Type Here to Get Search Results !

Vinays Info

Questions and Answers About GST(Good and Service Tax)

Top Post Ad

01) మన దేశంలో GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ) గురించిన ప్రస్తావన తొలిసారిగా ఏ బడ్జెట్ లో వచ్చింది ?
జ: 2010
02) 2010లో ఎవరి అధ్యక్షతన GST కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు ?
జ: నందన్ నీలేకని
03) జీఎస్టీ బిల్లుకు లోక్ సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2015 మే 6
04) GST బిల్లుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2016 ఆగస్టు 3
05) జీఎస్టీ బిల్లుకు 16 రాష్ట్రాల ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు ?
జ: 2016 సెప్టెంబర్ 2 నాడు
06) GST రూపొదించడానికి ఎవరి నాయకత్వంలోని పార్లమెంట్ స్థాయీ సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేసింది ?
జ: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా
07) GST విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఎంపవర్ కమిటీ ఛైర్మన్లుగా ఎవరెవరు వ్యవహరించారు ?
జ: జమ్మూకశ్మీర్ ఆర్థికమంత్రి అబ్దుల్ రహీవ్, బీహార్ మంత్రి సుశీల్ మోదీ, కేరళ మంత్రి కేఎం మణి, పశ్చిమబెంగాల్ మంత్రి అమిత్ మిత్రా
08) GST కౌన్సెల్ ఇప్పటివరూ ఎన్నిసార్లు సమావేశమైంది ?
జ: 18 సార్లు
09) GST ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: జులై 1 (ఉదయం 12.00 గంటల నుంచి)
10) జే గంట మోగించి జీఎస్టీని ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ
11) దేశంలో జీఎస్టీ అమలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది ?
జ: 1986-87లో
12) ప్రస్తుతం జీఎస్టీని ప్రపంచంలో ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి ?
జ: 160 దేశాలు
13) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేసిన జులై 1ని GST దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే ఏ కార్యలయాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు ?
జ: CBEC (Central Board of Excise & Customs)
14) దేశంలో జీఎస్టీ అమలులో లేని ఒకే ఒక రాష్ట్రం ఏది ?
జ: జమ్ము కశ్మీర్
15) రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గతంలో 12 శాతం పన్నుల పరిధిలోని ఉన్న ఎరువులను ఎంత శాతానికి తగ్గించారు ?
జ: 5శాతం
(నోట్: ట్రాక్టర్ల విడిభాగాలు 28 నుంచి 18శాతానికి తగ్గింపు)
16) బంగారం మీద గతంలో అన్ని పన్నులు కలుపుకొని 12 శాతంగా ఉండేవి. ఇప్పుడు GST ఎంతకు పెరిగింది ?
జ: 14 శాతం
17) ఎలక్ట్రానిక్స్ మీద ప్రస్తుతం 28 శాతం GST పన్నులు ఉండగా గతంలో ఎంత ఉండేవి ?
జ: 23 శాతం
18) GST రూపురేఖల్ని తయారు చేయడాని 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఏబీ వాజ్ పేయి ఎవరి నాయకత్వంలో కమిటీని వేశారు ?
జ: పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అసిమ్ దాస్ గుప్తా
19) 2003లో వాజ్ పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణలను స్పీడప్ చేయడానికి ఎవరి నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది ?
జ: విజయ్ కేల్కర్
(నోట్: 12వ ఆర్థిక సంఘం సూచించినట్టు GSTని తీసుకురావాలని కేల్కర్ కమిటీ 2005లో సిఫార్స్ చేసింది )
20) GST అమలు కోసం 2011లో ఎవరి ప్రభుత్వం లోక్ సభలో 115 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ?
జ: మన్మోహన్ సింగ్ సర్కార్
(నోట్: బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో పాటు కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి )
21) GST పన్నుల విధింపు, అమలు విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది ?
జ: జీఎస్టీ మండలి ( ఇందులో నాలుగింట మూడు వంతుల మంది ఓకే చెప్పాలి)
22) జీఎస్టీ మండలిని రాజ్యాంగంలో సవరించిన ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు ?
జ: 279 ఎ(1)
23) GST మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
జ: కేంద్ర ఆర్థిక మంత్రి
24) రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్లు నిర్ణయం, ఆయా రాష్ట్రాల్లో రేట్ల విషయంలో నిబంధనల అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు ?
జ: జీఎస్టీ మండలి
25) జీఎస్టీ అమలుతో 2017-18 సంవత్సరానికి వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది ?
జ: 7.5 శాతం
(నోట్: 2018-19 నాటికి 8 శాతం వృద్ధి రేటు ఉంటుందని భావిస్తున్నారు)
26) GST అమలుతో వచ్చే ఏడాదికి వృద్ధి రేటు ఎంత ఉంటుందని IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి) అంచనా వేసింది ?
జ: 8శాతానికి పైగా
27) ఒకే దేశం – ఒకటే పన్ను కింద వచ్చిన GST లో మొత్తం ఎన్ని ట్యాక్స్ శ్లాబులు ఉన్నాయి ?
జ: నాలుగు ( 5,12,18,28 శాతం )
28) GST కింద నాలుగు శ్లాబులు మాత్రమే ఉంటున్నా ఏ వస్తువుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా 3 శాతం జీఎస్టీ రేటును ప్రతిపాదించారు ?
జ: బంగారం, బంగారు ఆభరణాలు
29) జీఎస్టీ కోసం ఆన్ లైన్ ఫైలింగ్, రిజిష్ట్రేషన్, ఇలా అన్ని పనులూ కంపూటర్ల ద్వారానే చేసే విధానాన్ని ఏమంటారు ?
జ: GST NETWORK
30) జీఎస్టీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. అదే GST NETWORK. దీన్ని ఏ చట్టం కింద లాభాపేక్ష లేని కంపెనీగా నెలకొల్పారు ?
జ: కంపెనీల చట్టలోని సెక్షన్ 25 కింద
31) లాభాపేక్ష లేని ప్రైవేట్ రంగ కంపెనీగా GST నెట్ వర్క్ ను రూపొందించారు. అయితే ఇందులో కేంద్ర, రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఉంది ?
జ: కేంద్ర, రాష్ట్రాలు ఒక్కొక్కరికి 24.5 శాతం చొప్పున మొత్తం 49శాతం
31) లాభాపేక్ష లేని ప్రైవేట్ రంగ కంపెనీగా GST నెట్ వర్క్ ను రూపొందించారు. అయితే ఇందులో కేంద్ర, రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఉంది ?
జ: కేంద్ర, రాష్ట్రాలు ఒక్కొక్కరికి 24.5 శాతం చొప్పున మొత్తం 49శాతం
32) GST NET WORK ప్రేవేట్ కంపెనీలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు 11 శాతం వాటా ఉంది ?
జ: LIC హౌసింగ్ ఫైనాన్స్ 11 శాతం
(నోట్: మిగతా HDFC, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, NSE స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ కు ఒక్కోసంస్థకు 10శాతం చొప్పున వాటాలు ఉన్నాయి )
33) జీఎస్టీ నిబంధనల ప్రకారం ఏదైనా వస్తువు లేదా సేవపై పన్ను తగ్గినా లేదా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినా ఆ వస్తువు లేదా సేవ ధర తగ్గాలి. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే విధానాన్ని ఏమంటారు ?
జ: యాంటీ ప్రాఫిటరీంగ్
34)జీఎస్టీలో ఏదైనా రాష్ట్రంలో ఒక వ్యక్తికి స్థిర నివాసం లేకుండా అక్కడ అప్పుడప్పుడూ వస్తువులు సరఫరా చేసినా, సేవలు అందించినా అతన్ని ఏమని పిలుస్తారు ?
జ: క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్
35)వ్యాపారంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు, సేవలు లేదా రెండూ కలిపి అందిస్తే దాన్ని ఏమంటారు ?
జ: కాంపోజిట్ సప్లయ్
36) ఎవరైనా డీలర్ కస్టమర్ల నుంచి పన్నులు వసూలు చేయకుండా దాన్ని రాయితీ రేటుపై చెల్లించడానికి సిద్ధపడినా, కొనుగోళ్ళపై చెల్లించిన పన్నును సెటాఫ్ చేసుకున్నా అతనని ఏమంటారు ?
జ: కాంపోజిషన్ డీలర్
37) జీఎస్టీలో వస్తువులు లేదా సేవలపై ట్యాక్స్ కట్టాల్సింది సరఫరాదారు. అలా కాకుండా వాటిని అందుకున్న వ్యక్తి గనకు ఆ పన్ను చెల్లిస్తే వాటిని ఏమంటారు ?
జ: రివర్స్ చార్జీలు
38) ఎగుమతులు, సెజ్ యూనిట్లకు, సెజ్ డెవలపర్స్ కి చేసిన సరఫరాలన్నీ దేని కిందకి వస్తాయి ?
జ: జీరో రేటెడ్ సరఫరాలు
39) విడివిడిగా అందించాల్సిన వస్తువులను కలిపి ఒకే ధరకు ప్యాకేజీగా అందిస్తారు. దీన్ని Mixed supply అంటారు. అయితే వీటిల్లో మొత్తం సరఫరాపై పన్ను ఎలా నిర్ణయిస్తారు ?
జ: ఏ వస్తువు పన్ను ఎక్కువగా ఉంటే ఆ ట్యాక్సే
40) జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య గానీ, వ్యాపారులు, ప్రభుత్వానికి మధ్య గానీ వివాదాలు తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారు ?
జ: జీఎస్టీ మండలి ఆధ్వర్యంలోని యంత్రాంగం
41) దేశంలో ఒక వస్తువు లేదా సేవపై పన్ను తగ్గించాలన్నా, పెంచాలనుకున్నా అది జీఎస్టీ కౌన్సిల్ కే సాధ్యం. అయితే ఈ రేట్లను ఎవరు నోటిఫై చేయాలి ?
జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
42) జీఎస్టీ మండలిలో ఎంతమంది సభ్యులు హాజరైతే కోరం గా పరిగణిస్తారు ?
జ: సగం మంది సభ్యులు
43) జీఎస్టీ అమలుతో కొన్ని రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది. అయితే ఈ ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానిక ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ?
జ: 2015-16
(నోట్: 14 శాతం వృద్ధిని పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు )
44) ఎన్నిరకాల వస్తువులపై పన్ను తగ్గించాలని తెలంగాణ సర్కార్ సిఫార్సు చేసింది ?
జ: 35 రకాల వస్తువులు
45) జీఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఎన్ని రకాల వస్తువులపై పన్నులు తగ్గించాలని డిమాండ్స్ వచ్చాయి ?
జ: 145 వస్తువులు
46) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను ఇకపై ఏ శాఖగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: తెలంగాణ వస్తు సేవల పన్నుల శాఖ (GST శాఖ)
47) GST అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులను ఎత్తివేయనున్నారు ?
జ: 19 చెక్ పోస్టులు
48) ఇప్పటి వరకూ వస్తు తయారీపై కేంద్రం పన్ను వేసేది. అమ్మకంపై రాష్ట్రం పన్ను వేసేది. రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలు జరిగితే ఏ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది ?
జ: కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్
49) జీఎస్టీ అమలుతో కేంద్ స్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని ? అవి ఏవి ?
జ: 5
(నోట్: కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ( CVD), ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను)
50) GST అమలుతో రాష్ట్రస్థాయిలో రద్దయ్యే పన్నులు ఎన్ని ?
జ: 8 రకాల పన్నులు
(నోట్: రాష్ట్ర వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ పన్ను, వినోద పన్ను, ప్రకటనలపై పన్ను, కొనుగోలు పన్ను, లాటరీల పందెం, జూదంపై పన్ను )
51) జులై1 నుంచి దేశంలోని అన్ని రకాల వస్తువులూ GST పరిధిలోకి వచ్చాయి. అయితే ఇంకా రాని పన్నులు ఏంటి ?
జ: మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు (ముడి చమురు, డీజిల్, సహజ వాయవు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్), విద్యుత్
52) మనదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో (GDP) లో పన్నుల ఆదాయం వాటా 16శాతంగా ఉంది. GST అమలుతో GDP లో పన్నుల వాటా ఎంత ఉండొచ్చని భావిస్తున్నారు ?
జ: 20శాతం
53) స్థూల జాతీయోత్పత్తి (GDP)లో పన్నుల ఆదాయం వాటా ఎక్కువగా ఉన్న దేశాలు ఏవి ?
జ: అమెరికా, బ్రెజిల్ లో 35 శాతం
54) 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా GST ని అమలు చేసిన దేశం ఏది ?
జ: ఫ్రాన్స్
55) మనదేశంలో లాగే జీఎస్టీ విషయంలో ద్వంద్వ విధానం అవలంభిస్తున్న దేశం ఏది ?
జ: కెనడా (1981లో ప్రవేశపెట్టింది )
56) ప్రపచంలో జీఎస్టీ అమలులో లేని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏ దేశంలో ఉంది ?
జ: అమెరికా
(నోట్: ఇక్కడ పన్నురేట్లపై రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది )
57) ప్రపంచంలో ఎక్కువ వస్తువులు లేదా సేవలపై ఎక్కువ పన్ను 18శాతం ఏ దేశంలో అమల్లో ఉంది ?
జ: భారత్
58) ప్రపంచంలో GST లో ఎక్కువ పన్నుశాతం శ్లాబ్ కలిగిన దేశం ఏది ?
జ: బ్రెజిల్ ( 4- 25 శాతం )
59) జీఎస్టీ అమలులోకి తెచ్చేందుకు NDA సర్కార్ 2014 లో లోక్ సభలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు ?
జ: 122 వ రాజ్యాంగ సవరణ
60) జీఎస్టీ అమలు ప్రారంభోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జూన్ 30 అర్థరాత్రి నుంచి నిర్వహించారు. అయితే ఇప్పటివరకూ ఇక్కడ ఎన్నిసార్లు ఇలా అర్థరాత్రి సమావేశాలు జరిగాయి ?
జ: నాలుగు సార్లు
(నోట్: స్వాతంత్ర్యం వచ్చినప్పుడు (1947), 25 యేళ్ళకి (1972 లో), 50యేళ్ళ స్వర్ణోత్సవం (1997), జీఎస్టీ బిల్లు ప్రారంభోత్సవం(2017).

నోట్ : మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.