మహారాణి అహల్యా బాయి హోల్కర్ (31 మే 1725 - 13 ఆగస్టు 1795), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.
అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు. పన్నెండు సంవత్సరాల తర్వాత, ఆమె మామ మల్హర్ రావు హోల్కర్ మరణించారు. ఒక సంవత్సరం గడిచాకా ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం ముందుకు నడిపారు. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించారు.
రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కారు. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున ద్వారక(గుజరాత్) నుంచి మొదలుకొని వారణాసి,ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారు. సోమనాథ్‌లో పాడుబడి, అపవిత్రమైవున్న సుప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు.
🎺జీవిత విశేషాలు🎺
అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరంఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగినది.ఈ సమయంలో ఇండోర్ పాలకుడిగా మరాఠా సర్దార్లలో ప్రముఖుడిగా మల్హర్ రావ్ వెలుగొందుతున్నాడు. 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు మృతిచెందాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.ఆయన అహల్యా బాయి కి యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్ మరియు 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు