మధ్యదరా ప్రకృతి సిద్ధమండలం - Mediterranean Region
ఖండాల పశ్చిమ భాగంలో 30°-40° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఈ మండలం విస్తరించి ఉంది. ఈ మండలాన్ని ‘శుష్క వేసవి ఉప అయన రేఖా ప్రాంతం’గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో 4% ఈ మండలంలో నివసిస్తున్నారు. ఈ మండలంలో వేసవి కాలంలో వీచే శీతల పవనాలను బోరా (యుగోస్లేవియా), మిస్ట్రల్ (ఫ్రాన్‌స) అంటారు. ఈ మండలంలోని కాలిఫోర్నియా నారింజ పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. చిలీ దేశంలోని విశాలమైన వ్యవసాయ క్షేత్రాలను ‘హోసియోండాలు’ అంటారు. ఈ మండలంలో లభించే ప్రధాన చేపలు సార్టెన్, ట్యూనా.
ఈ మండలంలో..
పాదరసం, కరారా పాలరాయికి ప్రసిద్ధి చెందిన దేశం- ఇటలీ.
ఆస్ట్రేలియాలో యశదం, సీసం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ‘బ్రోకెన్ హిల్స్’.
కాలిఫోర్నియాలోని పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం సిగ్నల్ హిల్స్.
సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఫ్రాన్స్ లోని ‘గ్రాసే’.
కాలిఫోర్నియా (యూఎస్‌ఏ)లోని ‘మాంటరె’ ప్రపంచ సార్డెన్ చేపల రాజధానిగా గుర్తింపు పొందింది.
ఆలీవ్ ఉత్పత్తిలో మొదటి స్థానం స్పెయిన్.
కాసినోలకు ప్రసిద్ధిచెందిన దేశం మొనాకో.