ఆమ్లాల ధర్మాలు
రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా
ఆమ్లాల ధర్మాలను ప్రతిపాదించాడు. అవి..
ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి.
నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి.
*💥ఆమ్లాల తయారీ:
అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల ధర్మం ఉంటుంది. వీటిని నీటిలో కరిగిస్తే సంబంధిత ఆమ్లాలు ఏర్పడతాయి.
గమనిక:
H2SO4కి వాసన, రంగు ఉండవు.
HNO3Mకి వాసన, పసుపు రంగు ఉంటాయి.
వివిధ పదార్థాలు/ఫలాల్లో ఉండే ఆమ్లాలు
పదార్థం/ ఫలం ఉండే ఆమ్లం
పత్తి లినోలిక్ ఆమ్లం
వేరుశనగ ఆరాఖిడోనిక్ ఆమ్లం
ఉసిరి, విటమిన్స్ ఆస్కార్బిక్ ఆమ్లం
సిట్రస్/నిమ్మజాతులు సిట్రిక్ ఆమ్లం
ఆపిల్ మాలిక్ ఆమ్లం
చింతపండు టార్టారిక్ ఆమ్లం
పుల్లని పెరుగు, పాలు లాక్టిక్ ఆమ్లం
ద్రాక్ష (వెనిగర్) ఎసిటిక్ ఆమ్లం
ఎర్రచీమ ఫార్మిక్ ఆమ్లం
జఠర రసం హైడ్రోక్లోరికామ్లం
మూత్రం యూరికామ్లం
టమాట,పుచ్చకాయ ఆక్జాలిక్ ఆమ్లం
కొబ్బరి కాప్రిక్, కాప్రోయిక్ ఆమ్లం
మొక్కల నూనెలు స్టియరిక్, పామిటిక్
ఆమ్లం పాలు, పాల ఉత్పత్తులు బ్యుటిరిక్ ఆమ్లం
*💥ఆమ్లాల ప్రాముఖ్యత💥*
*💥1.సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4):*
దీన్ని రసాయనాల రాజు, ‘ఆయిల్ ఆఫ్ విట్రియోల్’గా పిలుస్తారు.
పేలుడు పదార్థాలు, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్, నూనె, చక్కెర శుద్ధిలో ఉపయోగిస్తారు.
ఆమ్ల వర్షాలకు ఇదే ప్రధాన కారణం.
*💥2.హైడ్రోక్లోరికామ్లం(HCl ):*
గ్లూ, జిలాటిన్, డెక్స్ట్రోస్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) తయారీ, లోహాల శుద్ధిలో ఉపయోగిస్తారు.
హైడ్రోక్లోరికామ్లం..నత్రికామ్లంతో (HNO3) చర్య జరిపినప్పుడు ఆక్వారీజియా (ద్రవరాజం) ఏర్పడుతుంది. దీన్ని బంగారం కరిగించేందుకు ఉపయోగిస్తారు.
*💥3.నత్రికామ్లం (HNO3)*
దీన్ని ఆక్వాఫోర్టిస్ అంటారు.
బంగారు ఆభరణాల పరిశ్రమలో ద్రావణి గా, ఫెర్టిలైజర్స్, పేలుడు పదార్థాలు (డైన మైట్), పిక్రిక్ ఆమ్లం, ట్రైనైట్రోటోలీన్ (టీఎన్టీ)ల తయారీలో వాడతారు.
*💥4.ఎసిటిక్ ఆమ్లం (CH3COOH)*
రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా సెల్యులోజ్ ఎసిటేట్ ఉత్పత్తిలో వాడతారు.
ద్రాక్షను పులియబెట్టి దీన్ని ఉత్పత్తి చేస్తారు.
*💥5.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం (HF):*
రిఫ్రెజిరెంట్స్, కొన్ని ప్లాస్టిక్ల తయారీలో వాడతారు.
గాజుపై అక్షరాలు రాయడానికి వాడతారు.
*💥6. సిట్రిక్ ఆమ్లం:*
సాఫ్ట్ డ్రింక్స్ (కోలా పానీయాలు)ను నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది
*నోట్:* గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గాఢ నత్రికామ్లాలను 3:1 నిష్పత్తిలో కలిపితే ఏర్పడే ద్రావణాన్ని ఆక్వరీజియా అంటారు.
*🔴క్షారాలు క్షారాల ధర్మాలు:*
క్షారాల ధర్మాలను తొలిసారిగా రౌలే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి.
ఎర్ర లిట్మస్ను నీలి రంగుకు మారుస్తాయి.
తాకితే జారిపోయే స్వభావం ఉంటుంది.
నారింజ రంగులోని మిథైల్ ఆరంజ్ సూచికను పసుపు రంగుకు మారుస్తాయి.
వీటిని అమ్మోనియం లవణాలతో వేడి చేస్తే అమ్మోనియా వాయువు వెలువడుతుంది.
*క్షారాల ప్రాముఖ్యం*
1.సోడియం హైడ్రాక్సైడ్
దీన్ని కాస్టిక్ సోడా (దాహక సోడా) అని కూడా పిలుస్తారు. *ఉపయోగాలు:*
నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేం దుకు ఉపయోగపడుతుంది.
రేయాన్, సబ్బు, పేపర్, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
*💥2.కాల్షియం హైడ్రాక్సైడ్:*
దీన్ని ‘మిల్క్ ఆఫ్ లైమ్ (తడిసున్నం)’ అంటారు.
*ఉపయోగాలు:*
నేలల ఏను పెంచేందుకు ఉపయోగపడుతుంది.
కీటక నాశకాల తయారీలో వాడతారు.
నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించేందుకు వినియోగిస్తారు.
ఇళ్లకు సున్నం వేయటానికి వాడతారు.
*3.పొటాషియం హైడ్రాక్సైడ్:*
దీన్ని కాస్టిక్ పొటాష్ అంటారు.
*తటస్థీకరణం*
ఆమ్లం.. క్షారంతో కలిసి జలద్రావణంలో నీరు ఏర్పడే చర్యను తటస్థీకరణం అంటారు. ఒక లవణం ఏర్పడాలంటే తప్పనిసరిగా ఒక ఆమ్లం, క్షారం కావాలి.తటస్థీకరణ చర్య ఎప్పుడూ ఉష్ణమోచక చర్యే.
*బలమైన ఆమ్లం..*
బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు అత్యధిక పరిమాణంలో ఉష్ణం విడుదలవుతుంది.
*బలహీన ఆమ్లం..*
బలహీన క్షారంతో చర్య జరిపినప్పుడు తక్కువ ఉష్ణం వెలువడు తుంది.
*ఉదా*: హైడ్రోక్లోరికామ్లం, సోడియం హైడ్రాక్సైడ్ లు రసాయన చర్యలో పాల్గొని సోడియం క్లోరైడ్ (ఉప్పు), నీరుగా మారతాయి.
HCl + NaOH ®NaCl+ H2O
*☮లవణాలు– ప్రాముఖ్యత*
*💥సోడియం క్లోరైడ్ (NaCl ):*
దీన్ని టేబుల్ సాల్ట్/ సామాన్య ఉప్పు అంటా రు. ఆహార రుచికి, నీటి శుద్ధికి దీన్ని ఉపయో గిస్తారు.
*పొటాష్ ఆలం(K2SO4. Al2 (SO4)3.24H2O)*
గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికినీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.
*💥మెర్క్యూరిక్ క్లోరైడ్ (HgCl2):*
దీన్ని ‘కాలోమెల్’ అంటారు. నిద్రమాత్రల తయారీకి ఉపయోగిస్తారు.
సోడియం థయోసల్ఫేట్/హైపో
ఇది దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ను తొలగిస్తుంది. దీన్ని ఫొటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్గా వాడతారు.
*💥సోడియం బై కార్బొనేట్ (NaHCO3)*
దీన్ని బేకింగ్సోడా/వంటసోడా అంటారు.
ఎసిడిటీని తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
*మెగ్నీషియం క్లోరైడ్ (MgCl2):*
ఇది కాటన్ పరిశ్రమలో పోగుల పటుత్వానికి, పగిలిన దంతాలకు సిమెంటేషన్కు తోడ్పడుతుంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్/కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్: సర్జికల్ బ్యాండేజ్ల తయారీకి, గోడల ప్లాస్టరింగ్కు వాడతారు.
*పొటాషియం నైట్రేట్:* దీన్ని బెంగాల్ సాల్ట్ పీటర్ అంటారు. గన్పౌడర్ తయారీలో వాడతారు
*🕉పొటాషియం అయోడైడ్ (ఓఐ):*
దీన్ని ఫొటోగ్రఫీలో వాడతారు.
*నోట్:*
ఆమ్లాలు, క్షారాలు రెండిటితో చర్య జరిపే పదార్థాన్ని ‘ఆంఫోటెరిక్’ అంటారు.
*ఉదా:*
అల్యూమినియం హైడ్రాక్సైడ్,
జింక్ హైడ్రాక్సైడ్ (Zn (OH)2)
రూపాంతరత
మూలకాలు ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్నే రూపాంతరత అంటారు.
*ఉదాహరణలు:*
*భాస్వరం:* ఇది తెల్లభాస్వరం, పచ్చభాస్వరం అనే రూపాంతరాలుగా లభిస్తుంది.
*💥కార్బన్*:
గ్రాఫైట్, వజ్రం, బొగ్గు తదితర రూపాంతరాల్లో లభిస్తుంది.
*వజ్రం:*
కార్బన్ రూపాంతరమైన వజ్రం చాలా దృఢమైన పదార్థం. దీని సాంద్రత
3.5 గ్రా/సెం.మీ3
èÜ్వచ్ఛమైన, ఎటువంటి మలిన పదార్థాలు లేని వజ్రం వర్ణరహితంగా ఉంటుంది.
వజ్రాన్ని గాలిలో 900నిఇ నుంచి∙1000నిఇ వరకు వేడి చేస్తే కార్బన్ డై ఆక్సైడ్గా మారుతుంది.
వజ్రాన్ని శూన్యంలో 1500నిఇ వరకు వేడి చేస్తే గ్రాఫైట్గా మారుతుంది.
కోహినూర్ వజ్రం 186 క్యారెట్లు, పిట్ వజ్రం 136.25 క్యారెట్లు
బ్రెజిల్లో నల్లటి వజ్రాలు లభిస్తాయి.
*🅾గ్రాఫైట్:*
ఫైట్ను నలుపు సీసం అంటారు.ñæడ్ పెన్సిల్లో గ్రాఫైట్ బంకమన్ను మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.
గ్రాఫైట్ పొరల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అందువల్లే దీన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఘర్షణను తగ్గించేందుకు కందెనగా ఉపయోగిస్తారు.
స్టౌవ్, కొలిమిలపై పూత పూసేందుకు గ్రాఫైట్ను ఉపయోగిస్తారు.
దీన్ని గాలిలో మండిస్తే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది.
అధిక ఉష్ణోగ్రత వద్ద కార్బన్ స్థిరమైన రూపాంతరం గ్రాఫైట్.
దీన్ని నీటిలో కలపగా ఏర్పడే ద్రావణాన్ని ఆక్వాడాగ్ అని పిలుస్తారు.
బక్మినిస్టర్ఫుల్లరీన్ (ఇ60)
ఇది కార్బన్ రూపాంతరం. బక్మినిస్టర్ ఫుల్లరీన్ 1985 నుంచి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఫుట్బాల్ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్ని కనుగొని, నిర్మాణంపై పరిశోధన చేసినందుకు హెచ్.డబ్లు్య.క్రోట్, రిచర్డ్.ఈ.స్మాలీలకు 1996లో రసాయ నశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.