TET పరీక్ష రోజు పాటించవలసిన జాగ్రత్తలు - TET Exam Day Precautions, Tips | TS TET 2022
- పరీక్ష ముందు రోజు ఎటువంటి టెన్షన్ పడకుండా 10 గంటలకు ముందే పడుకుని ప్రశాంతంగా నిద్ర పోవాలి. అలా నిద్రపోకపోతే పరీక్ష టైం లో చదివినవి ఏవీ సరిగ్గా గుర్తు రావు, నాకు కూడా SA పరీక్ష వ్రాసినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, సరిగా జవాబులు గుర్తు రాక ఇబ్బంది పడ్డాను, అర మార్కు తగ్గి ఉంటే జాబ్ పోయేది.
- పరీక్ష ముందు రోజు ఎక్కువసేపు రివిజన్ చేయనవసరం లేదు, మీకు కష్టమైన సబ్జెక్ట్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసుకుంటే సరిపోతుంది.
- పరీక్షకు బయలుదేరే ముందు ఖచ్చితంగా ఇడ్లీ అల్పాహారం తీసుకోండి, పరీక్ష వ్రాయడానికి శక్తి కావాలి కదా.
- పరీక్షకు గంట టైం కు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది, ఎందుకంటే ఆలస్యంగా వెళ్ళడం వలన టెన్షన్ తో అన్ని మరచి పోయి ఏమీ గుర్తుకు రావు.
- హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి.
- మీకు భయం పోవాలంటే మీ ఇష్టదైవం మీద భారం వేసి పరీక్ష మొదలు పెట్టండి.
- మొదటి 10 ప్రశ్నలకు మీకు సమాధానం రాకపోయినా టెన్షన్ పడవద్దు, మీరు వరుసగా వ్రాయనవసరంలేదు.
- మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చో ఆ ప్రశ్నలకు జవాబులు గుర్తించండి, దీని వల్ల మీలో ఉత్సాహం వస్తుంది, మీ మెదడు బాగా పనిచేస్తుంది.
- మిగిలిన ప్రశ్నలకు జవాబులు సులభంగా గుర్తుకు వస్తాయి.
- మీరు ముందు సులభంగా ఉండే ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. కష్టమైన ప్రశ్నలను వదిలేసుకుంటూ పోవాలి.
- ముఖ్యంగా నేను చేసిన మరో పొరపాటు ఏమిటి అంటే నాకు maths అంటే ఇష్టం అని maths తో మొదలు పెట్టాను, అన్ని లెక్కలు నాకు వచ్చు జవాబు వస్తుంది అని తెలుసు కానీ ఒక్కో లెక్క చేయడానికి ఎక్కువ టైం పట్టింది దాని వలన మిగిలిన బిట్స్ పెట్టడానికి టైం సరిపోలేదు, అందువల్ల Maths చివరలో చేయడం మంచిది.
- అందువల్ల మొదట తక్కువ టైం తీసుకునే సులభమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి, తర్వాత బాగా తెలిసిన ఎక్కువ టైం తీసుకునే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి తర్వాత అసలు జవాబులు తెలియని ప్రశ్నలకు అన్నింటికి ఒకే ఆప్షన్ జవాబు పెట్టండి.
- కొంతమంది ప్రశ్న చదివిన వెంటనే first option మాత్రమే చదివి మిగిలిన 3 ఆప్షన్స్ చదవకుండా జవాబు గుర్తిస్తారు, ఒక్కోసారి మిగిలిన ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉంటాయి, పైవన్నీ జవాబు అవుతుంది, అందువల్ల ప్రతి ప్రశ్నకు 4 options చదివిన తరువాత మాత్రమే జవాబు గుర్తించండి.
- కొంతమంది కరెక్ట్ గా పాస్ మార్కులకు జవాబులు గుర్తించి, టైం లేక మిగిలిన ప్రశ్నలు వదిలేస్తారు, అయినా మేం క్వాలిఫై అవుతాం అని సంతోషపడుతారు. DSC లో జాబ్ సాధించాలంటే TET లో క్వాలిఫై మార్కులు కాదు కావాల్సింది. 150 కి 120 పైన ఇంకా ఎక్కువ మార్కులు సాధించాలి, అర మార్కు తగ్గి జాబ్ పోగొట్టుకున్న వారు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు.
- మీరు ముందు రోజు ప్రశాంతం గా నిద్ర పోయి, పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకుని, ప్రశాంతంగా ఒక్క బిట్ వదలకుండా అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే మీరు విజయం సాధించినట్లు.
- - Changam Srinivasulu