- ఉత్పాదికాలను బట్టి పరిశ్రమలు మూడు రకాలు
1) ప్రాథమిక రంగ పరిశ్రమలుఉదా: వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, మత్స్యపరిశ్రమలు
2) ద్వితీయ రంగ పరిశ్రమలు
ఉదా: ఇనుము-ఉక్కు పరిశ్రమలు
3) తృతీయ రంగ పరిశ్రమలు (సేవారంగం)
ఉదా: రవాణా సౌకర్యాలు, బ్యాంకింగ్, తంతితపాలా, బీమా మొదలైనవి.
- యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమలు మూడు రకాలు
1) ప్రభుత్వ రంగం2) ప్రైవేట్ రంగం
3) ఉమ్మడి రంగం
- దేశంలో పెట్టుబడిరీత్యా పరిశ్రమలు మూడు రకాలు
1) భారీతరహా పరిశ్రమలు2) మధ్యతరహా పరిశ్రమలు
3) చిన్నతరహా పరిశ్రమలు- భారీ పరిశ్రమలవల్ల రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న జనాభా- 6,67,499
- మధ్యతరహా పరిశ్రమలవల్ల రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న జనాభా- 5,65,000
- తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ముందంజలో ఉంది.
- తెలంగాణ రాష్ట్రం అనేక తయారీ రంగ పరిశ్రమలు అయిన వ్యవసాయాధారిత, ఖనిజాధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలనుప్రోత్సహిస్తుంది.
- తెలంగాణ పారిశ్రామిక రంగం రాష్ట్ర జీవీఏలో సుమారు 24 శాతం వాటాను కలిగి ఉండటంతో పాటు, రాష్ట్రంలోని మొత్తం శ్రామిక శక్తిలో 17.8 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
- రాష్ట్రంలో అత్యధిక పారిశ్రామిక యూనిట్లుగల జిల్లా-
1) మేడ్చల్ మల్కాజిగిరి (5,311 యూనిట్లు),2) రంగారెడ్డి (4,387 యూనిట్లు)
- రాష్ట్రంలో అత్యల్ప పారిశ్రామిక యూనిట్లుగల జిల్లా
1) జయశంకర్ భూపాలపల్లి (43 యూనిట్లు),2) జోగుళాంబ గద్వాల (47 యూనిట్లు)
- ముడిపదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలు మూడు రకాలు అవి..
1) వ్యవసాయాధారిత పరిశ్రమలుఉదా: నూలు, వస్త్ర, చక్కెర, పొగాకు, పట్టు పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
ఉదా: కాగితం, ైప్లెవుడ్, తోళ్ల పరిశ్రమలు
3) ఖనిజ ఆధారిత పరిశ్రమలు
ఉదా: ఇనుము-ఉక్కు, సిమెంట్, రసాయన, ఎరువులు, ఇంజినీరింగ్ పరిశ్రమలు- ఇవేకాకుండా ఔషధ, కుటీర, ఐటీ పరిశ్రమలు వ్యవసాయాధారిత పరిశ్రమలు
- వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయాధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా: నూలు, వస్త్ర, పట్టు, చక్కెర, పొగాకు పరిశ్రమలు
- నూలు పరిశ్రమ: ముడి సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఉన్న ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ
- దేశంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద, ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ- వస్త్ర పరిశ్రమ
- పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా- 14 శాతం
- 1854లో సీఎన్ థేవార్ అనే పార్శీ పెట్టుబడిదారుని సహాయంతో బొంబాయిలో మొదటి నూలు పరిశ్రమ ప్రారంభమైంది.
- తెలంగాణలో మొదటి నూలు పరిశ్రమను 1934లో వరంగల్‌లో ఆజంజాహీ పేరుతో ప్రారంభించారు. 1990లో దీన్ని మూసివేశారు.
- తెలంగాణలో అధిక నూలు, వస్త్ర పరిశ్రమలుగల జిల్లాలు- హైదరాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్
తెలంగాణలోని కొన్ని నూలు, వస్త్ర పరిశ్రమలు
- తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు (1972)- నిర్మల్- ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు (1980)- భువనగిరి
- గ్రోవర్స్ స్పిన్నింగ్ మిల్లు (1980)- ఆదిలాబాద్
- సంఘీ స్పిన్నింగ్ మిల్లు- రంగారెడ్డి (ఉమర్‌ఖాన్ గూడ)
- పెంగ్విన్ స్పిన్నింగ్ మిల్లు- మేడ్చల్ (ఉప్పల్)
- సూర్యలక్ష్మి కాటన్ మిల్లు- మహబూబ్‌నగర్
- కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు- కరీంనగర్
- ఇవేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 14 భారీ వస్త్ర పరిశ్రమలను స్థాపించడానికి ఆయా కంపెనీలతో ఎంఓయూను కుదుర్చుకుంది.
నూలు ఉత్పత్తి
- ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.- దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో నూలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది. భారతదేశంలో అత్యధిక కాటన్ వస్త్ర పరిశ్రమలుగల రాష్ట్రం- మహారాష్ట్ర
నోట్: మాంచెస్టర్ ఆఫ్ ఇండియా- అహ్మదాబాద్
- మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా- కాన్పూర్
- మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా- కోయంబత్తూర్
- కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా- ముంబై
- మాంచెస్టర్ ఆఫ్ ఏషియా- ఒసాకా (జపాన్)
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్కులు
1) సిరిసిల్ల- రాజన్న సిరిసిల్ల జిల్లా2) పాశమైలారం- సంగారెడ్డి జిల్లా
3) మల్కాపూర్- యాదాద్రి భువనగిరి జిల్లా
నోట్: భారతదేశ మొదటి టెక్స్‌టైల్ యూనివర్సిటీని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు.
పట్టు పరిశ్రమలు
- దేశంలో మొదటి పట్టు పరిశ్రమను 1832లో పశ్చిమబెంగాల్‌లోని హౌరా వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది.పట్టు ఉత్పత్తి
- ప్రపంచంలో చైనా, భారత్‌లు పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.- దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో, యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి.
- తెలంగాణలో ఆసిఫాబాద్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), మహదేవ్‌పూర్ (జయశంకర్ భూపాలపల్లి)లోని గిరిజన ప్రజలు టుస్సార్ సిల్క్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
తెలంగాణలోని పట్టు పరిశ్రమలు
1) గద్వాల పట్టుచీరలు- జోగుళాంబ గద్వాల (అయిజ మండలం ప్రసిద్ధి)2) పోంచపల్లి పట్టుచీరలు- యాదాద్రి భువనగిరి (భూదాన్‌పోచంపల్లి). దీన్నే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
3) సిరిసిల్ల చేనేత పరిశ్రమలు- సిరిసిల్ల జిల్లా కేంద్రం. ఇక్కడ పవర్‌లూమ్ పరిశ్రమలు ఉన్నాయి.
- సెంట్రల్ సిల్క్ బోర్డుగల ప్రదేశం- బెంగళూరు (కర్ణాటక)
పొగాకు పరిశ్రమ
- ప్రపంచంలో పొగాకును చైనా అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది.- దేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు పొగాకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
- తెలంగాణలో పొగాకు పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు 1. హైదరాబాద్ 2. రంగారెడ్డి 3. మెదక్
- తెలంగాణలో పురాతన పొగాకు కంపెనీ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్టీ)
- వీఎస్టీని 1920లో వజీర్ సుల్తాన్ అజామాబాద్ (హైదరాబాద్)లో స్థాపించారు.
- ఇది 1983లో పూర్తి స్వతంత్ర సంస్థగా రూపొంది వీఎస్టీ పరిశ్రమ లిమిటెడ్‌గా మారింది.
- ఇది చార్మినార్ సిగరెట్ బ్రాండ్ పేరుతో సిగరెట్లను తయారుచేసి సరఫరా చేస్తుంది.
చక్కెర పరిశ్రమ
- ఇది చెరకు ఆధారంగా నడిచే వ్యవసాయాధారిత పరిశ్రమచక్కెర ఉత్పత్తి
- ప్రపంచంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉన్నది.- దేశంలో చెరకు ఉత్పత్తిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో అతిపెద్ద చక్కెర పరిశ్రమ- నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్)
- నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1937లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో స్థాపించారు.
- ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారం
- రాష్ట్రంలోని చక్కెర ఉత్పత్తిలో సగభాగం ఈ పరిశ్రమ ద్వారానే ఉత్పత్తి అయ్యేది. దీన్ని ప్రస్తుతం మూసివేశారు.
- దీనికి అనుబంధంగా నెలకొల్పిన చక్కెర కర్మాగారాలు
1. జహీరాబాద్ చక్కెర కర్మాగారం- 1973- సంగారెడ్డి జిల్లా
2. మిర్యాలగూడ చక్కెర కర్మాగారం- 1977- నల్లగొండ
3. ముత్యంపేట చక్కెర కర్మాగారం- 1981- జగిత్యాల
4. సారంగపూర్ చక్కెర కర్మాగారం- 2012- నిజామాబాద్ (ప్రస్తుతం దీన్ని మూసివేశారు)
గమనిక: భారతదేశంలో మొదటి చక్కెర మిల్లు స్థాపించిన ప్రదేశం: చంపారన్ (బీహార్, 1904)
- ఏపీలోని తణుకు చక్కెర కర్మాగారం నుంచి వెలువడే ఉప ఉత్పత్తులను రాకెట్ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
2. అటవీ ఆధారిత పరిశ్రమలు
- అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను అటవీ ఆధారిత పరిశ్రమలు అంటారు.ఉదా : కాగితం పరిశ్రమ, ైప్లెవుడ్ పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఆకు పరిశ్రమ, ఆట వస్తువుల పరిశ్రమ, లక్క పరిశ్రమ.
1. కాగితం పరిశ్రమ
- కాగితం ఉత్పత్తిలో ముఖ్యంగా ఉపయోగించే ముడి పదార్థాలు- వెదురు, బగాసే (చెరుకు పిప్పి), సుబాయ్ గడ్డి (శివాలిక్ ప్రాంతంలో లభిస్తుంది), యూకలిప్టస్
- భారత్‌లో మొదటి కాగితం పరిశ్రమను 1832లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు సమీపంలోని సేరంపూర్ వద్ద ఏర్పాటు చేశారు.
- ఇండియాలో అధునాతన కాగితం పరిశ్రమ- థాలీగంజ్ (పశ్చిమబెంగాల్, 1870)
తెలంగాణ కాగితం పరిశ్రమ
ఎ. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు- ఇది రాష్ట్రంలో తొలి కాగితపు మిల్లు
- ఈ మిల్లును 1938లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్థాపించాడు.
- ఇక్కడ కాగితపు ఉత్పత్తి 1942 నుంచి ప్రారంభమైంది.
- ఈ సంస్థ రంగుల కాగితాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది.
- ఐటీసీ - పీఎస్‌డీపీ కాగితపు పరిశ్రమ- సారపాక (భద్రాద్రి కొత్తగూడెం)
పేపర్స్ అండ్ స్పెషాలిటీ పేపర్ బోర్డు
- ప్రారంభం : 1979, అక్టోబర్ 1న- దీన్ని ఐటీసీ సంస్థ 1999లో స్వాధీనం చేసుకుంది.
- 2002లో ఈ పరిశ్రమ ఐటీసీ- పీఎస్‌డీపీగా మారింది.
తెలంగాణలోని ఇతర పేపర్ మిల్లులు
1. భద్రాచలం పేపర్ మిల్లు- భద్రాచలం (1982)2. తెలంగాణ పేపర్ మిల్లు- నాచగూడెం (ఖమ్మం)
3. రేయాన్ పేపర్ మిల్లు- కమలాపూర్ (జయశంకర్ భూపాలపల్లి)
4. చార్మినార్ పేపర్ మిల్లు- మాతంగి (మెదక్)
5. నాగార్జున పేపర్ మిల్లు- పటాన్‌చెరువు (సంగారెడ్డి)
గమనిక: కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - మహారాష్ట్ర
- కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం- అమెరికా
- ైప్లెవుడ్ పరిశ్రమ: ఈ రకమైన పరిశ్రమలు రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఉన్నాయి
1. హైదరాబాద్ ైప్లెవుడ్ లిమిటెడ్- నాచారం (మేడ్చల్‌మల్కాజిగిరి )
2. నోవాపాన్ ఇండియా లిమిటెడ్ - పటానుచెరువు (సంగారెడ్డి)
- ఇండియాలో బిర్చ్ వృక్షాల కలపను ైప్లెవుడ్ తయారీలో ఉపయోగిస్తారు.