ఈ లీగ్ను భారతలో జులై 15 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.
36. మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు?
1) లీ చాంగ్ వీ
2) ఎన్. శ్రీకాంత్
3) చెన్ హాంగ్
4) పి. కశ్యప్
View Answer
సమాధానం: 1
37. అంతరించిపోతున్న ‘స్పూన్-బిల్ల్లిడ్ సాండ్పైపర్’ పక్షిని ఎక్కడ కనుక్కొన్నారు?
1) పాకిస్థాన్
2) ఇండియా
3) నేపాల్
4) చైనా
View Answer
సమాధానం: 4
వివరణ: అంతరించిపోతున్న స్పూన్-బిల్లిడ్ సాండ్పైపర్ పక్షిని చైనాలోని హైనన్ వద్ద కనుగొన్నారు.
38. సీసీటీవీ కెమెరా నిఘాను తొలిసారిగా ఏ రైలులో భారతీయ రైల్వే ఏర్పాటుచేసింది?
1) వివేక్ ఎక్స్ప్రెస్
2) శతాబ్ది ఎక్స్ప్రెస్
3) కోరమండల్ ఎక్స్ప్రెస్
4) షాన్-ఇ-పంజాబ్ ఎక్స్ప్రెస్
View Answer
సమాధానం: 4
వివరణ: అమృత్సర్ నుంచి న్యూఢిల్లీ వరకు నడిచే షాన్-ఇ-పంజాబ్ ఎక్స్ప్రెస్లో మొదట గా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
39. లావా అంతర్జాతీయ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడిర్గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.ఎస్. ధోని
2) విరాట్ కోహ్లీ
3) సానియా మీర్జా
4) సైనా నె హ్వాల్
View Answer
సమాధానం: 1
40. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది?
1) విద్యాబాలన్
2) ఐశ్వర్యారాయ్
3) ప్రియాంకా చోప్రా
4) లతా మంగేష్కర్
View Answer
సమాధానం: 2
వివరణ: ముంబైలో జరిగిన ఎన్ఆర్ఐ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్యరాయ్కి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బహూకరించారు.
41. పులుల సంరక్షణార్థం 3వ ఆసియా మంత్రుల సదస్సు ఎక్కడ జరుగుతోంది?
1) హైదరాబాద్
2) నైనిటాల్
3) న్యూఢిల్లీ
4) అహ్మదాబాద్
View Answer
సమాధానం: 3
వివరణ: ఆసియా మంత్రుల సదస్సును నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రాజెక్టు టైగర్ పథకం కోసం భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 380 కోట్లు కేటాయించారు.
42. యువ విద్యార్థుల సమస్యల పరిస్కారానికి, వాటిపై అవగాహన కల్పించడానికి యూనిసెఫ్ ఏ విద్యా సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) ఐఐటీ-ఢిల్లీ
2) వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3) కేఎల్ఆర్ విశ్వవిద్యాలయం
4) గీతం
View Answer
సమాధానం: 4
43. భారత్ ఏ దేశంతో మిలటరీ లాజిస్టిక్స్ మార్పిడి ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా
2) ఇంగ్లాండ్
3) ఫ్రాన్స్
4) చైనా
View Answer
సమాధానం: 1
44. మూడో ఆసియా ‘ఖో- ఖో’ చాంపియన్షిప్న
ు గెల్చుకున్న దేశం ఏది?
1) బంగ్లాదేశ్
2) ఇండియా
3) శ్రీలంక
4) నేపాల్
View Answer
సమాధానం: 2
వివరణ: భారత మహిళల, పురుషుల జట్లు ఆసియా ఖో-ఖో చాంపియన్షిప్లను గెలుచుకున్నాయి.
45. ఒడిశాలోని చాందీపూర్లో పరీక్షించిన ఆకాశ్ క్షిపణి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు?
1) సముద్రం నుంచి భూమిపైకి
2) భూమి నుంచి భూమిపైకి
3) భూమి నుంచి గగన తలంలోకి
4) గగన తలం నుంచి గగన తలంలోకి
View Answer
సమాధానం: 3
46. ‘పూచో (PoochhO)’డ్రైవర్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) ఢిల్లీ
2) ఉత్తర ప్రదేశ్
3) హరియాణా
4) పంజాబ్
View Answer
సమాధానం: 1
వివరణ: ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న సరి - బేసి సంఖ్యా విధానం కారణంగా టాక్సీ, ఆటో సర్వీసులకు ఇబ్బందులు తలెత్త కుండా ప్రభుత్వం పూచో యాప్ను ప్రారంభించింది.
47. కేంద్ర, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తగా ఎవరు నియమితులయ్యారు?
1) రామ్ మాదవ్
2) శంకర్ జైసింగ్
3) రతన వట్టల్
4) అశోక్ ధావన్
View Answer
సమాధానం: 3
వివరణ: ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ వట్టల్ను జమ్మూకశ్మీర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తగా నియమించారు.
48. సరస్వతీ సమ్మాన్ పురష్కారం 2015 సంవత్సరానికి గాను ఎవరు అందుకున్నారు?
1) మృనాల్ పాండే
2) పద్మా సచ్దేవ్
3) యామిని కృష్ణమూర్తి
4) అంకిత్ చవాన్
View Answer
సమాధానం: 2
వివరణ: జమ్మూకశ్మీర్ రచయిత్రి పద్మా సచ్దేవ్ డోగ్రీ భాషలో రచించిన ‘చిట్-చేటే’కు సరస్వతి సమ్మాన్ పురస్కారం లభించింది.
49. కాలేజీ విద్యార్థుల కోసం గుర్తింపు కార్డుతో పాటు బ్యాంకింగ్ టెక్నాలజీ కలిగిన ‘క్యాంపస్ వాలట్’ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) భారతీయ స్టేట్ బ్యాంక్
2) ఎస్బీహెచ్
3) ఇండియన్ బ్యాంక్
4) ఫెడరల్ బ్యాంక్
View Answer
సమాధానం: 4
వివరణ: స్టార్టప్ కంపెనీ అయిన చిల్లర్ పేమెంట్ సొల్యూషన్స్తో కలసి ఫెడరల్ బ్యాంక్ ‘క్యాంపస్ వాలెట్’ను ప్రారంభించింది.
50. 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు?
1) హైదరాబాద్
2) నాగ్పూర్
3) పుణె
4) అహ్మదాబాద్
View Answer
సమాధానం: 1
Gk Bits - 1
May 23, 2016
Tags