భూ ఉపరితలంపై ఒకే రకమైన శీతోష్ణస్థితి, వృక్ష, జంతు సంపదల గురించి తెలిపే ప్రాంతాలను ప్రపంచ సహజ సిద్ధ మండలాలుగా పేర్కొంటారు. ప్రపంచాన్ని ప్రధానంగా 13 సహజ సిద్ధ మండలాలుగా విభజించారు.ఒక ప్రాంత ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు ఆ ప్రదేశ సహజ వృక్ష సంపద విస్తరణ గురించి తెలుపుతాయి. భూ ఉపరితలంపై ప్రధానంగా మూడు రకాల ఉష్ణోగ్రత మండలాలున్నాయి. అవి.. అత్యుష్ణ మండలం, సమశీతోష్ణ మండలం, అతిశీతల మండలం.
సహజ సిద్ధ మండలాల్లో ముఖ్యమైనవి..
2) అయన రేఖా (ఉష్ణ మండల ఎడారులు)
3) ఉష్ణ మండల పచ్చిక బయళ్లు (సవన్నాలు)
4) సమశీతోష్ణ గడ్డిభూములు (స్టెప్పీలు)
6) మధ్యదరా ప్రకృతి సిద్ధ మండలం
7) టైగా మండలం