Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు

తెలంగాణ సాంస్కృతిక వేదిక 

  • 1998 నవంబర్ 1న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో స్థాపించబడింది ఇందులో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రచయితల వేదిక 
  • దీనిని 2001 అక్టోబర్ 14న సిద్ధిపేట లో స్థాపించారు
  • దీనికి మొదటి అధ్యక్షుడిగా నందిని సిద్ధారెడ్డి, కార్యదర్శిగా వేణు సంకోజు నియమితులయ్యారు
  • ఇది తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని పునరుద్ధరించడం కోసం 'సోయి' అనే పత్రికను స్థాపించింది
ధూమ్ దాం
  • మలిదశ ఉద్యమంలో తెలంగాణ అన్యాయాలను ప్రజలకు తెలియచెప్పడానికి ఏర్పాటుచేసిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూమ్ ధామ్
  • దీని యొక్క తొలి ప్రదర్శన సెప్టెంబరు 30, 2002 కామారెడ్డి లో జరిగింది
  • రసమయి బాలకిషన్, అంద శ్రీ, వరంగల్ శంకర్, గోరటి వెంకన్న, విమలక్క, గూడా అంజయ్య తమ ఆట పాటలతో అలరించారు
  • ధూమ్ దాం దశాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 22, 2012న హైదరాబాదులో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగాయి
తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య  
  • దీనిని గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, వి ఎస్ రావు తదితరులు 2007 లో స్థాపించారు
  • దీనికి అధ్యక్షులుగా గూడ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా గద్దర్, సలహాదారులుగా బి.ఎస్.రాములు, పాశం యాదగిరి నియమించబడ్డారు
తెలంగాణ సింగిడి రచయితల సంఘం 
  • సింగిడి అనగా హరివిల్లు, ఇంద్రధనస్సు అని అర్థం
  • ఇది సెప్టెంబర్ 21, 2008న స్థాపించబడింది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section