భూమధ్య రేఖా మండలం - Earth's equator Region
ఈ మండలం భూమధ్య రేఖకు ఇరువైపులా 10° ఉత్తర, దక్షిణ అక్షాంశాల వరకు విస్తరించి ఉంది. పవనాభిముఖ ప్రాంతంలో 10° నుంచి 20° ఉత్తర, దక్షిణ అక్షాంశాల వరకు విస్తరించి ఉంది. ఈ మండలంలో దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది ప్రాంతాలు, ఆఫ్రికాలోని కాంగో నది ప్రాంతాలు, ఆగ్నేయాసియా దేశాలు, వెస్టిండీస్ దీవులు ఉన్నాయి. ఈ మండలాన్ని ‘డోల్‌డ్రమ్స్’, ‘ప్రశాంత మండలం’, ‘ఉష్ణ మండల (సంవహన) వర్షపాత ప్రాంతం’గా పేర్కొంటారు. ఈ మండలంలో అత్యల్ప జనసాంద్రత ఉంది.
భూమధ్య రేఖా మండలం సగటు ఉష్ణోగ్రత 26°C (21°C నుంచి 31°C).
- ఈ మండలంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం - ఆఫ్రికాలోని కామెరూన్ పర్వత శిఖరమైన ‘డెబుంచ’.
- ఈ మండలంలో ప్రపంచంలోకెల్లా దట్టమైన అడవులను ‘సెల్వాలు’ అంటారు. తీగ జాతికి చెందిన చెట్లు అల్లుకొని విశాల పత్రాలతో విస్తరించి ఉంటాయి. వీటిని ‘లయనాలు’ అంటారు.
- వెస్టిండీస్ దీవుల్లో పెరిగే జాపోట్ వృక్షాల నుంచి చూయిమ్‌గమ్‌ను తయారు చేసే ‘చికిల్’ పదార్థం లభిస్తుంది.
- ఈ మండలంలో ప్రధాన విష సర్పం పింజర. లయనాలపై కనిపించే సర్పాలు అనకొండలు.
- ఈ మండలంలో పెద్ద నగరం సింగపూర్.
- భూమధ్య రేఖా మండలంలో ప్రధాన రవాణా సౌకర్యాలు నదులు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినవారు దయాక్‌లు(బోర్నియా).
- ఈ మండలంలో పోడు (విస్తాపన) వ్యవసాయం అమల్లో ఉంది. అసోంలో దీన్ని ‘జూమ్’ అంటారు.
- బ్రెజిల్‌లోని విస్తారమైన కాఫీ క్షేత్రాలను ‘ఫాజెండాలు’ అంటారు. కోకోకు - ఘనా, వరికి - జావా, గంధకానికి - మెక్సికో, తగరానికి - మలేషియా, పెట్రోలియానికి - బ్రూనై ప్రసిద్ధి.