Type Here to Get Search Results !

Vinays Info

ఆసియా క్రీడలు -2018, Asian Game 2018

Top Post Ad

Asian-Games-2018
- ప్రపంచంలో పెద్ద ఖండమైన ఆసియాలో ప్రతి నాలుగేండ్లకోసారి క్రమం తప్పకుండా ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు. వలస పాలన నుంచి విముక్తి అయిన ఆసియా దేశాలు తమ మధ్య సయోధ్య, సఖ్యత, సామరస్యం, సత్సంబంధాల కోసం క్రీడలు నిర్వహించాలని నిర్ణయించాయి. 1948, ఆగస్టులో లండన్‌లో ఒలింపిక్ క్రీడలు జరిగే సమయంలో భారత ఒలింపిక్ కౌన్సిల్ ప్రతినిధి గురుదత్ సోంది ఆసియా క్రీడల గురించి ప్రస్తావన తెచ్చారు. ఆసియా దేశాలు ఈ విషయాన్ని అంగీకరించి ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్‌కు తమ అంగీకారాన్ని తెలిపాయి.
- ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ 1949లో సమావేశమై ఏషియన్ ఫెడరేషన్ ఏర్పాటుచేసి ఆసియా క్రీడలను ప్రతి నాలుగేండ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో 1951లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరిగాయి.
- ఇండోనేషియాలో 56 ఏండ్ల అనంతరం రెండోసారి 2018, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా క్రీడలను నిర్వహించారు. ఆసియా క్రీడలు మొదటిసారిగా రెండే వేదికల్లో జరిగాయి. ప్రారంభోత్సవానికి రావాల్సిన ఇండోనేషియా అధ్యక్షుడు ట్రాఫిక్‌లో చిక్కుకోగా, కాన్వాయ్ నుంచి దిగి మోటార్ సైకిల్ తీసుకుని, హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రారంభోత్సవ వేడుకలకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.
Asian-Games1
- 45 దేశాల మార్చ్‌ఫాస్ట్‌లో తొలుత ఆఫ్ఘనిస్థాన్ స్టేడియంలోకి ప్రవేశించింది. చివరిగా ఆతిథ్య దేశం ఇండోనేషియా ప్రవేశించింది. ఉత్తర, దక్షిణ కొరియాలు ఒకే జట్టుగా మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొని చరిత్ర సృష్టించాయి.
- సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్స్ ఎత్తివేయడంతో కువైట్ అథ్లెట్లు తమ సొంత జెండాతో మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. జపాన్, ఇండియా దేశాలు మాత్రమే ప్రతి ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాయి.
- ఇప్పటివరకు జరిగిన అన్ని ఆసియా క్రీడలను 9 దేశాలు (ఇండియా, ఫిలిప్పీన్స్, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్, ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, ఖతార్) మాత్రమే నిర్వహించాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో 7 దేశాలు మాత్రమే (ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్) పాల్గొన్నాయి.
- ఆసియా క్రీడలు నాలుగు సార్లు (1966, 1970, 1978, 1998) థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగాయి. రెండు సార్లు (1952, 1982) భారత్‌లో, జపాన్‌లో 1958, 1994, దక్షిణ కొరియాలో 1986, 2014, చైనాలో 1990, 2010లో జరిగాయి.
- ఆసియా క్రీడల్లో భారత్ నుంచి పాల్గొన్న బృందంలో 804 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 572 మంది అథ్లెట్లు, 231 మంది కోచ్‌లు, ఫిజియోలు, మేనేజర్లు ఉన్నారు. ప్రతి రోజూ ఒక్కొక్కరి ఖర్చు 50 అమెరికా డాలర్లు (రూ. 3454), డాక్టర్లకు 25 డాలర్లు (రూ. 1727).

విశేషాలు

- ప్రారంభ వేడుకలు- గెలోరో బంగ్ కర్నో
- ముగింపు వేడుకలు- గెలోరో బంగ్ కర్నో
- వేదికలు- జకార్తా, పాలెంబాగ్
- ఇండోనేషియా అధ్యక్షుడు- జోకో విడోడో
- జ్యోతి ప్రజ్వలన- సుశీ సుశాంతి (బ్యాడ్మింటన్ స్వర్ణ పతక విజేత-1990 బార్సిలోనా)
- ఇండోనేషియా అధికార చిహ్నం- గరుడ పక్షి
- మార్చ్‌ఫాస్ట్‌లో త్రివర్ణ పతాకధారి- నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)
- ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకధారి- రాణిరాంపాల్ (మహిళ హాకీ జట్టు సారథి)
- భారత్ నుంచి క్రీడాకారులు- 572
- పురుషులు- 312
Asian-Games2
- మహిళలు- 260
- క్రీడాంశాలు- 36 (భారత్ పాల్గొన్నవి)
- క్రీడల వ్యయం- 32 వేల కోట్లు
- పాల్గొన్న దేశాలు- 40
- క్రీడాంశాలు- 45
- ఈవెంట్ల సంఖ్య- 465
- అధికారిక గీతం- ఎనర్జీ ఆఫ్ ఆసియా
- మస్కట్- బిన్ బిన్ (బర్డ్ ఆఫ్ ప్యారడైజ్), అటుంగ్ (వేగంగా పరుగెత్తే దుప్పి), కాకా (ఖడ్గమృగం)
- అతిపెద్ద వయస్కుడు- లీహంగ్ ఫాంగ్ (81 ఏండ్లు). మలేషియాకు చెందిన ఈయన బ్రిడ్జ్ క్రీడలో పాల్గొన్నాడు.
- అతిచిన్న వయస్కుడు- ఇయాన్ నుర్మెన్ అమ్రి (11 ఏండ్లు)- స్కేట్ బోర్డర్ (మలేషియా)
- ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం- సన్ సీయూన్- ఉషు (చైనా)
Asian-Gamesc
- భారత్ నుంచి తొలి పతకం విజేత- అపూర్వి చండేల, రవికుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్)
- భారత్ నుంచి తొలి స్వర్ణ పతకం విజేత- భజరంగ్ పూనియా (రెజ్లింగ్)
- ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు- ఎరిక్ తోహిర్
- కేంద్ర క్రీడల మంత్రి- రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
- ఐఏఓ అధ్యక్షుడు- నరీంద్ర బాత్రా
- ఐఏఓ ప్రధాన కార్యదర్శి- రాజీవ్ మెహతా

ఆసియా క్రీడల్లో తెలుగువారు

- బాక్సింగ్- హుసాముద్దీన్ (తెలంగాణ)
- జిమ్నాస్టిక్స్- అరుణారెడ్డి (తెలంగాణ)
- పురుషుల కబడ్డీ- మల్లేష్ (తెలంగాణ)
- సెపక్ తక్రా- తరంగిణి (తెలంగాణ)
- షూటింగ్- రష్మీ రాథోడ్ ( తెలంగాణ)
- టెన్నిస్- యడ్లవల్లి ప్రాంజల (తెలంగాణ)
- బ్యాడ్మింటన్- సైనా నెహ్వాల్, సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి, సాయిప్రణీత్, పల్లె గాయిత్రి, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజితరావు, సాత్విక్ సాయిరాజ్
- ఆర్చరీ- జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్)
- మహిళల హాకీ- రజని (ఏపీ)- ఆసియా గేమ్స్-2018లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ రికాకో లిక్కీ- స్విమ్మర్ (జపాన్)
- భారత్ మొత్తం 18 క్రీడాంశాల్లో 69 పతకాలు సాధించింది.
- 7 క్రీడాంశాల్లో 15 బంగారు పతకాలు సాధించింది.
- ఆసియా క్రీడల్లో భారత్‌కు సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్య పతకం లభించింది.
- ఏదో ఒక పతకం సాధించిన దేశాలు- 37
- బంగారు పతకాలు సాధించిన దేశాలు- 28
- ఆసియా క్రీడల్లో తొలిసారి బ్రిడ్జ్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో స్వర్ణాన్ని భారత్ సాధించింది.
- ఆసియా క్రీడలు-2018లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళ- వినేశ్ ఫోగట్ (50 కేజీల ఫ్రీ స్టయిల్)
- భారత్‌కు ఆసియాడ్‌లో సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్య పతకం లభించింది.
- ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున అతిపిన్న వయస్సులో రజతం నెగ్గిన షూటర్ శార్దూల్ విహాన్ (15 ఏండ్లు)
- ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అతిపెద్ద వయస్కుడు ప్రణబ్ (60)- బ్రిడ్జ్
- స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా షూటర్- రాహీ సర్నోబత్
- హెప్టాథ్లాన్ (హైజంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, లాంగ్ జంప్, 100 మీ., 200 మీ., 800 మీ.)లో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్- స్వప్న బర్మన్
- ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తండ్రీతనయలు- 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన వాలీబాల్ జట్టులో పీవీ రమణ కీలక ఆటగాడు. ప్రస్తుతం పీవీ సింధు బ్మాడ్మింటన్‌లో రజతం సాధించింది. పీవీ రమణ (2000), పీవీ సింధు (2013) అర్జున అవార్డు గ్రహీతలే.
- అర్పిందర్ సింగ్ 48 ఏండ్ల ఆసియాడ్‌లో ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు.
- కబడ్డీ సెమీస్‌లో ఇరాన్ చేతిలో 18-27 తేడాతో భారత్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది.
- 1990లో బీజింగ్ ఆసియా క్రీడల్లో కబడ్డీ ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ ఏడుసార్లు స్వర్ణం కైవసం చేసుకుంది.
- ఆసియా క్రీడల స్విమ్మింగ్‌లో భారత్ తృటిలో పతకాన్ని కోల్పోయింది. పురుషుల 500 మీ. ఫ్రీ ైస్టెల్ స్విమ్మింగ్‌లో వీరదవల్ ఖడె 22.47 సెకన్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. 22.46 సెకన్లతో జపాన్ క్రీడాకారుడు షునిచ్ కాంస్యం సాధించాడు.
- హాకీలో భారత్ 24-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. భారత హాకీ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. ఇదే మ్యాచ్‌లో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు రూపిందర్ (5), హర్మన్ ప్రీత్ (4), ఆకాశ్ దీప్ (3) హ్యాట్రిక్ నమోదు చేశారు. 86 ఏండ్ల క్రితం ధ్యాన్‌చంద్ జట్టు లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్ (1932)లో అమెరికాపై 24-1తో సాధించిన రికార్డును అధిగమించారు. కానీ హాకీలో అతిపెద్ద విజయం 1984లో న్యూజిలాండ్ 36-1 తేడాతో సమోహ జట్టుపై గెలిచింది.
Asian-Games3

ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు

- పంజాబ్‌కు చెందిన తేజిందర్ పాల్ సింగ్ తూర్ 7.260 కిలోల బరువుండే ఇనుపగుండును ఏకంగా 20.75 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అబుల్ మజీద్ (సౌదీ అరేబియా, 20.57 మీటర్లు, 2010 ఆసియా క్రీడలు) నెలకొల్పాడు.
Asian-Games4

భారత్ సాధించిన పతకాలు

స్వర్ణ పతకం
- వినేశ్ ఫోగట్- రెజ్లింగ్ 50 కేజీల మహిళల ఫ్రీస్టయిల్
- సౌరబ్ చౌదరి- షూటింగ్ 10 మీ. ఎయిర్ రైఫిల్స్
- భజరంగ్ పూనియా- రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టయిల్
- రాహీ సర్నోబత్- షూటింగ్ 25 మీ. ఎయిర్ పిస్టల్
- తూర్ తేజిందర్‌పాల్‌సింగ్- అథ్లెటిక్స్(మెన్స్ షాట్‌పుట్)
- రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ - టెన్నిస్ పురుషుల డబుల్స్
- పురుషుల జట్టు- రోయింగ్ (క్వాడ్రాపుల్ స్కల్స్)
- నీరజ్ చోప్రా- అథ్లెటిక్స్ (మెన్స్ జావెలిన్ త్రో)

- మంజిత్- అథ్లెటిక్స్ (మెన్స్ 800 మీ.)
- అర్పిందర్ సంగ్- అథ్లెటిక్స్ (మెన్స్ ట్రిపుల్ జంప్)
- స్వప్న బర్మన్- అథ్లెటిక్స్ (ఉమెన్స్ హెప్టాథ్లాన్)
- జిన్సన్ జాన్సన్- అథ్లెటిక్స్ (1500 మీ. పురుషులు)
- హిమదాస్, పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, విస్మయ- అథ్లెటిక్స్ (4x400 మీ. మహిళల రిలే)
- అమిత్ పంఘల్- బాక్సింగ్ 49 కేజీల లైట్ ైఫ్లె వెయిట్)
- ప్రణబ్ బర్దన్, శివనాథ్ సర్కార్- బ్రిడ్జ్ (మెన్స్ పెయిర్)
Asian-Games5

రజతం

- దీపక్ కుమార్- షూటింగ్ (మెన్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్స్)
- లక్షయ్ షెరాన్- షూటింగ్ (పురుషుల ట్రాప్)
- సంజీవ్ రాజ్‌పుత్- షూటింగ్ (పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్)
- శార్దూల్ విహాన్- షూటింగ్ (మెన్స్ డబుల్ ట్రాప్)
- మహిళల కబడ్డీ జట్టు
- ఫౌద్ మీర్జా- ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ-వ్యక్తిగత)
- ఫౌద్ మీర్జా, రాకేష్ కుమార్, అసీన్ మాలిక్, జితేంద్ర సింగ్ - ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ-టీమ్)
- హిమదాస్- అథ్లెటిక్స్ (ఉమెన్స్ 400 మీ.)
- మహ్మద్ అనాస్- అథ్లెటిక్స్ (పురుషుల 400 మీ.)
- ద్యుతీచంద్- అథ్లెటిక్స్ (మహిళల 100 మీ.)
- ధరుణ్ అయ్యసామి- అథ్లెటిక్స్ (పురుషుల 400 మీ. హార్డిల్స్)
- సుధాసింగ్- అథ్లెటిక్స్ (మహిళల 3000 మీ. స్టీపుల్ చేజ్)
Asian-Games7
- నీనా వరకిల్- అథ్లెటిక్స్ (మహిళల లాంగ్ జంప్)
- ముస్కాన్ కిరార్, మధుమిత కుమారి, జ్యోతి సురేఖ వెన్నం- ఆర్చరీ (ఉమెన్స్ టీం కాంపౌండ్)
- అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైని- ఆర్చరీ (మెన్స్ టీం కాంపౌండ్)
- పీవీ సింధు- బ్యాడ్మింటన్
- జిన్సన్ జాన్సన్- అథ్లెటిక్స్ (మెన్స్ 800 మీ.)
- పింకి బల్హర- కురాష్ (మహిళల 52 కేజీలు)
- మహ్మద్ అనాస్, పూవమ్మ, హిమదాస్, రాజీవ్ అరోకియా- అథ్లెటిక్స్ (మిక్స్‌డ్ రిలే 4 x 400)
- ద్యుతీచంద్- అథ్లెటిక్స్ (మహిళల 200 మీ.)
- మహ్మద్ కున్హు, ధరుణ్ అయ్యసామి, మహ్మద్ అనాస్, రాజీవ్ అరోకియా- అథ్లెటిక్స్ (పురుషుల 4x400 మీ. రిలే)
- శ్వేత శెర్వెగర్, వర్షాగౌతమ్- సెయిలింగ్ (మహిళలు)
- భారత హాకీ మహిళల జట్టు
- దీపికా పళ్లికల్, జోష్న చిన్నప్ప, తన్వీఖన్నా, సునయన కురువిలా- స్కాష్ (మహిళలు)

కాంస్యం

- అపూర్వి చండేల, రవికుమార్- షూటింగ్ మిక్స్‌డ్ (10 మీ. ఎయిర్ రైఫిల్)
- అభిషేక్ వర్మ- షూటింగ్ మెన్స్(10 మీ. ఎయిర్ పిస్టల్)
- భారత జట్టు- సెపక్‌తక్రా (పురుషులు)
- దివ్య కక్రాన్- రెజ్లింగ్ (ఉమెన్స్ ఫ్రీస్టయిల్ 68 కేజీలు)
- రొషిబిన నొరెమ్- వుషు (మహిళల సందా 60 కేజీలు)
- సంతోష్ కుమార్- వుషు (మెన్స్ సందా 56 కేజీలు)
- సూర్యభానుప్రతాప్ సింగ్- వుషు (మెన్స్ సందా 60 కేజీలు)
- నరేందర్ గ్రెవాల్- వుషు (మెన్స్ సందా 65 కేజీలు)
- అంకిత రైనా- టెన్నిస్ (ఉమెన్స్ సింగిల్స్)
- భారత పురుషుల కబడ్డీ జట్టు
- దుష్యంత్ చౌహాన్- రోయింగ్ (మెన్స్ లైట్‌వెయిట్ స్కల్స్)
- రోహిత్ కుమార్, భగవాన్ సింగ్- రోయింగ్ (మెన్స్ లైట్‌వెయిట్ స్కల్స్)
- హీనా సిధు- షూటింగ్ (మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్)
- ప్రజ్నేష్ గుణేశ్వరన్- టెన్నిస్ (మెన్స్ సింగిల్స్)- దీపికా పళ్లికల్- మహిళల స్కాష్
- జ్యోష్న చిన్నప్ప- మహిళల స్క్వాష్
- సౌరవ్ ఘోషల్- మెన్స్ స్కాష్
- పురుషుల జట్టు- బ్రిడ్జ్
- మిక్స్‌డ్ జట్టు- బ్రిడ్జ్
- సైనా నెహ్వాల్- బ్యాడ్మింటన్ (మహిళలు)
- పురుషుల జట్టు- టేబుల్ టెన్నిస్
- మలప్రభ జాదవ్- కురాష్ (మహిళల 52 కేజీలు)
- శరత్ కమల్, మనిక బత్ర- టేబుల్ టెన్నిస్ (మిక్స్‌డ్ డబుల్)
- పి.యు. చిత్ర- అథ్లెటిక్స్ (మహిళల 1500 మీ.)
- సీమా పూనియా- అథ్లెటిక్స్ (మహిళల డిస్కస్‌త్రో)
- హర్షితా తోమర్- సెయిలింగ్ (ఓపెన్ లాజర్ 4.7)
- వరుణ్ థక్కర్, గణపతి చెంగప్ప- సెయిలింగ్
- స్క్వాష్ పురుషుల జట్టు
- వికాస్ క్రిషన్ యాదవ్- బాక్సింగ్ (75 కేజీల మిడిల్ వెయిట్)
- హాకీ పురుషుల జట్టు

ఆసియా క్రీడలు-2018 భారత్ పతకాలు

స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
పురుషులు 11 11 16 38
మహిళలు 4 12 11 27
మిక్స్‌డ్ 0 1 3 4
15 24 30 69
Asian-Games6
- క్రీడల్లో పాల్గొన్న దేశాల్లో ఒక్క పతకం మాత్రమే గెలుచుకున్న దేశాల సంఖ్య- 37
- బంగారు పతకాలు గెలుచుకున్న దేశాల సంఖ్య- 28
- ఒక్క పతకం కూడా గెలవని దేశాలు- 9 (బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, ఈస్ట్ తైమూర్, మాల్దీవులు, ఒమన్, పాలస్తీనా, శ్రీలంక, యెమెన్)
Asian-Gamesb
Asian-Gamesa
Asian-Gamesd

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.