అయన రేఖా(ఉష్ణ మండల) ఎడారులు(Tropical Deserts)
ఉష్ణ మండల ఎడారులు ఖండాల పశ్చిమ తీరంలో 15° నుంచి 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
ఎడారులు లేని ఖండాలు - అంటార్కిటికా, ఐరోపా.
ఎడారులు - విస్తరించి ఉన్న ప్రాంతాలు:
1. సహారా ఎడారి - ఆఫ్రికా. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ మండల ఎడారి.
2. అరేబియా ఎడారి - ఇది అరేబియా ద్వీపకల్పంలో (ఆసియా ఖండం) ఉంది.
3. థార్ ఎడారి - ఇది భారత్, పాకిస్థాన్‌లో (ఆసియా ఖండం) విస్తరించి ఉంది.
4. ఆస్ట్రేలియా ఎడారి - ఆస్ట్రేలియా. ఇది దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద ఎడారి.
5. కలహారి ఎడారి - ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉంది.
6. అటకామా ఎడారి - ఆండీస్ పర్వతాలు, చిలీ, పెరూ దేశాలు (దక్షిణ అమెరికా).
7. సోనారన్ ఎడారి - ఉత్తర అమెరికా.
సహారాలో టౌరెన్లు, కలహారిలో బుష్‌మెన్లు, అరేబియాలో బిడోనియన్లు, ఆస్ట్రేలియాలో బిండిబాలు లాంటి జాతులు ఉంటాయి. చిలీ నైట్రేట్లకు, కాలిఫోర్నియాలోని శాండియాగో విమాన తయారీ పరిశ్రమకు, ఆస్ట్రేలియాలోని కాల్‌గూర్లి, కూల్‌గార్డి బంగారం గనులకు ప్రసిద్ధి.
ఈ మండలంలో పెద్ద నగరం కైరో.
ఇస్లాం మతస్థుల పవిత్ర పుణ్యక్షేత్రం ‘మక్కా’ ఈ మండలంలోనే ఉంది.
ప్రపంచంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం అబుదాన్ (ఇరాన్)లో ఉంది.
ఎడారి వృక్ష సంపదను ‘గ్జీరోఫైట్స్’ అంటారు.
భూ ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత 58°C సహారా ఎడారిలోని లిబియా దేశంలో ‘అజీజియా’ వద్ద 1922 సెప్టెంబర్ 13న నమోదైంది.
ఎడారుల్లో సగటు వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువ.
ఎడారుల్లో ప్రవహించే నదులను ‘ఎగ్జోటిక్ నదులు’ అంటారు.
ఉదా:
1) నైలు నది (ఆఫ్రికా)
2) సింధూనది (ఆసియా)
3) కొలరాడో నది (ఉత్తర అమెరికా)
4) ఆరెంజ్ నది (దక్షిణ ఆఫ్రికా)
5) డార్లింగ్ నది (ఆస్ట్రేలియా)