1) జీవశాస్త్రానికి బయాలజీ పదాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జ: జీన్ లామార్క్ ( ఫ్రెంచ్ శాస్త్రవేత్త )(1809).
2) బయాలజీ అనేది ఏ పదం ? దాని అర్దం ఏంటి?
జ: బయాలజీ అనేది గ్రీకు పదం. బయో అంటే జీవం, లోగోస్ అనగా శాస్త్రం
3) జీవ శాస్త్ర పితా మహుడు, వృక్షశాస్త్ర పితా మహుడు ఎవరు?
జ.అరిస్టాటిల్ (జీవశాస్త్రం), థియో ఫ్రాస్టస్ ( వృక్షశాస్త్రం)
4) సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరు?
జ: లూయి పాశ్చర్
5) టాక్సానమీ అంటే ఏంటి ? ఈ పదాన్ని సూచించింది ఎవరు ?
జ: జీవుల పోలికలను బట్టి గుర్తించడం, దానికి పేరు పెట్టడం, వర్గీకరించడాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ పదాన్ని సూచించింది APD కండోల్ (ఫ్రెంచ్ శాస్త్రవేత్త).
6) జీవులను వర్గీకరించాలన్న ప్రతిపాదనను మొదట తెచ్చింది ఎవరు ?
జ: అరిస్టాటిల్
7) అరిస్టాటిల్ రాసిన గ్రంథమేది ? అందులో జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ?
జ: హిస్టోరియా యానిమాలియమ్. ఈ గ్రంథంలో జంతువులను 2రకాలుగా వర్గీకరించారు. 1) అకశేరుకాలు 2) సకశేరుకాలు
8) వర్గీకరణకు మూల ప్రమాణమైన జాతి పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ?
జ: జాన్ రే
9) వేపపై పేటెంట్ కలిగిన దేశం ఏది ?
జ: భారత్
10) వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: కెరోలస్ లిన్నేయస్ (Father of Taxonomy)
11) భారతీయ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: హెచ్.శాంతాపే
12) ద్వినామీకరణం అంటే ఏంటి ? దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
జ: ప్రజాతి (Genus), జాతి(Species) లిన్నేయస్ ( గ్రంథం: సిస్టమా ఇన్ నాచురే)
13) ముఖ్యమైన జంతువులు/పక్షులు – వాటి శాస్త్రీయ నామాలు
1) మానవుడు – హోమోసెపియన్
2) పులి (జాతీయ జంతువు) – పాంథెరా టైగ్రిస్
3) నెమలి (జాతీయ పక్షి ) – పావో క్రిస్టేటస్
4) మర్రి (జాతీయ వృక్షం) – ఫైకస్ బెంగాలెన్సిస్
5) మచ్చల జింక (తెలంగాణ రాష్ట్ర జంతువు) – ఆక్సిస్ ఆక్సిస్
6) తామర (జాతీయ పుష్పం) – నీలంబో న్యూసిఫెరా
7) మామిడి (జాతీయ ఫలం) – మాంజిఫెరా ఇండికా
8) జమ్మి చెట్టు (తెలంగాణ