Type Here to Get Search Results !

Vinays Info

ఆస్కార్ అవార్డు

Top Post Ad

ఆస్కార్ అవార్డులు🏆
-ప్రపంచ చలనచిత్రరంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రతి కళాకారుడికి తన జీవితంలో ఆస్కార్ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలనే ఆత్రుత ఉండటం సహజం. హాలివుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన ఐదు విభాగాల్లో 1927లో ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఏర్పడింది. 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబర్చినవారికి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆస్కార్ గ్రహీతలకు ఇచ్చే ప్రతిమను ఎంజీఎమ్ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ సెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించాడు. ఆస్కార్ ప్రతిమ నమూనాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జి స్టాన్లీ చేతిలో కాంస్యంతో ఆస్కార్ ప్రతిమను తయారుచేశారు. ఆస్కార్ అవార్డులను తొలిసారిగా 1929 మే 16న ప్రదానం చేశారు.
ఆస్కార్ అవార్డుల ప్రత్యేకతలు🏆🏆🏆
-అత్యధికంగా బెన్‌హర్ (1959), టైటానిక్ (1999), లార్డ్ ఆఫ్ ది రింగ్ : ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (2004) చిత్రాలు పదకొండు అవార్డులు అందుకున్నాయి.
-అత్యధికంగా 14 ఆస్కార్ నామినేషన్‌లు పొందిన చిత్రాలు టైటానిక్ (1999) ఆల్ ఎబౌట్ ఈవ్ (1950)
-నామినేషన్ పొందిన అన్ని విభాగాల్లో పురస్కారాలు అందుకున్న చిత్రాలు లార్డ్ ఆఫ్ ది రింగ్ : ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (11 విభాగాల్లో నామినేషన్ పొందింది), చైనీస్ చిత్రం ది లాస్ట్ ఎంపరర్ (9 విభాగాల్లో పొందింది)
-అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న వ్యక్తి వాల్ట్ డిస్నీ (22 పురస్కారాలు) ఒకే ఏడాది (1954)లో అత్యధికంగా నాలుగు పురస్కారాలను అందుకున్నారు.
-అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న మహిళా క్యాస్ట్యూమ్ డిజైనర్ ఎడిత్ హెడ్ 8 ఆస్కార్ పురస్కారాలు అందుకున్నది. మొత్తం 35 ఆస్కార్ నామినేషన్లు పొందింది.
-అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న నటి కేథరిన్ హెర్ బర్న్ ఉత్తమ నటి విభాగంలో నాలుగు పురస్కారాలను అందుకున్నది.
-అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న నటులు జాక్ నికోల్సన్, వాల్టర్ బ్రెన్నన్, డేనియల్ డే లెవీస్ మూడుసార్లు ఆస్కార్ పురస్కారాలను అందుకున్నారు.
-అతి పెద్ద వయస్సుల్లో అవార్డు అందుకొన్న నటి జెస్సికా టాండి. 80 ఏళ్ల వయస్సులో డ్రైవింగ్ మిస్ డైసీ చిత్రానికిగాను పురస్కారం అందుకున్నది. పేపర్ మూన్ చిత్రంలో ఉత్తమ సహాయ నటి
-అతి చిన్న వయస్సులో అవార్డు అందుకున్న నటి టాటూమ్ ఓ నీల్. పదేళ్ల వయస్సులో పేపర్ మూన్ చిత్రంలో నటించి ఉత్తమ సహాయ నటి అవార్డును పొందినది.
-అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న దర్శకుడు జాన్‌ఫోర్డ్ (నాలుగు అవార్డులు)
-ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక దర్శకురాలు కత్రిన్ బిగేలో.
-ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అత్యధిక ఆస్కార్ అవార్డులను అందుకున్న దేశం ఇటలీ (14 పురస్కారాలు)
-మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 1929 మే 16న హాలివుడ్ హోటల్ రూజ్‌వెల్ట్‌లో జరిగింది. 1927, 1928 సంవత్సరాల్లో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సన్మానించుకోవడం కోసం నటుడు డగ్లాస్ ఫైయర్ బ్యాంక్స్, విలియం డెమిలి ఏర్పాటుచేశారు. ఆస్కార్ బహుమతుల ప్రదానోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని రేడియోల ద్వారా 1930లో, దూరదర్శన్‌ల ద్వారా 1953లో తొలిసారిగా ప్రసారం చేశారు.
2016 - ఆస్కార్ అవార్డులు🏆🏆🏆
-చలన చిత్ర రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కార్ అవార్డు. 88 ఆస్కార్ అవార్డులను 2016 ఫిబ్రవరి 28న కాలిఫొర్నియాలోని డాల్బి థియేటర్‌లో ప్రధానం జరిగినది. ఈ వేడుకల ప్రయోక్తగా నల్లజాతి నటుడు క్రిస్ రాక్ ఉన్నాడు. ఈ అవార్డుల ప్రజెంటేటర్స్‌గా బాలీవుడ్ భామ ప్రియాంకచోప్రా, స్లమ్ డాగ్ మిలియనీర్‌తో గుర్తింపు తెచ్చుకొన్న భారత సంతతి నటుడు దేవ్‌పటేల్ ఉన్నారు.
2016 - ఆస్కార్ అవార్డులు ప్రత్యేకతలు
-మతాధికారుల ముసుగులో చిన్న పిల్లలపై జరిపిన లైగింక అత్యాచారాల ఇతివృత్తమే ఉత్తమ చిత్రం స్పాట్‌లైట్
-ఎన్నో ఏళ్లుగా ఆస్కార్ కోసం ఎదురుచూస్తున్న లియోనార్డో డి కాప్రియో (ది రెవెనెంట్) ఉత్తమ అవార్డు అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.
-తొలి నామినేషన్‌తో ఉత్తమ నటి అవార్డును అందుకున్నది బ్రీ లారెన్స్ (రూమ్).
-భారత సంతతికి చెందిన బ్రిటిష్ దర్శకుడు ఆసిఫ్ కపాడియాకు ఎమి చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పురస్కారం అందుకున్నాడు.
-వరుసగా రెండోసారి ఆస్కార్ అవార్డును ది రెవెనెంట్ దర్శకుడు అలెజాండ్రో గోంజాలెజ్ ఇనరిటు అందుకున్నాడు. గతంలో బర్డ్‌మ్యాన్‌కు అందుకున్నాడు.
-జాన్‌మిల్లర్ దర్శకత్వం వహించిన మ్యాడ్‌మ్యాక్స్, ప్యూరిరోడ్ పది విభాగాల్లో నామినేషన్లు పొంది ఆరు విభాగాల్లో పురస్కారాల్లో పొంది ఆస్కార్ అవార్డుల్లో అగ్రభాగంలో ఉంది.

Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.