టైగా మండలం - Tyga Region
ఇది ఉత్తరార్ధ గోళంలో 55° - 70° ఉత్తర అక్షాంశాల మధ్య వ్యాపించి ఉంది. దీన్ని ఉప ఆర్కిటిక్ ప్రాంతం అంటారు. టైగా అనేది రష్యన్ భాషా పదం. ‘టైగా’ అంటే ‘శృంగాకార అడవులు’ అని అర్థం. ఈ మండలం ప్రపంచంలో అత్యధిక వార్షిక శీతోష్ణ వ్యత్యాసాలను కలిగి ఉంటుంది. 1982లో వెర్కోయాన్క్స్ వద్ద ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రత ‘-68°’గా నమోదైంది. సంవత్సరంలో 210 రోజులపాటు ఘనీభవించే నది ‘లీనా’ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలం ఫర్న్ ఉత్పత్తికి ప్రధానకేంద్రం. ప్రపంచంలో అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం కెనడాలోని ఆర్పిడా. కొయ్యగుజ్జు తయారీలో ప్రథమస్థానంలో ఉన్న దేశం కెనడా. టైగా ప్రాంతంలో చక్రవాత వర్షపాతం అధికం.
ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న నగరం ముర్మాన్‌స్క్. టైగా మండలంలో కెల్లా పెద్ద నగరం ఆర్ఖేంజెల్. సైబీరియాలో ప్రధాన నగరం ఇర్‌కుట్‌స్క్. ఈ మండలంలో ఉత్తర అమెరికా ఖండంలోకెల్లా పెద్ద నగరం ఫెయిర్ బాంక్స్ (అలస్కా) ఉంది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంను ‘బాల్టిక్ సముద్రపు రాణి’గా పిలుస్తారు.
- ప్రపంచంలోనే లోతైన మంచినీటి సరస్సు బైకాల్ (రష్యా) ఈ మండలంలో ఉంది.