Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ పత్రికలు - News Papers Telangana

 తెలంగాణ పత్రికలు - News Papers Telangana 

జాబ్ధుత్-ఉల్-అక్బర్ 

  1. ఇది 1833లో హైదరాబాద్ లో వెలువడిన ఉర్దూ పత్రిక 

రిసాల తబ్బి 

  1. ఇది 1859లో హైదరాబాదులో విడివడిన ఉర్దూ పత్రిక, 
  2. దీనిని తెలంగాణలో తొలి వైద్య పత్రిక గా పేర్కొనవచ్చు 

అక్టరెషఫక్ 

  1. ఇది 1878లో హైదరాబాద్ లో వెలువడిన పార్టీ బాషా పత్రిక 

సేద్య చంద్రిక 

ఇది 1886 లో వెలువడిన తెలుగు పత్రిక. 

దీనిని మున్షి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ మాలిక్ అనే వారు స్తాపించారు 

దీనిని పూనూన్ అనే ఉర్దూ పత్రికలు అనువాద పత్రిక ఇది నిజాం రాష్ట్రం / తెలంగాణలో వెలువడిన తొలి తెలుగు పత్రిక. 

ఈ పత్రికలో హైదరాబాద్ రాజ్యంలో వ్యవసాయ వంగడాలు, విత్తనాలకు సంబంధించిన సమాచారంను అందించేవారు 


దక్కన్ టైమ్స్

దీనిని అబ్దుల్ ఖదీర్ స్థాపించారు (1864) 

ఇది ఆంగ్ల భాషా పత్రిక. ఇది 1885 వరకు ఆంగ్లేయుల సహకారంతో నడిచింది. 

1885లో నిజాం స్వాధీనం చేసుకొని దీనిని మూసి వేయడం జరిగింది.

ఇది తెలంగాణలో నడిచిన తొలి ఆంగ్ల పత్రిక 


హైదరాబాద్ బులిటెన్ 

దీనిని కామెరూన్ స్థాపించారు (1904) 

ఇది ఆంగ్ల భాషా పత్రిక 


హితబోధిని 

ఇది  తెలుగు పత్రిక. దీనికి సంపాదకులుగా శ్రీనివాసవర్మ పని చేశారు 

ఇది 1912 వ సంవత్సరం నుండి మహబూబ్ నగర్ జిల్లా నుండి వెలువడుతుంది 

ఇది తొలి తెలుగు మాసపత్రిక

ఇందులో వ్యవసాయం, వైద్యం, పారిశ్రామికం, సంఘసంస్కరణలు అనే అంశాలపై వార్తలు, రచనలు, వ్యాసాలు ఉండేవి 


ది పంచమ 

ఇది ఆంగ్ల పత్రిక. దీనిని జె ఎస్ ముత్తయ్య స్థాపించారు 

ఇది 1918 సంవత్సరంలో హైదరాబాదు నుండి వెలువడింది 

ఈ పత్రిక దళిత చైతన్యం కోసం కృషి చేసింది 


తెనుగు పత్రిక 

దీనిని వద్దిరాజు సోదరులైన సీతారామచంద్రరావు మరియు రాఘవరావు స్థాపించారు 

ఇది 1922 ఆగస్టు 27న మానుకోట దగ్గర గల ఇనుగుర్తి నుండి వెలువడింది 


నీలగిరి 

దీనికి సంపాదకులుగా షబ్నవీస్ వెంకట నరసింహారావు పని చేశారు. 

దీనిని 1924 ఆగస్టు 24న తొలి సంచికను వెలువరించారు 


అహకంసుబే వరంగల్ 

దీనిని 1925వ సంవత్సరంలో వరంగల్ కు చెందిన రెవెన్యూ అధికారుల ప్రారంభించారు 

ఇది తెలంగాణ నుండి వెలువడిన తొలి పక్షపత్రికగా పేర్కొనవచ్చును 


ముషీర్ దక్కన్

ఇది ముస్లిమేతరుడు నడిపిన ఉర్దూ భాషా పత్రిక 


దేశబంధు 

ఇది 1926 నుండి మేడ్చల్ మాఖ్తావడ్డేపల్లి నుండి వెలువడింది. 

దీనికి సంపాదకులుగా బెలంగకొండ రామానుజాచార్యులు పనిచేశారు 


గోల్కొండ పత్రిక 

ఇది 1926 మే 10న హైదరాబాదులో ప్రారంభించబడిన తొలి తెలుగు పత్రిక 

దీనికి సంపాదకులుగా సురవరం ప్రతాపరెడ్డి పని చేశారు 

1966లో దీని ప్రచురణ ఆగిపోయింది ఈ పత్రిక తెలంగాణ రాజకీయ, సాంఘీక, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు అండగా నిలిచింది 


భాగ్యనగర్ పత్రిక 

ఇది 1931 సంవత్సరం నుండి హైదరాబాదులో ప్రారంభించబడింది. 

దీనికి సంపాదకులుగా భాగ్యరెడ్డివర్మ పని చేశారు. 

ఇది పక్ష పత్రిక పత్రిక. ముఖచిత్రంపై చార్మినార్, మక్కామసీదు తో పాటు అజంతా-ఎల్లోరా చిత్రాలు ఉండేవి 

ఈ పత్రిక దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడింది. 

హరిజన అనే పదానికి బదులుగా అది హిందువులు అనే పదాన్ని ఉపయోగించేవారు 

ఈ పత్రిక పేరును 1937 డిసెంబర్ నుండి ఆదిహిందూగా మార్చారు 


రయ్యత్

ఇది 1927లో హైదరాబాద్ నుండి వెలువడిన ఉర్దూ భాషా పత్రిక. 

దీనికి సంపాదకులుగా మందుముల నరసింగరావు పని చేశారు 

ఈ పత్రికను 1929లో నిజాం నిషేధించారు. తిరిగి 1932 లో ప్రారంభమైంది 

ఈ పత్రిక ఉత్తర భారతీయులకు హైదరాబాద్ రాజ్య విషయాలను తెలపడం కోసం పని చేసింది 


సుజాత 

ఇది 1927లో హైదరాబాదు నుండి వెలువడిన తొలి భాషా పత్రిక 

దీనికి సంపాదకులుగా పి యస్ శర్మ పనిచేశారు 


పూల తోట 

1930-35 సంవత్సరాల మధ్యకాలంలో హనుమకొండలోని నయ్యుమ్ నగర్ నుండి వెలువడింది 

దీనికి సంపాదకులుగా కంభంపాటి అప్పన్న శాస్త్రి పని చేశారు 

ఇది తెలంగాణ నుండి వెలువడిన తొలి బాలల పత్రిక 


వైద్య కళా 

ఇది 1931 లో హైదరాబాద్ నుండి వెలువడిన తెలుగు భాషా పత్రిక 

దీనిని హైదరాబాద్ వైద్య సంఘం ప్రచురించేది 

దీనిని ఎం అనంతరంగాచార్యులు స్థాపించారు 


దక్కన్ కేసరి 

ఇది 1934 జనవరి, సికింద్రాబాద్ నుండి వెలువడిన తెలుగు మరియు ఆంగ్ల భాషా పత్రిక 

దీనిని  అడుసుమల్లి   వెంకటదత్తాత్రేయశర్మ స్థాపించారు 


మాతృ భారతి

ఇది 1930 దశకంలో హైదరాబాదు నుండి వెలువడిన తెలుగు పత్రిక.  

దీనికి సంపాదకులుగా మాడపాటి హనుమంతరావు పని చేశారు. 

దీనిని తొలి విద్యార్థి మాసపత్రికగా పేర్కొనవచ్చు 


దివ్యవాణి 

1937లో సికింద్రాబాద్ ప్రాంతం నుండి వెలువడిన తెలుగు పత్రిక. 

దీనికి సంపాదకులుగా చివుకుల అప్పయ్యశాస్త్రి పనిచేశారు 


తెలుగు తల్లి 

ఇది 1939 లో హైదరాబాదు నుండి వెలువడిన తెలుగు పత్రిక 

దీనికి సంపాదకులుగా రాచమళ్ల సత్యవతీదేవి పనిచేశారు 

ఇది స్త్రీ సంపాదకత్వం వహించిన తొలి (మాస) పత్రిక 


దక్కన్ క్రానికల్ 

ఇది 1937లో హైదరాబాదు నుండి వెలువడిన ఆంగ్ల భాషా పత్రిక. 

దీనిని కె రాజగోపాల్, బి ఆర్ చారి, ఎం యస్ జయసూర్య లు ప్రారంభించారు 

ఇది మొదట వారపత్రికగా మొదలై దిన పత్రికగా వెలువడింది 


ఇమ్రోజ్ 

ఇది 1947 నవంబర్ 15న హైదరాబాదులో ప్రారంభించబడిన ఉర్దూ భాషా పత్రిక 

దీనికి సంపాదకులుగా షోయబుల్లాఖాన్ పని చేశారు 


మీ జాన్

1944లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించబడింది 

ఇది తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలలో వెలువడింది 

దీనిని స్థాపించింది గులాం అల్లావుద్దీన్ 

ఇది దేశంలో మూడు భాషల్లో వెలువడిన ఏకైక పత్రిక 

తెలుగు ఎడిషన్ కు సంపాదకత్వం వహించింది అడవి బాపిరాజు 


శోభ 

ఇది 1947 లో వరంగల్ కేంద్రంగా ప్రారంభించబడిన తెలుగు పత్రిక 

దీనిని స్థాపించినది దేవులపల్లి రామానుజరావు 


సారస్వతజ్యోతి 

ఇది 1954లో కరీంనగర్ కేంద్రంగా ప్రారంభించబడిన తెలుగు పత్రిక 

దీనిని స్థాపించినది బోయినపల్లి వెంకట రామారావు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section