సవన్నా మండల - Tropical Grassland (Savanna) Region
ఇది 10° – 20°C ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఈ మండలంలో 1 మీ. నుంచి 6 మీ. వరకు పెరిగే ఏనుగు గడ్డి ఉంటుంది. దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతం (ఒరినాకో నది పరీవాహక ప్రాంతం)లోని గడ్డి భూములను ‘లానోలు’, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, బొలీవియా దేశాల్లోని గడ్డి భూములను ‘కంపాలు’ అంటారు. ఆఫ్రికాలోని సవన్నాలను ‘పార్‌కలాండ్’ అంటారు. అనాస పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే హవాయి ఈ మండలంలోనే ఉంది. వెనెజులా - పెట్రోలియానికి, నైజీరియా - తగరం, క్యూబా - పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి. కెన్యాలో కికియూ తెగవారు నివసిస్తారు.
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే (1234.4 సెం.మీ.) ‘వయోలిలి’ శిఖరం ఈ మండలంలోనే ఉంది.
ఈ మండలంలో ప్రఖ్యాత జలపాతం ‘విక్టోరియా’. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది.