Type Here to Get Search Results !

Vinays Info

World Radio Day | ప్రపంచ రేడియో దినోత్సవం

ప్రపంచ రేడియో దినోత్సవం
(Theme for the 2017 “Radio is You !”)

🔻రేడియో అద్భుతమైన, శక్తివంతమైన ప్రసార సాధనం.. దేవుడిలో ఉన్న అద్భుతం అందులో ఉంది. - మహాత్మాగాంధీ, చివరి రేడియో ప్రసంగం (1947 నవంబర్‌ 12)

*🍥నేపథ్యం*
*🔸2011లో జరిగిన 36వ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో యునెస్కో ఫిబ్రవరి 13ను ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించింది.*

*🔸ఫిబ్రవరి 13న జరగనున్న ప్రపంచ రేడియో దినోత్స వంతో సమానంగా యునెస్కో చొరవతో అదే రోజున 1946లో రేడియో యునైటెడ్‌ నేషన్స్‌ వ్యవస్థాపక దినోత్సవం కూడా జరగడం హర్షదాయకం.*

*🔸రేడియోను మారుమూల ప్రాంతాల ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి వారిలో విజ్ఞానాన్ని పెంచాలనేది ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్స వాన్ని జరపడం ప్రారంభించారు. రేడియో ద్వారా సమాచారాన్ని అతి తక్కువ ఖర్చుతో త్వరగా చేరవేయ డానికి సులువైన మార్గముగా వాళ్ళుభావించారు.ప్రపంచంలోనే అంతరఖండాల రేడియో స్టేషన్ ని మొదలుపెట్టారు.*

🔸ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా రేడియోలు తమ కార్యక్రమాలను అక్కడ నుండి ప్రసారం చేయ నున్నాయి. ప్రపంచ రేడియో ఉత్సవాల సందర్భంగా ప్రస్తుత రేడియో జర్నలిజం, రేడియో చరిత్రలపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా ఎనౌన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, షార్ట్‌వేవ్‌, యువతకు సంబంధించిన రేడియో కార్య క్రమాలు తదితర అంశాలపై విస్తృతస్థాయిలో చర్చా కార్య క్రమాలు జరగనున్నాయి. ఈ రోజుల్లో రేడియో ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంది. ఏ సమయం లోనైనా సరే సుదూర ప్రాంత వార్తలను అందించడం లోనూ, పేదలు, మైనార్టీలు, మహిళలకు సంబం ధించిన సమస్యలపై తమ గొంతుకను వినిపించడంలోనూ రేడియో ముందంజలో ఉందని యునెస్కో జనరల్‌ డైరెక్టర్‌ ఇరినాబొకొవా తెలిపారు.

🔸నేటి కాలంలో రేడియో అత్యంత సమాచార వనరుగా మారింది. ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారు. 

*🍥సమాచార తరంగిణి ఆకాశవాణి*

 🔸భారతదేశంలో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌లో రేడియో క్లబ్‌ ఆఫ్‌ బొంబాయి ద్వారా ప్రసారమయ్యేవి.  తరువాత బ్రాడ్‌ కాష్టింగ్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రసారాలు చేసింది.  ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది.  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి) మాత్రమే ఉన్నాయి. 

🔸ఇప్పుడు 215 కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 ఎంవివి కేంద్రాలు, 54ఎస్‌వివి కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.  1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలి సారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్‌ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను రేడియో భానుమతి అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా రిటైర్‌ అయ్యింది.  తెలుగులో మొదటి రేడియో నాటకం ‘అనార్కలి’ మద్రాసు కేంద్రం ద్వారా 1938 జూన్‌లో ప్రసారమైంది. శ్రీయుత విశ్వనాథ సత్యనారా యణ, వింజమూరి నరసింహరావు, ముద్దు కృష్ణ సమర్పించి నటించారు.  నటుడు కొంగర జగ్గయ్య, ఉష శ్రీ, ప్రయాగ రామకృష్ణ లాంటి ఎందరో మహానుభావులు ఆకాశవాణిలో పనిచేశారు.   మన రాష్టంలో అదిలాబాద్‌, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబా ద్‌, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాద్‌, తిరుపతి, వరంగల్‌లో ఆకాశవాణి ప్రసార కేంద్రాలు ఉన్నాయి.

*🍥ఆదరణ పెరిగింది..*
🔸ఈ మధ్య కాలంలో రేడియో ప్రసారాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆల్‌ఇండియా రేడియో తోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియోలు రావడం వల్ల శ్రోతలు ఆయా ప్రసారాలను వినడానికి పోటీ పడుతున్నారు. టివిలరాకతో రేడియో ప్రసారాలకు ఆదరణ తగ్గలేదు. టివి అనేది ఒకే దగ్గర కూర్చొని వీక్షించే అవకాశం ఉంది. కాని రేడియో మాత్రం ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుంది. వెస్ట్రన్‌ నుంచి ఈ కాన్సెప్ట్‌ను తీసకున్నారు. ముఖ్యంగా రేడియోలో ప్రయోజిత కార్యక్రమాలు, ఫోన్‌ఇన్‌ ప్రోగ్రామ్స్‌, ప్రత్యక్ష కార్యక్రమాలు, ఫిలిమ్‌ మ్యూజిక్‌ వంటి వారికి మంచి ఆదరణ ఉంటోంది. ప్రజలతో మమేకం అవ్వడం ఎక్కువైంది. దీంతో శ్రోతల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించే వీలు ఎక్కువైంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు రేడియోను వింటూ తమ పనులు చేస్తున్నారు

*🍥మనబాణి..ఆకాశవాణి*

🔸పెన్నులోనూ... మెుబైల్‌ ఫోన్‌లోనూ... కారులోనూ... ఇతర వాహనాల్లోనూ రేడియోలు అమరిపోతున్నాయి . కాలక్షేపానికి, విజ్ఞాన సముపార్జనకు మంచి మాధ్యమంగా మారింది. రేడియో ఆకాశవాణిలో పనిచేసి.. తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతలను కట్టిపడేసి... ఓ వెలుగువెలిగిన పండితులు ఎందరో ఉన్నారు. ఉషశ్రీ రామాయణ వ్యాఖ్యానం రేడియోకు ఎంత పేరు తెచ్చిందో... ఆయనకూ..  రామాయణానికి అంతే ప్రఖ్యాతి తెచ్చింది. సినీ ప్రముఖులు, సాహితీ శ్రేష్ఠలు.. నాటకరంగ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులూ ఒకరేమిటి ఎందరో మహానుభావులకు ‘స్వరం గా'' మారింది మన రేడియో.

*🍥ఎలా పనిచేస్తుంది...*

*🔸కాంతి వేగ పౌనపున్యాలతో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌తో గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసేదే దూర శ్రవణ ప్రక్రియ అని అంటారు. ఇలాంటి శబ్దాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అని అంటారు. మొదటి రోజులలో వాల్‌‌వలను ఉపయోగించి తయారు చేసేవారు. వీటికి ఎక్కువ విద్యుత్‌ వినియోగంతో పాటు పరిమాణంలోనూ చాలా పెద్దవిగా ఉండేవి. ప్రస్తుత టెలివిజన్‌లా ఒక చోట ఉంచి మాత్రమే వినాల్సి వచ్చేది. 1960 వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టర్లు వచ్చాయి. వీటితో తయారైన రేడియో అందుబాటులోకి వచ్చింది. ఇవి తక్కువ విద్యుత్‌తో పాటు బ్యాటరీల  ద్వారా కూడా పనిచేసేవి. రానురాను సాంకేతిక అభివృద్ధి చెందడంతో ఈ రేడియోలు అతి చిన్న పరిమాణంలోకి మారాయి. ప్రసుత్తం ప్రతీ మొబైల్‌లో రేడియో అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు.*

*🍥రకాలు...*
ప్రజలు వినే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. మధ్యతరహా(మీడియం వేవ్), అతి చిన్న తరంగాలు(షార్ట్ వేవ్),ఎఫ్‌.ఎమ్‌(ఫ్రీక్వెన్సీమాడ్యులేషన్‌) . 
*🔸మధ్య తరహా తరంగాలు:* ఈ ఫ్రీక్వెన్సీని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్య రకంగా ఉంటుంది. మనం వింటున్న హైదరాబాద్‌, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి.

*🔸అతి చిన్న తరంగాలు:* ఈ ప్రీక్వెన్సీని సుదూర ప్రాంతాలకు ప్రసారానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ కోణాన్ని బట్టి  ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్లను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. ట్రాన్స్‌మిటరు ఏరియల్‌ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు.. తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరెగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి, వి.వొ.ఎ అనే అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేశాయి.. చేస్తున్నాయి.

*🍥ఎఫ్‌.ఎమ్‌:* ఈ ప్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్‌లు ప్రసారాలు అందిస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రైవేట్‌ ఛానల్స్‌ ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్‌ ఎఫ్‌.ఎమ్‌., (93.5) ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఈ ధ్వని తరంగాలు ప్రసారమయ్యే మధ్యలో ఎతైన భవంతులు, కొండలు వస్తే అక్కడితో ఆగిపోతాయి. వచ్చినంత వరకైనా ఈ పద్ధతిలోని ప్రసారాలు నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. ఇవి కాక, సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి.

*🍥రెయిన్‌బో:* కొత్తగా వస్తున్న ఎఫ్‌.ఎం.లకు ధీటుగా ఆకాశవాణి తింటే గారెలే తినాలి... వింటే రెయిన్‌బో వినాలి అంటూ దాని అనుబంధ ఎఫ్‌.ఎం. ‘రెయిన్‌బో’
ప్రచారం చేపట్టింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

*🍥ఆకాశవాణి...*
ఆలిండియా రేడియో(ఎ.ఐ.ఆర్‌) ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ అధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి విభాగం. దూరదర్శన్‌ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెంట్‌ వీధిలో భారత పార్లమెంట్‌ పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌లో ఉంది. ఆకాశవాణి భవన్‌లో నాటక విభాగం, ఎఫ్‌.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే స్టేషన్‌ కూడా ఉంది. ఈ స్టేషన్‌లో 24 గంటలు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి.

*🔻ఏది ఏమైనప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  మిగిలిన ప్రసార సాధనాల పోటీ ని తట్టుకొనేవిధంగా ఆధునిక రేడియో లో కూడా అనేక మార్పులతో ప్రజల్లోకి దూసుకు పోతుంది.ఈ ఉద్దేశంతోనే 6వ ప్రపంచ రేడియో దినోత్సవ నినాదం-“Radio is You!”తో ప్రజల్లోకి వచ్చింది..మరి ఆదరించి,మన సంసృతిని కాపాడుకుందాం...*

🍒🕊✍సే:సురేష్ కట్టా (సోషల్ టీచర్)
                  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section