Type Here to Get Search Results !

Vinays Info

రుతుపవన మండలం - Monsoon Region

రుతుపవన మండలం - Monsoon Region

ఖండాల తూర్పు తీరంలో 10°- 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవన మండలం విస్తరించి ఉంది. ఈ మండలంలో దక్షిణ, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూ గినియాలోని దక్షిణ ప్రాంతాలున్నాయి. ‘మౌసమ్’ అంటే ‘రుతువు’ అని అర్థం. అరబిక్ పదమైన ‘మౌసమ్’ నుంచి ‘మాన్‌సూన్’ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది.

ఈ మండలంలో పెరిగే వృక్షాలకు వెడల్పాటి ఆకులు ఉంటాయి. వీటిని ఆకురాల్చే అడవులు అంటారు. ఇక్కడ పెరిగే మడ అడవులను ‘సుందర అరణ్యాలు’ అంటారు. ప్రపంచ జనాభాలో 25 శాతం ఈ మండలంలో నివసిస్తున్నారు.

ఈ మండలంలో అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు - మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్‌రాం, చిరపుంజీ. ఇవి ప్రపంచంలో అధిక వర్షపాతం పొందే ప్రాంతాల్లో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచంలో టేకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు మయన్మార్, థాయిలాండ్; ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం బంగ్లాదేశ్ ఈ మండలంలోనే ఉన్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section