స్టెప్పీ మండలం - Mid-Latitude Deserts (Steppe Lands)
30° నుంచి 55° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య స్టెప్పీ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఇవి యురేసియా (ఆసియా+యూరప్)లోని వాయవ్య చైనా, టర్కీ, స్పెయిన్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 100° రేఖాంశం నుంచి ఇంటర్ మౌంటేన్ వరకు ఉన్న గడ్డి భూములను ‘ప్రయరీలు’, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఉన్న గడ్డి భూములను ‘పంపాలు’, దక్షిణ ఆఫ్రికాలోని డ్రాకెన్‌సబర్గ్వద్ద ఉన్న గడ్డి భూములను ‘వెల్డులు’, ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూములను ‘డౌన్లు’ అంటారు. ఈ మండలాన్ని అర్ధ శుష్క ప్రాంతంగా పేర్కొంటారు. ఈ మండలంలో అమెరికా దేశంలో ‘ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో’ ఉంది. ఆస్ట్రేలియాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘రాంచీలు’, అర్జెంటీనాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘ఎస్టాన్షియన్లు’ అంటారు. హంగేరిలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘పుస్తాజ్’ అంటారు. ఈ మండలంలో ప్రధాన పంట - గోధుమ.
ఈ మండలంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రాల గని కింబర్లీన్ (దక్షిణ ఆఫ్రికా).
అమెరికాలో అంగోరా జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది.