Telangana




సెక్షన్ 377: సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమని చెప్పే సెక్షన్ 377 ఐపీసీలోని 16వ అధ్యాయంలో ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ సొడొమీ చట్టం (బగ్గరీ యాక్ట్- 1533) ఆధారంగా 1838లో థామస్ మెకాలే రూపొందించారు. ఇది 1861లో అమల్లోకి వచ్చింది.


కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ఈ అవార్డును ప్రకటించారు.తెలంగాణ అసెంబ్లీ రద్దు
తెలంగాణ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీచేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేసింది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2 (B) ప్రకారం శాసనసభను రద్దుచేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.హైదరాబాద్‌లో ఫైటర్ జెట్ రెక్కల తయారీ
హైదరాబాద్‌లో ఎఫ్-16 ఫైటర్ జెట్‌ల రెక్కల తయారీని చేపట్టనున్నట్లు అమెరికాకు చెందిన రక్షణ, ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ లాఖీడ్ మార్టిన్ సెప్టెంబర్ 4న వెల్లడించింది. ఇందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. 2020 చివరి నుంచి ఈ ఫైటర్ జెట్‌ల రెక్కల ఉత్పత్తి ప్రారంభంకానుంది.సింగరేణికి ఎక్సలెన్స్ పురస్కారం
సింగరేణి సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ పర్ఫామెన్స్ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న జరిగిన కోల్ ఇండియా సమ్మిట్-2018 సదస్సు ముగింపు కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డులను మైనింగ్ జియోలాజికల్ అండ్ మెటలర్జికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎంజీఎంఐ) ప్రకటిస్తుంది.ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ర్టానికి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వనరులు కల్పించినందుకుగాను కేంద్రం తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శ్యామాప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకాన్ని అమలుచేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతులు కల్పించి, వలసలను నియంత్రించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో దాదాపు 350 గ్రామాలను 16 క్లస్టర్లుగా విభజించి మూడు దశల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ఈ పనుల నిర్వహణలో మెరుగ్గా ఉన్న మూడు రాష్ర్టాలను ఉత్తమ రాష్ట్రం పురస్కారానికి ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ కూడా ఉంది.వారసత్వ నిర్మాణాలు
రాష్ట్రంలోని రెండు చెరువులకు జాతీయ వారసత్వ నిర్మాణాల గుర్తింపు లభించింది. 127 ఏండ్లుగా సేవలందిస్తున్న సదర్‌మాట్ ఆనకట్ట, 121 ఏండ్లుగా ప్రజల్ని ఆదుకుంటున్న కామారెడ్డి పెద్దచెరువులు ఈ ఘనత సాధించాయి. ఈ రెండింటిని వారసత్వ సాగునీటి నిర్మాణాలు (హెచ్‌ఐఎస్) అవార్డుకు ఎంపికచేసినట్టు కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్ హరేంద్రసింగ్.. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (పరిపాలన) బీ నాగేంద్రరావుకు లేఖ రాశారు. గతనెల 12 నుంచి 17 వరకు కెనడాలోని సస్కటూన్‌లో జరిగిన 69వ ఐఈసీ సమావేశంలో వీటిని ఎంపికచేశారు. Persons
అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం
2018కి గాను కాళోజీ పురస్కారం ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ అందుకున్నారు. కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 9న ఈ పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రదానం చేస్తున్నది. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన 32 నవలలు, 100 కథలు రాశారు. 2004లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని అందుకున్నారు.పల్సర్ జోసలీన్‌కు రూ. 21 కోట్లు
ఆకాశంలో అత్యధిక అయస్కాంత శక్తితో కూడిన అణుతారలు (పల్సర్స్) పరిభ్రమిస్తున్నట్లు కనుగొన్న బ్రిటిష్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జోసలీన్ బెన్ బర్నెల్ ప్రతిష్ఠాత్మక స్పెషల్ బ్రేక్ త్రూ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. 1968లో ఆమె ఈ పరిశోధన చేశారు. దీంతో ఈ బహుమతి గెలుచుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, చైనీస్ ఎకోసిస్టం రిసెర్చ్ నెట్‌వర్క్ (సెర్న్) పరిశోధకుల సరసన నిలిచారు. ఈ బహుమతి కింద ఆమెకు రూ. 21 కోట్లు నగదు లభించింది.కపిల్ సిబల్ షేడ్స్ ఆఫ్ ట్రూత్
కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ రాసిన షేడ్స్ ఆఫ్ ట్రూత్ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సెప్టెంబర్ 7న విడుదల చేశారు.యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా అమితాబ్
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు తదుపరి సీఈఓ, ఎండీగా అమితాబ్ చౌదురి నియమితులయ్యారు. ఆయన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుత సీఈఓ శిఖా శర్మ ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.ఎస్‌బీఐ ఎండీగా అన్షులా
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అన్షులా కాంత్ నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో 2020, సెప్టెంబర్ 30 దాకా కొనసాగనున్నారు. International
పాక్ అధ్యక్షుడిగా ఆరిఫ్
పాకిస్థాన్ 13వ అధ్యక్షుడిగా డాక్టర్ ఆరిఫ్ అల్వీ సెప్టెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ పదవిలో మమ్నూన్ హుస్సేన్ కొనసాగారు. ఆరిఫ్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.పురాతన మ్యూజియం దగ్ధం
బ్రెజిల్‌లోని 200 ఏండ్ల నాటి ప్రఖ్యాత నేషనల్ మ్యూజియం సెప్టెబర్ 2న దగ్ధమైంది. రియోడీజనీరోలో ఉన్న ఈ మ్యూజియాన్ని 1818లో అప్పటి రాజు ఆరో జొవావో ప్రారంభించారు. ఇందులో దాదాపు 2 కోట్లకుపైగా వస్తువులు ఉన్నాయి. వాటిలో గ్రీకు, రోమన్ కాలాల నాటి, ఈజిప్టు ప్రాచీన కళాఖండాలు, మానవుడికి సంబంధించిన అతిపురాతన శిలాజం, డైనోసార్ శిలాజం, బ్రెజిల్‌లో గుర్తించిన అతిపెద్ద గ్రహశకలం బెండిగో ఉన్నాయి. క్రీ.శ. 1500లలో పోర్చుగీసువారు బ్రెజిల్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచి 1889లో బ్రెజిల్ దేశం ఏర్పడే వరకు అనేక వస్తువులు ఉన్నాయి. ఇందులోని లైబ్రరీలో దాదాపు 4.7 లక్షల గ్రంథాలు, 2,400 అరుదైన పుస్తకాలు ఉన్నాయి. National
భారత్‌కు అమెరికా రక్షణ సాంకేతికత
రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞాన్ని అమెరికా భారత్‌కు సమకూర్చేందుకు ఉద్దేశించిన కామ్‌కాసా (కమ్యూనికేషన్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్) ఒప్పందంపై సెప్టెంబర్ 6న ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దీంతో అమెరికా నుంచి భారత్ అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలను కొనుగోలు చేయడంతోపాటు ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకోవచ్చు.స్వలింగ సంపర్కం నేరం కాదు
వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం గానీ, స్త్రీ-పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య గానీ నేరం కాదని సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో స్వలింగ సంపర్కం నేరమని తెలుపుతున్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు వ్యతిరేకంగా 17 ఏండ్లుగా జరుగుతున్న న్యాయపోరాటానికి తెరపడింది. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జండర్, క్వీర్ (ఎల్‌జీబీటీక్యూ)లు దేశంలో మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులు పొందవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. దీంతో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రస్తుతం 120 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే 71 దేశాల్లో నేరంగా పరిగణిస్తున్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, యూఏఈ, ఖతార్, మౌరిటానియాలో ఇలాంటివారికి మరణ శిక్ష విధించేలా చట్టాలున్నాయి. 2015లో అమెరికా గే వివాహాలను చట్టబద్ధం చేసింది.సెక్షన్ 377: సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమని చెప్పే సెక్షన్ 377 ఐపీసీలోని 16వ అధ్యాయంలో ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ సొడొమీ చట్టం (బగ్గరీ యాక్ట్- 1533) ఆధారంగా 1838లో థామస్ మెకాలే రూపొందించారు. ఇది 1861లో అమల్లోకి వచ్చింది.
అక్టోబర్ 2 నుంచి నల్సా అమలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయాసేవల సంస్థ (నల్సా) రూపొందించిన పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథక అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న ఆదేశించింది. నిర్భయ ఘటనానంతరం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో నల్సా సూచించిన దానికంటే ఎక్కువ పరిహారం ఇవ్వచ్చు కానీ తక్కువ ఇవ్వకూడదని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.Sports