Type Here to Get Search Results !

Vinays Info

జాతీయ పరిశోధనా కేంద్రాలు

Top Post Ad

సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)

- సెస్‌ను 1980లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 1986లో దీన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించారు. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం, ఐసీఎస్‌ఎస్‌ఆర్, ఏడీబీ, వరల్డ్‌బ్యాంక్, టాటా ట్రస్ట్, యునిసెఫ్ తదితర సంస్థల నుంచి గ్రాంట్స్/నిధులు వస్తాయి. ఈ సంస్థకు ఉస్మానియా యూనివర్సిటీ 5 ఎకరాల స్థలాన్ని నిజామియా అబ్జర్వేటరీ, బేగంపేటలో కేటాయించింది.
- ఆఫర్ చేస్తున్న కోర్సులు: పీహెచ్‌డీ, ఎంఫిల్ (సెస్‌ను డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లు గుర్తించాయి)
- పీహెచ్‌డీ: ఎకానమీ, ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్
- వీటితోపాటు పార్ట్ టైం ప్రోగ్రామ్స్ కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
- వెబ్‌సైట్: http://www.cess.ac.in

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)

- ఆధునిక జీవశాస్త్రంలో పరిశోధనలకు సీసీఎంబీ ప్రధాన కేంద్రం. దీన్ని 1977లో సెమీ అటానమస్ సెంటర్‌గా ఏర్పాటుచేశారు. మొదట్లో బయోకెమిస్ట్రీ డివిజన్‌గా ఉన్నా తదనంతర కాలంలో సీఎస్‌ఐఆర్ ఏర్పాటుచేసిన 44 పరిశోధన కేంద్రాల్లో ఒకటిగా మారింది. అనంతరం 1981-82ల్లో పూర్తిస్థాయి జాతీయ పరిశోధన కేంద్రంగా మల్టీడిసిప్లీనరీ ఏరియాస్ ఆఫ్ మోడ్రన్ బయాలజీగా రూపుదిద్దుకుంది.
అందించే కోర్సులు:
- పీహెచ్‌డీ (విభాగాలు: బయాలజీ ఆఫ్ సెల్స్ అండ్ సబ్ సెల్యూలర్ కాంప్లెక్సెస్, ప్రొటీన్ అండ్ మ్యాక్రోమాలిక్యులార్ అసెంబ్లీస్, జెనెటిక్ అనాలసిస్ అండ్ జినోమిక్స్, బయాలజీ ఆఫ్ ప్లాంట్ డెవలప్‌మెంట్ అండ్ డిసీజెస్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజెస్, ఎవాల్యుషనరీ బయాలజీ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్.
- ప్రవేశాలను జేఎన్‌యూ-సీసీఎంబీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్, జేఎన్‌యూ-సీసీఎంబీ పీహెచ్‌డీ పోగ్రామ్ త్రూ జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లీనరీ లైఫ్ సైన్సెస్. సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ పీహెచ్‌డీ.
- ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్: మెడికల్ స్టూడెంట్స్ రిసెర్చ్ ట్రెయినింగ్, వింటర్ రిసెర్చ్ అబ్జర్వర్‌షిప్ ప్రోగ్రామ్, ప్రాజెక్టు బేస్డ్ రిసెర్చ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్, ట్రెయినింగ్ కోర్సు ఇన్ యానిమల్ సెల్ కల్చర్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ తదితర శిక్షణ కోర్సులు ఉన్నాయి.
- ఎనిమిది, తొమ్మిది, పదోతరగతి విద్యార్థుల కోసం సీసీఎంబీ -యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇది రెండువారాలు ఉంటుంది.
- వెబ్‌సైట్: http://www.ccmb.res.in

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ)

- హైదరాబాద్‌లో సీఐఎంఏపీ పరిశోధనా కేంద్రాన్ని 1982లో ప్రారంభించారు.
- రైతుకు స్నేహపూర్వకంగా, అధిక ఉత్పత్తులను అందించే పద్ధతులను నేర్పడం, పెద్ద ఎత్తున మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్‌ను ఎగుమతి చేయడం ఈ సంస్థ ప్రధాన కార్యక్రమాలు. ఈ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన ఆగ్రో టెక్నాలజీతో అరోమాటిక్ గ్రాస్, రోజ్ సెంటెడ్ జిరేనియం, మెంథాల్ మింట్, ఇచ్చింగ్ బీన్ తదితర పంటలను సాగుచేయడం లక్ష్యం.

ఆఫర్ చేస్తున్న కోర్సులు:

- సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ)- జేఎన్‌యూ పీహెచ్‌డీ ప్రోగ్రామ్.
- అర్హతలు: ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్/అగ్రికల్చర్/బాటనీ/కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బయోఇన్ఫర్మాటిక్స్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్/ఐసీఎంఆర్-నెట్ లేదా డీబీటీ-జేఆర్‌ఎఫ్ ఎగ్జామ్ లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- వెబ్‌సైట్: http://cimap.res.in

ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ)

- బ్యాంకింగ్ సెక్టార్‌లో టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఐడీఆర్‌బీటీని 1996లో స్థాపించింది. బ్యాంకింగ్‌కు సంబంధించిన టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ తదితర స్వల్పకాలిక, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్, ఎంటెక్ తదితర కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లో ఈ సంస్థ ఉంది.
- ఎంటెక్ ప్రోగ్రామ్: ఈ ప్రోగ్రామ్‌ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి అందిస్తుంది. ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో స్పెషలైజేషన్‌గా బ్యాంకింగ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, గేట్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో వచ్చే పర్సంటైల్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్ స్కోర్‌తోపాటు బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రవేశాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చేపడుతుంది.
- పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (పీజీడీబీటీ)
- పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తిరుచ్చి, వరంగల్ నిట్‌లతో కలిసి ఈ ప్రోగ్రామ్‌ను ఐడీఆర్‌బీటీ అందిస్తున్నది.
- ఇది ఫుల్‌టైం కోర్సు. ఫైనాన్షియల్ నెట్‌వర్క్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్, సెక్యూరిటీ టెక్నాలజీస్ ఫర్ ద ఫైనాన్షియల్ సెక్టార్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్ విభాగాల్లో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది.
- పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ఐడీఆర్‌బీటీ అందిస్తుంది.
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://idrbt.ac.in
CDAC

సీడాక్ హైదరాబాద్

- సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)ను హైదరాబాద్‌లో 1999లో ప్రారంభించారు. లేటెస్ట్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటుచేశారు. దీంతోపాటు ఫ్యాకల్టీ ట్రెయినింగ్, పలు కోర్సుల నిర్వహణను సీడాక్ చేపడుతుంది. ప్రావీణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడం కోసం సీడాక్ పలు కోర్సులను, శిక్షణలను అందిస్తుంది.
- సీడాక్ అందించే కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ (అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, జియోఇన్ఫర్మాటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ హెచ్‌ఐ, బిగ్‌డాటా అనలిటిక్స్, హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్.
- ఎంటెక్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్సింగ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఈఆర్‌పీ ప్రోగ్రామ్, డిప్లొమా ఇన్ సిస్టమ్ అండ్ డాటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులను సీడాక్ అందిస్తుంది.
- వెబ్‌సైట్: https://www.cdac.in
DRDO

డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)

- డీఆర్‌డీవోను 1958లో ప్రారంభించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన టెక్నికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (టీడీఈ), డీటీడీనీ..., డీఎస్‌వో నుంచి దీన్ని ప్రారంభించారు. అప్పట్లో డీఆర్‌డీవో ఒక చిన్న సంస్థ. కాలకమ్రంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం 50కి పైగా ల్యాబొరేటరీల నెట్‌వర్క్ కలిగి ఉంది. ఏరోనాటిక్స్, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, యుద్ధవాహనాలు, ఇంజినీరింగ్ సిస్టమ్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, క్షిపణులు, నేవల్ సిస్టమ్స్, లైఫ్ సైన్సెస్, ఐటీ,అగ్రికల్చర్ తదితర విభాగాల్లో డీఆర్‌డీవో విస్తరించింది.
- లక్ష్యం: భారత్‌ను ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టడం, రక్షణ సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యాలు.
- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్: హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ, కోయంబత్తూరులోని భారతీయార్ యూనివర్సిటీతో కలిసి అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ) ద్వారా ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నది.
- వెబ్‌సైట్: https://www.drdo.gov.in
IIRR

ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్)

- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఆల్ ఇండియా కోఆర్డినేట్ రైస్ రిసెర్చ్ ప్రాజెక్టుగా దీన్ని 1965లో ప్రారంభించారు. తర్వాత దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రిసెర్చ్‌గా1983లో మార్చారు. 2014లో దీన్ని ఐఐఆర్‌ఆర్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు, వరి పండించే రైతులకు, వినియోగదారులకు అహారకొరత లేకుండా పౌష్టికాహారాన్ని, జీవనోపాధి భద్రతను కల్పించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.
- అకడమిక్ ప్రోగ్రామ్స్: ఐఐఆర్‌ఆర్‌లో ఎమ్మెస్సీ రిసెర్చ్ ప్రాజెక్ట్ ట్రెయినింగ్‌లను నిర్వహిస్తారు. ఇవి 3 నుంచి 6 నెలల కాలపరిమితిలో రైస్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, హైబ్రిడ్ రైస్ టెక్నాలజీల్లో నిర్వహిస్తారు. వీటితోపాటు బయోఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీలపై శిక్షణా కోర్సులను నిర్వహిస్తారు.
- వెబ్‌సైట్: http://www.icar-iirr.org

ఐఐసీటీ

- సీఎస్‌ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) దేశంలో పురాతన సంస్థల్లో ఒకటి. మొదట్లో దీన్ని సెంట్రల్ ల్యాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌గా 1944లో ప్రారంభించారు. తర్వాత రీజినల్ రిసెర్చ్ ల్యాబొరేటరీగా తర్వాత 1989లో ఐఐసీటీగా మార్చారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో ఐఐసీటీ ఒకటి.
- అందించే కోర్సులు: పీహెచ్‌డీ
- విభాగాలు: ఆర్గానిక్ సింథసిస్, నేచురల్ ప్రొడక్ట్స్-ఐసోలేషన్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫ్లోరో ఆర్గానిక్స్, ఆగ్రో కెమికల్స్, నానో మెటీరియల్స్ ఫర్ సోలార్ ఎనర్జీ, లిపిడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, ఫార్మకాలజీ, బయాలజీ, మాలిక్యులర్ మోడలింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ తదితర విభాగాలు ఉన్నాయి.
- సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ: ఎంటెక్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్.
- సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ - ప్రాజెక్ట్ ఫెలోతోపాటు ఎమ్మెస్సీ, ఎంటెక్, బీటెక్/బీఈ విద్యార్థులకు శిక్షణనిస్తుంది.
- వెబ్‌సైట్: http://www.iictindia.org

సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (ఏఐఎంఎస్‌సీఎస్)

- ఏఐఎంఎస్‌సీఎస్‌ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌సైన్స్‌లలో అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో పరిశోధన దీని ప్రధాన లక్ష్యం. ఆరు పరిశోధన కేంద్రాలను ఈ సెంటర్ నిర్వహిస్తుంది. పరిశోధన, రిసెర్చ్, కన్సల్టెన్సీ, శిక్షణ ఈ సెంటర్లు నిర్వహిస్తాయి.
- కోర్సులు, ఎగ్జామ్స్: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ). ఇది రెండేండ్ల ఫుల్‌టైం ప్రోగ్రామ్. దీన్ని హైదరాబాద్ యూనివర్సిటీతో కలిసి నిర్వహిస్తున్నది.
- స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్‌ను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఇది జూనియర్ లెవల్ (9, 10వ తరగతి చదివేవారు), సీనియర్ లెవల్ (11, 12, డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నవారికి).
- వెబ్‌సైట్: http://www.crraoaimscs.org

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ)

- ఐపీఈ ఒక స్వతంత్ర సంస్థ. నాన్ ప్రాఫిట్ సొసైటీ కింద దీన్ని 1964లో ప్రారంభించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిసెర్చ్, ఎంహెచ్‌ఆర్‌డీ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కన్సల్టెన్సీగా, మేనేజ్‌మెంట్ కోర్సుల సంస్థగా, పరిశోధన, శిక్షణా సంస్థగా 50 ఏండ్ల అనుభవం గడించిన సంస్థగా పేరుగాంచింది. ఈ సంస్థ పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఐపీఈ అందిస్తున్న కోర్సులు:

- పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) - రెండేండ్ల కోర్సు
- పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్- రెండేండ్ల కోర్సు
- పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్- రెండేండ్ల కోర్సు
- పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్- రిటైల్ మార్కెటింగ్
- పీజీడీఎం- హెచ్‌ఆర్‌ఎం
- ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం, డాక్టోరల్ రిసెర్చ్ ప్రోగ్రామ్ తదితరాలు ఉన్నాయి.
- పూర్తి వివరాల కోసం ప్రధాన క్యాంపస్ శామీర్‌పేట, హైదరాబాద్‌లో సంప్రదించవచ్చు.
- వెబ్‌సైట్: http://www.ipeindia.org

జాతీయ జీవవైద్య పరిశోధన జంతువనరుల సంస్థ (ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్)

- ఈ సంస్థను 1957లో ఏర్పాటుచేశారు. పరిశోధనలకు కేంద్రంగా ఈ సంస్థ భాసిల్లుతున్నది.
- ల్యాబొరేటరీ యానిమల్ సూపర్‌వైజర్స్ ట్రెయినింగ్ కోర్సు (జూనియర్, సీనియర్), అడ్‌హక్ మాడ్యులర్ షార్ట్ డ్యురేషన్ కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది.
- వెబ్‌సైట్: http://www.narfbr.org
NIRD

ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్

- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)ను కేంద్ర గ్రామీణ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఇది అటానమస్ సంస్థ. అంతర్జాతీయంగా ఈ సంస్థ పేరుగాంచింది. ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌లో ఉండగా ఉత్తర-ఈశాన్య ప్రాంత క్యాంపస్ గువాహటిలో ఉంది. గ్రామీణ ప్రాంతాలకు, పేదప్రజల అభ్యున్నతి కోసం పలు రకాల ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ కోర్సులను ఇక్కడ అందిస్తున్నారు. ఈ సంస్థలో స్కూల్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ అండ్ సోషల్ జస్టిస్, స్కూల్ ఆఫ్ రూరల్ లైవ్లీహుడ్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్, స్కూల్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్, స్కూల్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ సిస్టమ్స్, ప్రొఫెషనల్ సపోర్ట్ సెంటర్స్, రిసోర్స్ సెల్స్ ఉన్నాయి.

ఆఫర్‌చేస్తున్న కోర్సులు:

- రెగ్యులర్ విధానంలో - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - రూరల్ మేనేజ్‌మెంట్ - రెండేండ్లు
- దూరవిద్యా విధానంలో- పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ - 13 నెలలు
- పీజీ సర్టిఫికెట్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ -13 నెలలు
- పీజీ సర్టిఫికెట్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ జియోస్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ - 13 నెలలు
- వెబ్‌సైట్: www.nird.org.in

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్

- హైదరాబాద్‌లో ఐఎస్‌ఐని 1974లో ప్రారంభించారు. రాష్ర్టానికి సంబంధించిన పరిశ్రమలకు ఉపయుక్తమైన స్టాటిస్టికల్ సమాచారాన్ని, క్వాలిటీ మేనేజ్‌మెంట్ మెథడాలజీస్‌ను అందించడానికి దీన్ని ఏర్పాటుచేశారు. దీని మాతృసంస్థను కోల్‌కతాలో 1931లో పీసీ మహలనోబిస్ ప్రారంభించారు.
- అందిస్తున్న కోర్సులు: పార్ట్‌టైం/ఫుల్‌టైం అకడమిక్ ప్రోగ్రామ్స్
- మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్సెస్ - ఫుల్‌టైం - 2 ఏండ్లు
- జేఆర్‌ఎఫ్ ఇన్ క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్ - ఫుల్‌టైం - 6 ఏండ్లు (గరిష్ఠంగా)
- ఎస్‌క్యూసీలో పార్ట్‌టైం సర్టిఫికెట్‌కోర్సు- 6 నెలలు
- వెబ్‌సైట్: http://www.isihyd.ac.in
gandhi-medical

గాంధీ మెడికల్ కాలేజీ

- గాంధీ మెడికల్ కాలేజీని 1954లో ఏర్పాటుచేశారు. అధికారికంగా దీన్ని 1955, జూన్ 25న భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.
- ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంబీబీఎస్, బీపీటీ, ఎండీ/ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, మెడికల్ స్పెషాలిటీ కోర్సులను అందిస్తుంది.
- వెబ్‌సైట్: http://www.gandhihospital.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)

- హైదరాబాద్‌లో ఈ సంస్థను 2010లో ప్రారంభించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలోని ఒక స్వతంత్ర సంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మ్ యానిమల్స్ కోసం దీన్ని ప్రారంభించారు. యానిమల్ బయోటెక్నాలజీ రంగంలో ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్, లైవ్‌స్టాక్, జినోమిక్స్, న్యూట్రిషన్ తదితర విభాగాల్లో పరిశోధనలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇస్తుంది.
- ప్రోగ్రామ్స్: ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
- వెబ్‌సైట్: http://www.niab.org.in

నైపర్

- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్)ను హైదరాబాద్‌లో 2007లో ప్రారంభించారు. మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలసిస్ విభాగాల్లో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో అత్యాధునిక ల్యాబొరేటరీలు ఉన్నాయి.

అందిస్తున్న కోర్సులు:

- ఎంఎస్ (ఫార్మా)- మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, రెగ్యులేటరీ టాక్సికాలజీ.
- ఎంటెక్ (ఫార్మా)లో ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ)
- ఎంబీఏ (ఫార్మా)- ఫార్మస్యూటికల్ మేనేజ్‌మెంట్
- పీహెచ్‌డీ- మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ)
- వెబ్‌సైట్: http://www.niperhyd.ac.in

నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)

- నార్మ్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) 1976లో హైదరాబాద్‌లో స్థాపించింది. ఇక్కడ అగ్రికల్చరల్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

అందిస్తున్న కోర్సులు:

- పీజీడీఎంఏ: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-అగ్రికల్చర్
- ఇది రెండేండ్ల ప్రోగ్రామ్.
- పీజీడీటీఎంఏ: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ - ఏడాది కోర్సు- హైదరాబాద్ యూనివర్సిటీతో కలిసి దీన్ని అందిస్తుంది.
- ఈ-లెర్నింగ్ కోర్సుల కింద - మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు, పీజీడిప్లొమా, ఫౌండేషన్ కోర్సులను అందిస్తుంది.
- వెబ్‌సైట్: https://naarm.org.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా

- 1984లో దీన్ని ప్రారంభించారు. నాన్ ఫ్రాపిట్ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 11 యూనివర్సిటీలను ఇక్ఫాయ్ ప్రారంభించింది. ఇది డీమ్డ్ యూనివర్సిటీగా బీటెక్, ఎంటెక్, లా, బిజినెస్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను అందిస్తుంది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:http://www.icfaiuniversity.in

నిథిమ్

- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథిమ్)ను హైదరాబాద్ గచ్చిబౌలిలో 2004లో ఏర్పాటుచేశారు. టూరిజం, హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ, కన్సల్టెన్సీ, రిసెర్చ్ దీని ప్రధాన కర్తవ్యాలు.
- ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), బీబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్).
- వెబ్‌సైట్: http://nithm.ac.in

నిఫ్ట్ @ హైదరాబాద్

- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) హైదరాబాద్ క్యాంపస్‌ను 2001లో ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ. దేశంలో మొదటి క్యాంపస్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 క్యాంపసులు ఉన్నాయి. ఫ్యాషన్ ఎడ్యుకేషన్‌లో ఆధునిక సాంకేతికతను, సంప్రదాయ కళలను మేళవించి ప్రస్తుత కాలానికి అనుగుణమైన డిజైన్లను రూపొందించడం.. ఫ్యాషన్ రంగంలో ప్రొఫెషనల్స్‌ను తయారుచే యడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.

సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు:

- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ తదితర స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nift.ac.in

నేషనల్ పోలీస్ అకాడమీ

- హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీని 1948లో ప్రారంభించారు. 277 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ సివిల్ సర్వీసెస్ ద్వారా ఐపీఎస్ క్యాడర్‌కు ఎంపికైనవారికి శిక్షణనిస్తారు. దాంతోపాటు పోలీస్ వృత్తిలోని పలు క్యాడర్‌లకు వృత్త్యంతర శిక్షణనిస్తుంటారు.
- వెబ్‌సైట్: http://www.svpnpa.gov.in

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)

- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను హైదరాబాద్‌లో 1998లో ప్రారంభించారు. మాదాపూర్, హైటెక్‌సిటీలో దీన్ని ఏర్పాటుచేశారు. ఉపాధి అవకాశాలను కల్పించడం ప్రధాన లక్ష్యం .
- న్యాక్‌లో కన్‌స్ట్రక్షన్ టెక్నీషియన్స్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, కాంట్రాక్టర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, హౌజింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, వాటర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, కన్‌స్ట్రక్షన్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనే ప్రత్యేక విభాగాలు ఈ సంస్థలో ఉన్నాయి.
- ఆఫర్ చేస్తున్న కోర్సులు, శిక్షణలు: పలు స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్, పలు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://nac.edu.in

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్

- ఇది అటామిక్ ఎనర్జీ పరిధిలోనిది. దీన్ని 1945లో ఏర్పాటుచేశారు. హైదరాబాద్ క్యాంపస్ టీఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్. నేచురల్ సైన్సెస్, ఇంజినీరింగ్ బ్రాంచీల్లో పరిశోధన కోసం దీన్ని ప్రారంభించారు.
- అందిస్తున్న కోర్సులు: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (బయాలజికల్ ఫిజిక్స్, మెకానో- బయాలజీ (Mechano -biology), సెల్ & క్యాన్సర్ బయాలజీ, ఫ్లూయిడ్ డైనమిక్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ & ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్, మాలిక్యులార్ జెనెటిక్స్, ఎన్‌ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, సాఫ్ట్ మ్యాటర్, సింథటిక్ కెమిస్ట్రీ, థియరిటికల్ కెమిస్ట్రీ & ఫిజిక్స్ విభాగాలు ఉన్నాయి.
- ఎంపిక: టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్, గేట్, జామ్, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా
- వెబ్‌సైట్: https://www.tifrh.res.in

సిఓడి

- 1980లో దీన్ని నాన్ ప్రాఫిట్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఏర్పాటుచేశారు. ప్రముఖ విద్యావేత్త డా.బీఎల్.మహేశ్వరి ఈ సంస్థ ఫౌండర్ చైర్మన్. 1990లో క్యాంపస్‌ను అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ప్రారంభించారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, రిసెర్చ్ తదితర ప్రోగ్రామ్స్‌ను ఈ సంస్థ అందిస్తుంది.
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.codhyd.org చూడవచ్చు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.