ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జంతువులు, మొక్కలను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.
-భారతదేశంలో కొత్త రాతియుగం (6000-1000 నవీనయుగం)లో మానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. వ్యవసాయం, పశుపోషణ చేపట్టారు.
-సింధు నాగరికత కాలంలో బన్వాలిలో టెర్రకోటతో తయారుచేసిన నాగలిబొమ్మ, కాళిబంగన్‌లో నాగలితో దున్నిన చాళ్లు, లోథాల్‌లో వరి గింజలు, రంగాపూర్‌లో వరిపొట్టు వ్యవసాయం చేశారనడానికి నిదర్శనం.
-నదులకు వచ్చే వరదల వల్ల కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి ఉన్న భూముల్లో తృణధాన్యాలు, గోధుమలు, బార్లీ, బీన్స్ నూనె గింజలు, అవిసెలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి, ఆవాలు సింధు నాగరికత ప్రజలు ఆనాడు పండించిన ముఖ్య పంటలు.
-హరప్పా ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా వరి, పత్తి పంటలను పండించారు.
-ప్రపంచంలోని శ్రామికుల్లో 42 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అందువల్ల వ్యవసాయం ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5 శాతం మాత్రమే.
-వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది.
-వ్యవసాయదారుడు సాగు చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. రాష్ట్రంలో సగటు భూకమతం 1.11 హెక్టార్లు. జాతీయ స్థాయిలో సగటు భూకమతం 1.15 హెక్టార్లు.
-ఐక్యరాజ్య సమితి 2014ను అంతర్జాతీయ కుటుంబ సేద్య సంవత్సరంగా ప్రకటించినది.
-డిసెంబర్ 23 రైతు దినోత్సవం
వ్యవసాయరంగం వృద్ధి
May 31, 2016
Tags