Type Here to Get Search Results !

Vinays Info

Indian Union Budget 2017-18 full Information



బడ్జెట్ అనే పదం బౌగొట్టె అనే ఫ్రెంచి పదం నుంచి వచ్చింది. బౌగొట్టె అంటే తోలు సంచి అని అర్థం. క్రమంగా వాడకాన్నిబట్టి సంచి అనే అర్థం మాత్రమే కాకుండా సంచిలోని పత్రాలు అనే అర్థం వ్యక్తమవుతూ వచ్చింది. ఒక ఏడాదికి ప్రభుత్వ ఆదాయ, వ్యయ స్వరూపమే బడ్జెట్. రాజ్యాంగంలోని 112వ ప్రకరణ ప్రకారం లోక్‌సభలో ఆర్థికమంత్రి ప్రవేశపెడుతారు. దీన్నే వార్షిక నివేదిక లేదా వార్షిక ఆదాయ, వ్యయ పత్రం అంటారు. బడ్జెట్ అంటే ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తి ఉంటుంది. కార్మికులు, కర్షకులు ఇలా ప్రతి ఒక్కరు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే (జనవరి 31) ఆర్థికశాఖ 25వ మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ఉ. 11:00 గంటలకు రూ. 21.47 లక్షల కోట్ల ప్రతిపాదనతో 87వ వార్షిక బడ్జెట్ (జైట్లీకి వరుసగా నాలుగో బడ్జెట్)ను ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాలతో పోల్చితే నిధులపరంగా బడ్జెట్ విషయంలో భారత్ స్థానం 13వది. దేశంలో ఉత్తమమైన మార్పు తీసుకురావడం (ట్రాన్స్‌ఫామ్ - పాలనలో నాణ్యత, దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల), శక్తిమంతం చేయడం (సమాజంలో భిన్న వర్గాలు ముఖ్యంగా యువత, అట్టడుగువర్గాలకు సాధికారత చేకూర్చడం ద్వారా వారిలోని శక్తి సామర్థ్యాలను వెలికితీయడం), స్వచ్ఛమైన దేశంగా మార్చడం (క్లీన్ - అవినీతి, నల్లధనం, పారదర్శకత లోపించిన పార్టీల విరాళాల వంటి వాటి నుంచి దేశాన్ని బయటపడేయడం) తాజా బడ్జెట్ ఎజెండా అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 92 ఏండ్లుగా రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి (1924లో బ్రిటిష్‌వాళ్లు ప్రారంభించారు) 2017-18 వార్షిక బడ్జెట్‌తో స్వస్తిపలికింది.
ప్రణాళిక, ప్రణాళికేతర బఢ్జెట్‌లకు స్వస్తిపలకడం, 86 శాతం పెద్దనోట్ల రద్దు కారణంగా వీచిన ఎదురుగాలులు, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబించిన రక్షణాత్మక విధానాలను ఎదుర్కొనేలా ఆర్థిక వ్యవస్థను పదిలపర్చుకొనే చర్యలపై దృష్టి, బడ్జెట్ తర్వాత ప్రవేశపెడుతున్న కొత్త పన్నుల విధానాన్ని (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావడం, కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ విలీనం, బడ్జెట్ తేదీని ఒకనెల ముందుకు మార్చడం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్‌ను ఆమోదించడం లాంటివి 2017-18 వార్షికబడ్జెట్‌లో చోటుచేసుకున్న కొన్ని ప్రధాన మార్పులు. బ్రిటిష్ పాలనాకాలంలో మన దేశంలో తొలిసారి 1860, ఫిబ్రవరి 18న జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన సమయంలో జేమ్స్ విల్సన్ కలకత్తా వైశ్రాయ్ కౌన్సిల్‌లో ఆర్థికసభ్యుడిగా ఉన్నారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి 1947, నవంబర్ 26న బడ్జెట్‌ను ప్రవేశపెడితే, భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆర్థికమంత్రి జాన్ మథాయ్ 1950, ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది
[11/02, 7:28 a.m.] VINAY KUMAR: తాజా బడ్జెట్‌లో ధరలు పెరిగేవి
సిగరెట్లు, చుట్టలు, బీడీలు, సిగార్, పాన్ మసాలా (గుట్కా), పొగాకు ఉత్పత్తులు,ఎల్‌ఈడీ దీపాల విడిభాగాలు ,జీడిపప్పు,అల్యూమినియం ధాతువు,ఆప్టికల్ ఫైబర్‌లో ఉపయోగించే పాలిమర్ పూత ఉన్న ఎమ్మెస్ టేపులు వెండి నాణేలు, పతకాలు,సెల్‌ఫోన్‌లో వాడే సర్క్యూట్ బోర్డులు
ధరలు తగ్గేవి
సౌరశక్తి ఫలకాలు, ఘటకాల ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వ్యవస్థలు ,పవనశక్తితో పనిచేసే పరికరాలు ,ఆన్‌లైన్ రైల్వే టికెట్లు,ఇళ్లలో వాడే నీటిశుద్ధి పరికరాల విడిభాగాలు ,ద్రవీకృత సహజ వాయువు ,తోలుతో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని పీఓఎస్ యంత్రాలు/కార్డులు, వేలిముద్రల ఆధారంగా పనిచేసే యంత్రాలు'రక్షణ బలగాలకు వర్తించే సామూహిక బీమా ఐరిష్ స్కానర్లు, ఐరిష్ రీడర్లు
[11/02, 7:29 a.m.] VINAY KUMAR: ముఖ్యాంశాలు
-మొత్తం బడ్జెట్ రూ. 21.47 లక్షల కోట్లు
-వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
-రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం పన్ను
-పన్ను శ్లాబులు యధాతథం
-వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్యకార్డులు. 8 శాతం ఖాయమైన రాబడి వచ్చేలా ఎల్‌ఐసీ నూతన పథకం ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 వేలకు మించి విరాళాలు స్వీకరించకుండా రాజకీయ పార్టీలపై ఆంక్షలు
-ఏప్రిల్ 1 3 లక్షలు దాటిన నగదు లావాదేవిలపై నిషేధం రక్షణరంగ కేటాయింపులు రూ. 2.74 లక్షల కోట్లు
-2019 నాటికి కోటి ఇండ్ల నిర్మాణం
-కోటి కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి
-ఎలక్టోరల్ బాండ్ల జారీకి నిర్ణయం
1990 దశకంలో ఏర్పాటు చేసిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం సరళీకృతం
ఈ ఏడాది 3.2 శాతం తగ్గనున్న ద్రవ్యలోటు. వచ్చే ఏడాదికి మరో శాతం తగ్గొచ్చని అంచనా
ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచివెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ప్రత్యేక చట్టం
చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి చట్ట సవరణ
సామాన్యులకు ప్రయోజనం కలిగించే నగదురహిత చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడం. పెట్రోలు బంకులు, ఆస్పత్రుల్లో నగదురహిత చెల్లింపులకు ప్రోత్సాహం
త్వరలో వ్యాపారుల కోసం ఆధార్ అనుసంధానిత వ్యవస్థ
రెండు కొత్త పథకాలతో భీమ్ యాప్‌కు ప్రోత్సాహం
అక్రమ డిపాజిట్ల నిరోధానికి ప్రత్యేక బిల్లు
విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్ చానెల్ ఏర్పాటు. ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశపరీక్షలకు ఒకే సంస్థ
వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ విద్యుదీకరణ పూర్తి
గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా
జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా గృహ రుణాలిచ్చే బ్యాంకులకు 20 వేల కోట్ల రుణం
[11/02, 7:29 a.m.] VINAY KUMAR: ముద్ర రుణాల కోసం రూ. 2.44 లక్షల కోట్లు
మహిళాశక్తి కేంద్రాలుగా అంగన్‌వాడీలు
ఒడిశా, రాజస్థాన్‌లలో ముడి చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు
2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం. సామాన్యుడికి ఎన్నో లాభాలు, భీమ్ యాప్‌తో చెల్లింపులు పెరిగాయి. 25 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
రైల్వే బడ్జెట్‌కు రూ. 1.31 లక్షల కోట్లు కేటాయింపు
25 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
2020 వరకు కాపలాదారు లేకుండా చర్యలు. రైల్వే క్రాసింగ్‌ల మూసివేత
2017-18 లో కొత్తగా 3,500 కి.మీ.ల మేర రైళ్ల సర్వీసుల పొడిగింపు
[11/02, 7:31 a.m.] VINAY KUMAR: టెక్ ఇండియాకు 10 సూత్రాలు
రైతులు: ఐదేండ్లలో దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం
గ్రామీణ భారతం: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, కనీస మౌలిక సౌకర్యాల పెంపు
యువత: సరైన విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ద్వారా సాధికారత నెలకొల్పడం
పేద, వెనుకబడిన వర్గాలు: సామాజిక భద్రత, ఆరోగ్యరంగాలను బలోపేతం చేయడం. చౌకగా గృహాలను అందించడం ద్వారా పేద వెనుకబడిన వర్గాలకు తోడ్పాటు.
మౌలిక సదుపాయాలు: మరింత సమర్థవంతంగా, ఉత్పాదకత పెంచేలా, నాణ్యమైన జీవితం గడిపేలా మౌలిక సదుపాయాల కల్పన
ఆర్థిక రంగం: సమర్థవంతమైన సంస్థల ద్వారా ఆర్థిక అభివృద్ధి, సుస్థిరత సాధన
డిజిటల్ ఎకానమీ: వేగవంతమైన, పారదర్శక, జవాబుదారితనం పెంపొందించే వ్యవస్థ కోసం డిజిటల్ ఎకానమీకి ప్రోత్సాహం
పబ్లిక్ సర్వీస్: ప్రజల భాగస్వామ్యం ద్వారా ఉత్తమ పాలన, కేంద్రీయ రక్షణ రవాణా విధానం, ఆర్థిక నేరగాళ్ల విషయంలో కఠిన చట్టం.
సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ: సరైన రీతిలో వనరుల నిర్వహణ, ఆర్థిక స్థిరత్వాన్ని సంరక్షించుకోవడం కోసం తెలివైన ఆర్థిక నిర్వహణ.
పన్నుల నిర్వహణ: నిజాయితీగా పన్నులు చెల్లించే వారిని గౌరవించడం
[11/02, 7:32 a.m.] VINAY KUMAR: పారిశ్రామికరంగంలో వృద్ధిరేటు
2013-14 5 శాతం
2014-15 5.9 శాతం
2015-16 7.4 శాతం
2016-17 5.2 శాతం
2015-16లో ఐటీకి సంబంధించిన వివరాలు
మొత్తం రిటర్న్‌లు దాఖలు చేసింది - 3.7 కోట్ల మంది
పరిమితి లోపలే (రూ.2.5 లక్షలలోపు) ఉండి జీరో పన్ను చూపించినది - 99 లక్షలు
రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం చూపినది - 1.95 కోట్ల మంది
రూ. 5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం చూపినది - 52 లక్షలు
రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం చూపినది - 24 లక్షలు
రూ. 5 లక్షల పైబడి ఆదాయం చూపినది - 76 లక్షలు (ఇందులో ఉద్యోగులు 56 లక్షలు)
రూ. 50 లక్షల పైబడి ఆదాయం చూపినది - 1.72 లక్షలు సాగులోకి రానుంది.
రక్షణరంగం: రక్షణరంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 2,62,390 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే 6.2 శాతం పెరిగాయి. ఇందులో మాజీ సైనికుల పింఛన్లను ఇందులో జోడించలేదు. ఖర్చుచేసే ప్రతి రూపాయిలో రక్షణరంగం వాటా 9 పైసలు. మొత్తం కేటాయింపుల్లో ఆధునీకరణ, కొత్త ఆయుధాల కొనుగోలుకు రూ. 86,488 కోట్లు కేటాయించారు. రక్షణ సిబ్బంది పింఛన్లకు రూ. 85,737 కోట్లు కేటాయించారు. రక్షణరంగం కేటాయింపుల్లో అమెరికా, చైనా, బ్రిటన్‌ల తర్వాత భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. రక్షణరంగంలో స్వయంసమృద్ధి సాధించడం కోసం భారత్‌లో తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రక్షణరంగంలో మన అవసరాల కోసం 40 శాతం ఉత్పత్తి చేసుకుంటున్నాం. రాబోయే ఐదేండ్లలో 70 శాతం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాతీయ రహదారులు: జాతీయ రహదారుల నిర్మాణానికి 2017-18 వార్షిక బడ్జెట్‌లో రూ. 64,900 కోట్లు కేటాయించారు. 2016-17 వార్షిక బడ్జెట్‌తో పోల్చితే 12 శాతం అధికంగా కేటాయించారు. 2011-14 మధ్య రోజుకు 78 కి.మీ. రహదారులు నిర్మిస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 2016-17లో రోజుకు 133 కి.మీ. మేర రోడ్లను నిర్మించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ: గ్రామీణాభివృద్ధికి 2017-18 బడ్జెట్‌లో రూ. 48,000 కోట్లు కేటాయించారు.
[11/02, 7:33 a.m.] VINAY KUMAR: గత బడ్జెట్‌తో పోల్చితే 25 శాతం అధికంగా కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు ఉపాధి కల్పించడం కోసం 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి 55 శాతానికి చేరింది.
వైద్యం: తాజా బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ. 48,878 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే 27.76 శాతం అధికం. 2016-17 బడ్జెట్‌లో రూ. 39,879 కోట్లు కేటాయించారు. దేశ జీడీపీలో ఆరోగ్యరంగంపై 1.3 శాతం మాత్రమే వెచ్చిస్తున్నారు.
దీర్ఘకాలిక జబ్బుల బాధితుల్లో 2017 చివరి నాటికి కాలాఅజార, బోదకాలు, 2018లోపు కుష్టు, 2020 నాటికి తట్టు, 2025 చివరికి క్షయ వంటి వ్యాధులను నిర్ణీత కాల వ్యవధిలోగా నిర్మూలించాలని నిర్ణయించింది. 2014లో ప్రతి వెయ్యి జననాలకు 39గా ఉన్న శిశు మరణాలరేటును 2019 నాటికి 28కు తగ్గించడం, 2011-13లో ప్రతి లక్ష శిశు జననాలకు 167గా నమోదైన బాలింత మరణాల రేటును 2018-20 నాటికి 100కు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల ఆరోగ్య ఉపకేంద్రాలను ఆరోగ్య సంక్షేమ కేంద్రాలుగా రూపొందించనున్నారు.
స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించడానికి ఏటా అదనంగా 5 వేల పోస్టుగ్రాడ్యుయేట్ సీట్లు సృష్టించాలని, దేశంలో జనరిక్ ఔషధాలను ప్రోత్సహించేందుకు, ఔషధాలన్నీ అందుబాటు ధరల్లో ఉండేలా చేసేందుకు చర్యలు.
గత దశాబ్దంలో ఆరోగ్యరంగం-విజయాలు
సగటు ఆయుర్ధాయం 7 ఏండ్లకు పైగా పెరిగింది
శిశు మరణాలు రేటు సగానికి తగ్గింది
మాతృత్వ మరణాల రేటు 60 శాతానికి తగ్గింది
పోలియో నిర్మూలనలో విజయవంతం
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి నెమ్మదించింది
[11/02, 7:39 a.m.] VINAY KUMAR: మేక్ ఇన్ ఇండియా
పెట్టుబడులకు, ప్రపంచ తయారీరంగానికి భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2014లో తీసుకొనివచ్చిన పథకమే మేక్ ఇన్ ఇండియా. దీని మఖ్యఉద్దేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 25 విభాగాల్లో తయారీని బలోపేతం చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు దీని ద్వారా జరుగుతుంది. 2012-14ల మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లు ఉంటే మేక్ ఇన్ ఇండియా ప్రకటన తర్వాత ఇవి 62 శాతం వృద్ధితో రూ. 5.3 లక్షల కోట్లకు చేరాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికంగా సేవారంగానికి రూ. 46,969 కోట్లు వచ్చాయి. అత్యధిక వృద్ధి రేటుతో 2025 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం భారతదేశానికి ఉంది.
పట్టణాభివృద్ధి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నగరాల ప్రాజెక్టుకు ఈ వార్షిక బడ్జెట్‌లో రూ. 3,989.50 కోట్లు కేటాయించారు. దేశ వ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్‌సిటీ మిషన్‌ను 2015 జూన్ 25న ప్రారంభించారు. 2016-17 రూ. 3205 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 3,989.50 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 60 నగరాలను ఎంపిక చేశారు.
దేశంలో నగరాలు, పట్టణాలు 7,935 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది.
కరీంనగర్, వరంగల్ నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికచేయగా, అమృత్ పథకం కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
[11/02, 7:39 a.m.] VINAY KUMAR: రాయితీలు: 2017-18 బడ్జెట్‌లో ఆహారం, పెట్రోలియం, ఎరువులపై రాయితీల కోసం రూ. 2,40,338.6 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే ఇది 3 శాతం అధికం. మన జీడీపీలో బడ్జెట్ రాయితీల వాటా 1.44 శాతం. గత వార్షిక బడ్జెట్‌లో వీటి వాటా 1.5 శాతంగా ఉంది.
ఆహారానికి రూ. 1,45,338.6 కోట్లు, ఎరువులకు రూ. 70,000 కోట్లు, పెట్రోలియంకు రూ. 25,000 కోట్లు కేటాయించారు.
విద్యుత్‌రంగం: సాధారణ బడ్జెట్‌లో విద్యుత్‌రంగానికి రూ. 13,881 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటే ఇది 25 శాతం అధికం. అమెరికాలో తలసరి విద్యుత్ వినియోగం 12,985 యూనిట్లు ఉంటే భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం 765 యూనిట్లు మాత్రమే ఉన్నది. అమెరికాలో సగటు పౌరుడి విద్యుత్ వినియోగంలో మన వినియోగం 6 శాతం మాత్రమే. 1991-92లో మన దేశంలో విద్యుత్ లభ్యత 266 బిలియన్ యూనిట్లు. 2015-16 నాటికి 1091 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. విద్యుత్ సౌకర్యంలేని లక్ష కుటుంబాలకు కరెంటు... బీపీఎల్ కుటుంబాలకు ఉచిత కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రారంభమైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విద్యుత్ యోజనను 2005లో ప్రారంభించారు.
2015 ఏప్రిల్ 1 నాటికి 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
[11/02, 7:39 a.m.] VINAY KUMAR: దేశంలో విద్యుత్ ఉత్పత్తి వివరాలు
బొగ్గు ఆధారితం 61 శాతం
భారీ జలవిద్యుత్ 13.9 శాతం
సూక్ష్మ జలవిద్యుత్ 1.4 శాతం
పవన విద్యుత్ 9.1 శాతం
వ్యర్థాల నుంచి విద్యుత్ 1.6 శాతం
సౌర విద్యుత్ 2.7 శాతం
గ్యాస్ విద్యుత్ 8.2 శాతం
అణు విద్యుత్ 1.9 శాతం
యువసంకల్ప్: 2014 ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం దేశంలో 35.6 (10-24 ఏండ్లమధ్య) కోట్ల మంది ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న యువత శక్తి సామర్ధ్యాలను ఫూర్తిగా వినియోగించడానికి ప్రభుత్వం సంకల్ప్ పథకాన్ని ప్రారభించనున్నది. 3.5 కోట్ల మందికి మార్కెట్ అవసరాలకు సరిపోయేలా శిక్షణ ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నారు. పరిశ్రమలకోసం నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన స్కిల్ స్ట్రెంత్‌నింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ (స్టయివ్) పథకం రెండోదశ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఐటీఐల్లో ఇచ్చే శిక్షణను బలోపేతం చేస్తారు. ప్రపంచబ్యాంకు మద్దతున్న సంకల్ప్, స్టయువ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి.
[11/02, 7:40 a.m.] VINAY KUMAR: గ్రామీణ టెలిఫోన్: భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్- ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్‌నెట్ కనెక్టివిటీతోపాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీసు కేంద్రాలను ఎర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగం పెంచడం, 2017 నాటికి టెలిడెన్సిటీ 70 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది భారత్ నెట్ కోసం రూ. 10,000 కోట్లు కేటాయించారు.
ఆర్థికమంత్రులు ప్రత్యేకతలు
ఇప్పటి వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన 25 ఆర్థికమంత్రుల్లో ఎనిమిది మందికి మాత్రమే అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం డిగ్రీలు కలిగి ఉన్నారు.
1. ఆర్థికమంత్రిగా ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ.
2. తొలి మహిళా ఆర్థికమంత్రి ఇందిరాగాంధీ
3.ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు సీడీ దేశ్‌ముఖ్ (1951-52), మన్మోహన్‌సింగ్
4.ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసి ప్రధాని అయినవారు మన్మోహన్‌సింగ్, వీపీ సింగ్, మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్.
5.1991లో మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. ప్రతుల పరంగా అతి పెద్దది. ఆ బడ్జెట్‌లో 18,520 పదాలు ఉన్నాయి.
6.1952లో సీడీ దేశ్‌ముఖ్ అతి తక్కువ ప్రతులతో ప్రవేశపెట్టారు. కేవలం 4,454 పదాలతో బడ్జెట్‌ను తయారు చేశారు.
7.ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు ఆర్ వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జి
8.అత్యధికంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మొరార్జీదేశాయ్ (10 సార్లు), చిదంబరం (9 సార్ల్లు), ప్రణబ్ ముఖర్జి (8సార్లు)
9.సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక శాఖమంత్రి మధు దండావతే (133 నిమిషాలు)
10. ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనివారు బహుగుణ, జశ్వంత్‌సింగ్
[11/02, 7:40 a.m.] VINAY KUMAR: దేశంలో జాతీయ రహదారులు (2016 జూన్ నాటికి )
మొత్తం పొడవు - 1,00,087.08 కి. మీ.
నాలుగు వరుసల రహదారులు - 26,200.00 కి. మీ.
రెండు వరుసల రహదారులు - 50,000.00 కి.మీ
దేశంలోని రహదారుల్లో జాతీయ రహదారుల వాటా - 1.7 శాతం
రోడ్డు ట్రాఫిక్ వాటా - 40 శాతం
జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్ (8,483 కి.మీ)
తెలంగాణలో జాతీయ రహదారులు - 2,635.84 కి.మీ.
దేశంలో అన్నిరకాల రహదారులు కలిపి మొత్తం - 42,45,429 కి.మీ.
11. అత్యధికంగా తమిళనాడు నుంచి ఆరుగురు ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. వారు షణ్ముఖం శెట్టి, జాన్ మథాయ్, టీటీ కృష్ణమాచారి, చిదంబరం, సుబ్రమణ్యం, ఆర్ వెంకట్రామన్.
ఆర్థిక మంత్రులు- సంస్కరణలు
షణ్ముఖం శెట్టి- స్వాతంత్య్రానంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రి, ప్రణాళిక సంఘం ఏర్పాటు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ప్రవేశపెట్టారు.
జాన్ మథాయ్- 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి.
సీడీ దేశ్‌ముఖ్- తొలిసారిగా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
టీటీ కృష్ణమాచారి- సంపద పన్నును ప్రవేశపెట్టడం, స్వచ్ఛంద ఆదాయం వెల్లడించే పథకం ప్రారంభం, ఐడీబీఐ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు.
జవహర్‌లాల్ నెహ్రూ- బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని (1958), గిఫ్ట్ ట్యాక్స్ ప్రతిపాదన.
[11/02, 7:40 a.m.] VINAY KUMAR: మొరార్జీదేశాయ్- ప్రజాకోణంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా, వ్యవసాయరంగంలో పరిశోధనలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పారు. హరిత విప్లవాన్ని ప్రారంభించారు. బంగారంపై నియంత్రణ కోసం గోల్డ్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. తన పుట్టిన రోజున (ఫిబ్రవరి 29న) 1964, 68లో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వస్తూత్పత్తులపై ఎక్సైజ్ విధానానికి స్వస్తి పలికి స్వీయ మదింపు పద్ధతికి రూపకల్పన చేశారు.
ఇందిరాగాంధీ- బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ, పాల దిగుబడిని పెంచడానికి శ్వేతవిప్లవాన్ని ప్రవేశపెట్టారు.
వైబీ చవాన్- బీమా కంపెనీలను, బొగ్గు గనులను జాతీయం చేయడానికి రూ. 56 కోట్లు కేటాయించారు. రూ. 550 కోట్లు లోటు ఏర్పడటంతో దీన్ని బ్లాక్ బడ్జెట్ అంటారు.
సీ సుబ్రమణ్యం- ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, కుటుంబ పథకాలను ప్రారభించారు.
హెచ్‌ఎం పటేల్- తొలిసారిగా ఆర్థికమంత్రి పదవిని చేపట్టిన కాంగ్రెసేతర వ్యక్తి, కేవలం 800 పదాలతోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
చౌదరి చరణ్‌సింగ్- వినియోగదారుల వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీని విధించారు.
హెచ్‌ఎన్ బహుగుణ- బడ్జెట్‌ను ప్రవేశపెట్టని ఆర్థికమంత్రి.
ఆర్ వెంకట్రామన్- జీవనాధార ఔషధాలపై, సైకిళ్లు, కుట్టుమిషన్లు, ప్రెషర్‌కుక్కర్లపై, ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. రేడియోలపై ఉన్న లైసెన్స్‌ను రద్దుచేశారు.
ప్రణబ్ ముఖర్జి (1982)- ఎన్నారైల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు.
వీపీ సింగ్ (1984)- కొన్ని వరాలు, కొన్ని భారాలతో రూపొందించిన క్యారెక్టరిస్టిక్ బడ్జెట్, చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు, మోడ్ వ్యాట్ పన్ను అమలు, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవరించేలా ఈడీకి అధికారాల పెంపు.
రాజీవ్ గాంధీ (1987)- దీన్ని గాంధీ బడ్జెట్ అంటారు.
[11/02, 7:41 a.m.] VINAY KUMAR: కనీస వాణిజ్య పన్ను (మ్యాట్), కార్పొరేషన్ ట్యాక్స్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
ఎస్‌బీ చవాన్ (1988)- జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రవేశపెట్టారు.
మధు దండావతే- సెబీ ఏర్పాటు. బడ్జెట్‌పై అత్యధిక సమయం మాట్లాడిన ఆర్థిక మంత్రి.
మన్మోహన్ సింగ్- లైసెన్స్ రాజ్‌కు చరమగీతం పలికాడు. సంస్కరణల బడ్జెట్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను ప్రవేశపెట్టాడు. ఎగుమతి, దిగుమతి విధానాల్లో భారీ మార్పు, కస్టమ్స్ సుంకాలను 220 నుంచి 150 శాతానికి తగ్గించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారు.
చిదంబరం (1997)- డ్రీమ్ బడ్జెట్, తొలిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నల్లధనం వెలికితీసేందుకు ఆస్తుల స్వీయ ప్రకటన పథకం ప్రవేశపెట్టారు. ఐటీ రేటు తగ్గించడం వలన పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగి ఆదాయం పెరిగింది.
యశ్వంత్ సిన్హా- 2000, ఫిబ్రవరి 29న సహస్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2000 వరకు సాయంత్రం సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను రద్దుచేసి ఉదయం 11.00 గంటలకు ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రతిపాదించారు.
జశ్వంత్‌సింగ్- అతితక్కువ కాలం (13 రోజులు) పనిచేసిన ఆర్థికమంత్రిగా, బడ్జెట్‌ను ప్రవేశపెట్టని ఆర్థిక మంత్రిగా, ఎలక్ట్రానిక్ విధానంలో ఆదాయం పన్ను వివరాలను నమోదుచేసే విధానానికి శ్రీకారం చుట్టారు.
అరుణ్‌జైట్లీ- సాంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించారు.
ఇతర దేశాల్లో బడ్జెట్లు
అమెరికా బడ్జెట్ 2.82 కోట్ల కోట్లు
చైనా బడ్జెట్ 1.82 కోట్ల కోట్లు
జపాన్ బడ్జెట్ 1.13 కోట్ల కోట్లు
జర్మనీ బడ్జెట్ కోటి కోట్లు
భారతదేశ బడ్జెట్ రూ. 21.47 లక్షల కోట్లు
రైల్వే బడ్జెట్
గత 92 ఏండ్లుగా విడివిడిగా పెడుతున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సాంప్రదాయానికి 2017-18 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం స్వస్తి పలికింది. గత ఆర్థిక సంవత్సరం వరకు రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెట్టారు.
బ్రిటిష్ ఆర్థికవేత్త విలియం అక్‌వర్త్ సారథ్యంలోని కమిటీ సిఫారసు మేరకు 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెడుతున్నారు.
గత బడ్జెట్‌తో పోల్చితే రూ. 10 వేల కోట్లు అధికం. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.31 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఇందులో 55 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రకటించింది. ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏటా 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేండ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైల్వే భద్రత నిధి (నేషనల్ రైల్వే సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ట్రాక్స్‌తోపాటు సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ, కాపలాలేని క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించడం, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించడం తదితర అవసరాలకు ఆ నిధిని ఉపయోగిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి రైల్వే బడ్జెట్‌ను జాన్ మథాయ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రైల్వే శాఖమంత్రి సురేశ్‌ప్రభు.
[11/02, 7:41 a.m.] VINAY KUMAR: ముఖ్యాంశాలు
2017-18 ఆర్థిక సంవత్సరంలో 3500 కి.మీ. మేర రైల్వేలైన్ల ఏర్పాటు. గతేడాది ఇది 2,800 కి.మీ.
ప్రయాణికుల భద్రత, స్వచ్ఛత, ఆర్థిక, అకౌంటింగ్ సంస్కరణలపై ప్రధాన దృష్టి
ప్రయాణికుల భద్రత కోసం రూ. లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ నిధి (జాతీయ రైలు భద్రత నిధి) ఏర్పాటు.
దివ్యాంగుల కోసం ఏ1 స్టేషన్లలో ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటు
ఈ-టికెట్‌ను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకొనే టికెట్లకు సర్వీస్‌చార్జి నుంచి మినహాయింపు. ఇప్పటివరకు స్లీపర్ కోచ్‌లకు రూ. 20, ఏసీ క్లాసులకు రూ. 40 సర్వీస్‌చార్జి ఉండేది. తాజా నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ ఏటా రూ. 500 కోట్ల వరకు నష్టపోతున్నది. రైల్వేల్లో నగదురహిత రిజర్వేషన్లు 58 శాతం నుంచి 68 శాతానికి పెరిగాయి.
బ్రాడ్‌గేజ్ మార్గాల్లో 2020 నాటికి అన్‌మ్యాన్ రైల్వే గేట్లను పూర్తిగా తొలిగిస్తారు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, అభివృద్ధికి 9 రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేలు జాయింట్ వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. దీనికి 70 ప్రాజెక్టులను గుర్తించారు.
స్టాక్ ఎక్స్చేంజ్‌లో రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) ఇర్కాన్ వంటి ప్రభుత్వ సంస్థల నమోదు
ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా త్వరలో ప్రైవేటు భాగస్వామ్యంలో నూతన మెట్రో రైల్ విధానం
500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు తదితర సౌకర్యాల ఏర్పాటు
రాబోయే మూడేండ్లలో రైల్వేల ఉత్పాదకతను కనీసం 10 శాతం మేర పెంచుతారు. గుర్తించిన కారిడార్లను నవీకరించి అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని సాధిస్తారు.
రైల్వేల పరిశుభత్ర కోసం ఎస్‌ఎంఎస్ ఆధార్ క్లీన్ మై కోచ్ (మా రైలుపెట్టెను శ్రుభం చెయ్యండి) సర్వీసు ప్రారంభం
రైలుపెట్టెల్లో అవసరాలు, బోగీలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం రైలు మిత్ర సౌకర్యం ఏర్పాటుకు
[11/02, 7:42 a.m.] VINAY KUMAR: ప్రతిపాదన
పర్యాటక, ఆధ్యాత్మిక పర్యటనల కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
న్యూఢిల్లీ, జైపూర్ రైల్వే స్టేషన్లలో బయో డిగ్రీ డబుల్ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటు
దాదాపు ఏడువేల రైల్వేస్టేషన్లలో సౌర విద్యుత్ అందించడానికి చర్యలు. ఇప్పటికే 300 స్టేషన్లలో అమలు. సోలార్ మిషన్లలో భాగంగా మరో రెండువేల స్టేషన్లలో అమలు చేస్తారు.
దేశవ్యాప్తంగా 14 మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ. 17,810 కోట్లు కేటాయించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, జైపూర్, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, నాగపూర్, పుణె, నోయిడా, వైజాగ్, విజయవాడల్లో మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం వాటా, రుణాలు, సహాయం రూపంలో ఈ మొత్తాన్ని అందిస్తారు. ఏ ప్రాజెక్టుకు ఎంత అన్నది స్పష్టత లేదు.
అన్ని సౌకర్యాలతో ఖరీదైన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణికుల కోసం తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.
సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించనున్నారు. వీటిలో అన్నీ రెండో తరగతి బోగీలే ఉన్నాయి.
[11/02, 7:42 a.m.] VINAY KUMAR: కేటాయింపుల్లో తెలంగాణ
రైల్వే బడ్జెట్‌లో కొత్త రైల్వేలైన్లకు రూ. 887 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 436 కోట్లు, వంతెనల పటిష్టతకు రూ. 31 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ. 3,034 కోట్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ. 338 కోట్లు కేటాయించారు.
దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఆర్మూర్ - ఆదిలాబాద్ వయా నిర్మల్ నిర్మాణానికి అనుమతించింది. 220 కి.మీ. పొడవున్న ఈ మార్గం నిర్మాణానికి రూ. 2800 కోట్లు వ్యయం అవుతుంది.
నాలుగు మార్గాల సర్వేకు బడ్జెట్‌లో అవకాశం కల్పించారు.
రైళ్ల క్రాసింగ్ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: రూ. 125 కోట్లు అంచనా వ్యయంతో వనపర్తి - కౌకుంట్ల, మానవపాడు - అలంపూర్ రోడ్డు, ఇటిక్యాల - మానవపాడుల్లో స్టేషన్లు మంజూరయ్యాయి.
రాష్ట్రంలో చివరిదశలో ఉన్న రెండు ప్రాజెక్టులకు రూ. 104 కోట్లు, వివిధ స్థాయిల్లో ఉన్న మరో ఎనిమిది ప్రాజెక్టులకు రూ. 1565 కోట్లు మంజూరయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నూతన టెర్మినల్ నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించింది.
ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ. 16 కోట్లు మంజూరు చేసింది.
బొల్లారం - ముద్‌ఖేడ్, మంచిర్యాల-గడ్చిరౌలిలతోపాటు కాజీపేట-బల్లార్ష, కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి సర్వే చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ. 1729 కోట్లు ఇచ్చారు.
రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే వ్యవస్థ (ట్రైన్ కొల్యూజన్ అవాయిడెన్స్ సిస్టం)ను సికింద్రాబాద్-వాడీ, వికారాబాద్-బీదర్ మధ్య అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా 23 రైల్వే స్టేషన్ల పునర్‌నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలోని రైలు మార్గాల పొడువు 1753 కి.మీ.
[11/02, 7:42 a.m.] VINAY KUMAR: తొలి బడ్జెట్
స్వాతంత్య్రానంతరం తొలిసారిగా బడ్జెట్‌ను షణ్ముఖం శెట్టి రూ. 197 కోట్ల అంచనా వ్యయంతో 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు.
అంచనా ఆదాయం రూ. 171 కోట్లు
అంచనా వ్యయం రూ. 197 కోట్లు
తంతితపాలా ద్వారా ఆదాయం రూ. 15.9 కోట్లు
రక్షణ కోసం కేటాయించింది రూ. 92.74 కోట్లు
దేశవిభజన.. ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలు, కాందిశీకులవంటి సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ఈ బడ్జెట్‌లో ఆహరధాన్యాల ఉత్పత్తిని పెంచడం, దేశరక్షణను పటిష్టపర్చడం, పౌరసదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించారు.
బడ్జెట్‌లో తెలంగాణ
తెలంగాణలో నామమాత్రంగా పరిశ్రమలకు వడ్డ్దీ రాయితీ.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణచట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి వడ్డీ రాయితీల్లో భాగంగా రూ. 100 కోట్లు కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 20 కోట్లు కేటాయించారు. బయ్యారంలో స్టీలు ప్లాంటు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా, ఎయిమ్స్ మొదలైన వాటిగురించి బడ్జెట్‌లో ప్రస్థావనే లేదు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ర్టాలకు పంచే (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం రాష్ర్టానికి దక్కింది. ఇది రూ. 16,505.02 కోట్లకు సమానం. ఇందులో గతేడాది కంటే 16.26 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్ పన్ను రూ. 4,859.14 కోట్లు, ఆదాయం పన్ను రూ. 4,248.14 కోట్లు, కస్టమ్స్ పన్ను రూ. 2,319 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 2424 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ. 2,654 కోట్లు.
కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section