Type Here to Get Search Results !

Vinays Info

అకాడమీ అవార్డులు-Academy Awards

Top Post Ad

award
సినీరంగంలో అత్యున్నత అవార్డులుగా పరిగణించే ఆస్కార్ అవార్డులను (90వసారి) ఇటీవలే ప్రకటించారు. నటులు, టెక్నీషియన్లకు అత్యుత్తమ గుర్తింపును ఇవ్వడానికి హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన ఐదు విభాగాలతో ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ సంస్థ 1927లో ఏర్పడింది. ఇది చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి 1929 నుంచి పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. మొదటిసారిగా అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్ హోటల్ రూజ్‌వెల్ట్‌లో 1929, మే 16న జరిగింది.

-1927, 28లో సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడానికి నటుడు డగ్లస్ ఫియరీ బ్యాంక్స్, విలియమ్ డెమిలి ఏర్పాటు చేశారు.
-ఆస్కార్ బహుమతుల ప్రదానోత్సవాన్ని 1930లో రేడియోల ద్వారా ప్రసారం చేయగా, 1953లో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేశారు.
-ఆస్కార్ ప్రతిమను వెండితో తయారుచేసి దానిపై 24 క్యారెట్ల బంగారు ప్లేటు అమరుస్తారు. ఒక్కో ప్రతిమకు 900 డాలర్లు ఖర్చవుతుంది.
-దీన్ని ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ సెడ్రిక్ గిబ్బన్ రూపొందించాడు.
-లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రముఖ శిల్పి జార్జి స్టాన్లీ కాంస్యంతో ఆస్కార్ ప్రతిమను తయారు చేశారు.
-ఈ ఏడాది 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 5న జరిగింది.

-తొమ్మిది సినిమాల హోరాహోరీ పోటీలో ది షేప్ ఆఫ్ వాటర్ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇది 13 విభాగాల్లో నామినేషన్ పొంది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ నిర్మాణ విలువల కేటగిరీల్లో 4 అవార్డులు అందుకుంది.
-డన్‌కిర్క్ సినిమాకు మూడు అవార్డులు, బ్లేడ్ రన్నర్ 2049, కోకో, డార్కెస్ట్ అవర్, త్రీ బిల్ బోర్డ్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమాలకు రెండు చొప్పున వచ్చాయి.
-మనిషిని పోలిన జలచరంతో ఒక మూగ యువతి ప్రేమ కథాంశంగా రొమాంటిక్ ఫాంటసీ ది షేప్ ఆఫ్ వాటర్ సినిమా రూపొందింది.
ఈ సినిమాకు ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకుడు సహా నాలుగు విభా గాల్లో అవార్డులు లభించాయి.
-రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన డార్కెస్ట్ అవర్ సినిమాలో కనబర్చిన నటనకుగాను గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు.
-ఉత్తమ నటిగా ఫ్రాన్సిస్ మెక్ డొర్మండ్ ఆస్కార్ అందుకున్నారు. 60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు సొంతం చేసుకున్నారు.
-తన కూతురిపై అత్యాచారం చేసి చంపిన దోషులను శిక్షించే విషయంలో పోలీసుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తల్లి తీసుకున్న ఓ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే స్ఫూర్తిదాయక కథాంశంతో రూపొందిన త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి చిత్రంలో ఆమె అసమాన నటనకు ఈ అవార్డు లభించింది.
-ట్రాన్స్‌జెండర్ ఇతివృత్తంతో రూపొందిన చిలీ దేశానికి చెందిన ది ఫెంటాస్టిక్ ఉమెన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది.

ఆస్కార్ ప్రత్యేకతలు


-ఆస్కార్ నామినేషన్లు పొందినవారందరూ పురస్కారం గెలవకున్నా ప్రత్యేక బహుమతులు (గిఫ్ట్ ప్యాకులు) అందుకుంటారు. ఒక్కోదాని ఖరీదు సుమారు లక్ష డాలర్లు ఉంటుంది.
-ఇప్పటి వరకు అత్యధికంగా 17 ఆస్కార్ నామినేషన్లు పొందిన సినిమాలు లా లా ల్యాండ్ (2016), టైటానిక్ కాగా, 16 నామినేషన్లు పొందిన చిత్రం ఆల్ ఎబౌట్ ఈవ్ (1950).
-11 విభాగాల్లో నామినేషన్ పొంది, అన్ని విభాగాల్లో అవార్డు అందుకున్న సినిమాలు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ (2014) కాగా, 9 విభాగాల్లో నామినేషన్ పొందిన చైనీస్ చిత్రం లాస్ట్ ఎంపరర్ కూడా అవార్డులు దక్కించుకున్నది.
-1982 నాటి కాబెరెట్ సినిమాకు 8 ఆస్కార్ అవార్డులు లభించినప్పటికీ ఉత్తమ చిత్రంగా నిలువలేకపోయింది.










ఆస్కార్-2018 గ్రహీతలు


-ఉత్తమ చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్
-ఉత్తమ దర్శకుడు: గెలెర్మో డెల్‌టోరో (ది షేప్ ఆఫ్ వాటర్)
-ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మ్యాన్ (డార్కెస్ట్ అవర్)
-ఉత్తమ నటి: ఫ్రాన్సిస్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
-ఉత్తమ సహాయ నటుడు: సామ్ రాక్‌వెల్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
-ఉత్తమ సహాయనటి: ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా)
-ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: కోకో
-ఉత్తమ సినిమాటోగ్రఫీ: రోజర్ ఏ డికిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
-ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)
-ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ఇకారస్
-ఉత్తమ విదేశీ చిత్రం: ఏ ఫెంటాస్టిక్ ఉమెన్ (చిలీ)
-ఉత్తమ మేకప్, కేశాలంకరణ: కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్)
-ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): అలెగ్జాండ్రే డెస్‌ప్లేట్ (ది షేప్ ఆఫ్ వాటర్)
-ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్): రిమెంబర్ మీ (కోకో)
-ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: డియర్ బాస్కెట్‌బాల్
-అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)
-ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: జోర్డన్ పీలే (గెట్‌అవుట్)
-ఉత్తమ సౌండ్ మిక్సింగ్: మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, ఎ రిజో (డన్‌కిర్క్)
-ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డన్‌కిర్క్)
-ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: లీ స్మిత్ (డన్‌కిర్క్)
-ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ ఫిలిం): హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
-ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జాన్ నీల్సన్, గెర్డ్ నెఫ్జెర్, పాల్ లాంబార్ట్, రిచర్డ్ ఆర్ హూహర్ (బ్లేడ్ రన్నర్ 2049)
-ప్రొడక్షన్ డిజైన్: పాల్ డెన్హమ్ ఆస్టెర్‌బెర్రీ askar

Below Post Ad