👉షోయబ్ ఉల్లాఖాన్ (అక్టోబరు 17, 1920 - ఆగష్టు 22, 1948) తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.
👉జననం
🔹షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జన్మించారు.
🔹తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం.
🔹వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది.
🔹షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు.
🔹బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు. తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు.
🔹గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు.
🔹ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు, విశాలభావాలు కలవాడు.
👉మరణం
🔹ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగష్టు 22 న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు.
👉వృత్తి జీవితం
🔹షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసo పూర్తిచేసుకున్నాకా జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు.
🔹షోయబుల్లా రచనా జీవితం తేజ్ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు.
🔹అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న రయ్యత్ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు.
🔹రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది.
🔹అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.
🔹రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు.
🔹ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు.
🔹ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం.
🔹ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు.
🔹ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి.
👉పాత్రికేయునిగా
🔹సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు.
🔹మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు.
🔹నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు.
🔹ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు.
🔹చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు.
🔹పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు.
🔹‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది.
🔹నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు.
🔹కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు.
🔹రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషను రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు.
🔹1948 ఆగస్టు 22 న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.
🔹నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది.
🔹గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.
👉డిమాండ్లు
షోయబుల్లాఖాన్ ను చంపేసిన చోట ఆయన విగ్రహం పెట్టాలనీ, కాచిగూడ చాపెల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలనీ జర్నలిస్టులు డిమాండు చేశారు. అయితే ఆయన పుట్టిన ఊరు ఏదో స్పష్టంగా తెలియడంలేదు.
🔹సుబ్రవేడు, సుబ్రదేవ్, మహబూబాబాద్ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు.ఇప్పటికైనా ఆయన జన్మస్థలాన్ని విలేకరులు కనుక్కోవాలి.మండలం, పంచాయతీ తో సహా ఆయన ఊరు స్పష్టంగా తెలుసుకొని ఆయనకు జన్మనిచ్చిన ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టాలి.