హ్యాన్‌కాంగ్‌కు మ్యాన్ బుకర్‌ప్రైజ్
-ది వెజిటేరియన్ నవల రచయిత హ్యాన్‌కాంగ్‌కు 2016కుగాను అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ లభించింది. దక్షిణ కొరియాకు చెందిన ఆమె మే 17న ఈ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కింద వచ్చిన 50 వేల పౌండ్ల నగదును నవలను కొరియా భాష నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించిన డెబోర్ స్మిత్‌తో కలిసి పంచుకున్నారు.
భారత్ అమెరికన్ సైంటిస్ట్‌కు మెడల్
-క్యాన్సర్‌పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న భారతీయ అమెరికన్ సైంటిస్ట్ రాకేశ్ జే జైన్‌కు నేషనల్ కాంగ్రెస్ మెడల్ లభించింది. ఆయన మసాచుసెట్స్‌లోని జనరల్ హాస్పిటల్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.
హంబినల్‌కు స్వామినాథన్ అవార్డు
-వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకు కేరళ రాష్ర్టానికి చెందిన హంబినల్‌కు 2016 స్వామినాథన్ అవార్డు లభించింది. 2016 మే 21న ప్రారంభించిన ఈ అవార్డును రెండేండ్లకోసారి వ్యవసాయ రంగంలో విశిష్ట కృషి చేసినవారికి అందిస్తారు.
దీపా వెంకట్‌కు పురస్కారం
-దీపా వెంకట్ ఐకానిక్ ఉమన్ ఆఫ్ ద డెకేడ్ పురస్కారాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నుంచి మే 21న అందుకున్నారు. యువత నైపుణ్యాభివృద్ధిలో చేసిన కృషికిగాను స్వర్ణ భారతి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ అయిన ఆమె ఈ అవార్డును అందుకున్నారు.