❀ టండ్రా మండలం - Tundra Region/Biome
టండ్రా అంటే నిస్సారమైన భూములు లేదా ఎడారి అని అర్థం. టండ్రాలో వేసవి సగటు ఉష్ణోగ్రత 12°. వృక్షాలు లేని ఏకైక ఖండం అంటార్కిటికా. ఈ మండలంలో పక్షుల గుంపులను రోకరీలు అంటారు. ఈ మండలంలో జీవించే ప్రధాన పక్షులు టార్మిగాన్, ధ్రువపు గుడ్లగూబ. ఈ మండలంలో యురేసియాలో ‘లాపులు’ నివసిస్తారు. ఉత్తర అమెరికాలోని టండ్రా ప్రాంతంలో నివసించేవారు ‘ఎస్కిమోలు’. వీరు ఉపయోగించే పడవలను ‘డయాక్’ అంటారు. గడ్డకట్టిన మంచుపై ఉపయోగించే వాహనాలను స్లెడ్జి బండ్లు అంటారు. ధ్రువ ప్రాంత ప్రజల ఆయుధం హార్పూన్. మంచుగడ్డలతో అర్ధ చంద్రాకారంలో ఉన్న ఇళ్లను ‘ఇగ్లూలు’ అంటారు. ఉత్తరార్ధ గోళంలో కనిపించే కాంతులను ‘అరోరా బొరియాలిసిస్’ అంటారు.
ధ్రువ ప్రాంతాల్లో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించడు. ధ్రువప్రాంత ప్రజల భాషలు 1) అల్యూయిట్, 2) యూపిక్, 3) ఇన్యూవిక్.
ప్రాంతం | ప్రధాన తెగలు |
1. అమెజాన్ | రెడ్ ఇండియన్స్ |
2. కాంగో | పిగ్మీలు (చెట్లపై ఇళ్లు నిర్మించుకుంటారు) |
3. మలేషియా | సెమాంగ్లు, సకామీలు |
4. బోర్నియా | హెడ్ హంటర్స్, దయాక్‌లు |
5. సుమిత్ర | కాబులు |
6. శ్రీలంక | వెడ్డాలు |
Video About Tundra Region