-2014-15 జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 17.01 శాతం
-2013-14 వ్యవసాయం, అనుబంధ రంగాల జీడీపీలో వృద్ధి శాతం 3.7 శాతం
-మూలధన కల్పన (జీసీఎఫ్)లో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 2011-12లో 8.6 శాతం, 2013-14లో 7.9 శాతం నమోదైంది.
-వ్యవసాయం అనుబంధ రంగాల స్థూలదేశీయ ఆదాయం (జీడీపీ)లో స్థూల మూలధన కల్పనవాటా 2011-12లో 18.3 శాతం, 2013-14లో 14.8 శాతంగా ఉన్నది.
-దేశ ఎగుమతుల్లో పది శాతం వ్యవసాయ ఉత్పత్తులే
-ఆ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు 267.57 మిలియన్ల టన్నులు
-ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశ వాటా 7.68 శాతం
-2013-14లో వ్యవసాయ రంగంలో 54.6 శాతం మందికి ఉపాధి అవకాశం లభించింది.
-12వ ప్రణాళికలో (2012-17) వ్యవసాయ రంగవృద్ధి రేటు 4 శాతంగా నిర్ణయించారు.
-ప్రపంచంలో అత్యధిక పశుసంపద గల దేశం భారతదేశం
-2014-15లో ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ది ప్రథమస్థానం. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 18.5 శాతం. మన దేశంలో పాల ఉత్పత్తి 146.3 టన్నులు. ప్రస్తుతం తలసరి పాల లభ్యత 322 గ్రాములు.
-2014-15లో మనదేశంలో గుడ్ల ఉత్పత్తి 78.48 బిలియన్లు, పౌల్ట్రీ మాంసం ఉత్పత్తి 3.04 మిలియన్ టన్నులు
-స్థూల దేశీయోత్పత్తిలో మత్స్య సంపద వాటా 1 శాతం. వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూలదేశీయ ఉత్పత్తిలో మత్స్య సంపద వాటా 5.08 శాతం.
-1950-51లో సముద్ర చేపలు 5,34,000 టన్నులు, దేశీయ జలాల్లో 2,18,000 టన్నులు మొత్తం 7,52,000 టన్నుల చేపలు దొరికాయి.
-2012-13లో సముద్ర చేపలు 33,21,000 టన్నులు, దేశీయ జలాల్లో 57,20,000 టన్నులు మొత్తం 90,40,000 టన్నుల చేపలు దొరికాయి.
-1990-91లో 1205.86 కోట్ల మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం దిగుమతి చేసుకున్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 2.79 శాత్రం మాత్రమే
-1990-91లో 6012.76 కోట్లు మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 18.49 శాతం.
-2013-14 (P)లో 105149.00 కోట్లు మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం చేసుకొన్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 3.87 శాతం మాత్రమే.
-2013-14 (P)లో 2,68,469.05 కోట్ల మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం ఎగుమతి చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 14.17 శాతం.
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో వ్యవసాయ భూమి 1,06,75,100 హెక్టార్లు . మొత్తం భూమిలో శాతం 68.6 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న రెండో దేశం ఉక్రెయిన్. మొత్తం భూమిలో 55.3 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న మూడో దేశం భారతదేశం. ఇక్కడ వ్యవసాయ భూమి 15,83,20,000 హెక్టార్లు. మొత్తం భూమిలో వ్యవసాయ భూమి శాతం 48.15 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
వ్యవసాయ రంగం - ప్రాధాన్యం
May 31, 2016
Tags